బ్రహ్మ కుమారీస్ తాలూకు ఏడుకార్యక్రమాల ప్రారంభించిన ప్రధాన మంత్రి
ఆలోచనమరియు వైఖరి సరికొత్తవిగా ఉన్నటువంటి మరియు నిర్ణయాలు క్రమాభివృద్ధి సహితంగాఉన్నటువంటి భారతదేశం ఆవిర్భావానికి మనం సాక్షులు గా ఉన్నాం’’
‘‘భేదభావానికి తావు లేనటువంటి ఒక వ్యవస్థ ను ప్రస్తుతం మనం ఆవిష్కరిస్తున్నాం, సమానత్వం మరియుసామాజిక న్యాయం అనే పునాదుల మీద దృఢం గా నిలబడ్డ ఒక సంఘాన్ని మనం నిర్మిస్తున్నాం’’
‘‘ప్రపంచం చిమ్మచీకటి లో మగ్గుతూ, మహిళల విషయం లో పాతవైనఆలోచన విధానాల లో చిక్కుకుపోయి ఉన్నటువంటి కాలం లో భారతదేశం మహిళల ను మాతృ శక్తిగా, దేవత గా ఆరాధించేది’’
‘‘అమృతకాలం అంటే నిద్రపోతూ కలలు గనడం కాదు, మన సంకల్పాల ను నిశ్చితం గా నెరవేర్చుకోవడంకోసం ఉద్దేశించినటవంటిది. రాబోయే 25 సంవత్సరాలుఅత్యంత కఠోర శ్రమ, త్యాగం మరియు తపస్సు ల కాలం. ఈ పాతికేళ్ల కాలం- మన సంఘం బానిసత్వం లో గడిపిన వందల కొద్దీ సంవత్సరాలలో కోల్పోయిన దాన్నంతటి నితిరిగి సాధించుకోవడానికి ఉద్దేశించిన కాలం- సుమా.’’
దేశం లోప్రతి ఒక్కరి గుండె లో ఒక దివ్వె ను మనమంతా తప్పక వెలిగించాలి- అదే కర్తవ్య దీపం. కలసికట్టుగా మనం దేశాన్ని కర్తవ్యపథం లో ముందుకు తీసుకుపోదాం; అప్పుడు సంఘం లో వ్యాపించిన చెడులను తొలగించడం సాధ్యపడి దేశం కొత్త శిఖరాల నుఅందుకోగలుగుతుంది’’
‘‘ప్రస్తుతం, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ కాలం లోప్రపంచం భారతదేశాన్ని గురించి సరి అయిన రీతి లో తెలుసుకొనేటట్టు చేయడం కూడా మనబాధ్యతే’’

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’ జాతీయ ప్రారంభ కార్యక్రమం లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు. ఆయన బ్రహ్మ కుమారీస్ యొక్క ఏడు కార్యక్రమాల కు జెండా ను కూడా చూపెట్టారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, శ్రీ పర్ శోత్తమ్ రూపాలా, ఇంకా శ్రీ కైలాస్ చౌధరి తదితరులు ఉన్నారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, బ్రహ్మ కుమారీ సంస్థ ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుక లో స్వర్ణ భారతదేశం కోసం ప్రేరణ ను, ఉత్సాహాన్ని, అనుభూతి ని దృష్టాంతం గా వివరిస్తోందన్నారు. వ్యక్తిగత ఆకాంక్ష లకు, సాఫల్యాల కు మధ్య ఎలాంటి భేదం లేదని, అలాగే జాతీయ ఆకాంక్షల కు మరియు సాఫల్యాల కు మధ్య కూడా ఎలాంటి భేదం లేదు అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ ప్రజల పురోగతి లోనే మన క్రమాభివృద్ధి ఇమిడివుంటుందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘దేశం యొక్క అస్తిత్వం మన నుంచే వస్తుంది, మరి మనం దేశం ద్వారానే ఉనికి లోకి వస్తాం. ఈ గ్రహింపు ఒక న్యూ ఇండియా నిర్మాణం లో మన భారతీయుల యొక్క అతి ప్రధానమైనటువంటి బలం గా మారుతున్నది. దేశం ప్రస్తుతం చేస్తున్న ప్రతి దానిలోనూ ‘సబ్ కా ప్రయాస్’ కలిసి ఉంది’’ అని ఆయన అన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనేది దేశానికి దారి ని చూపే ధర్మసూత్రం గా మారుతున్నది అని కూడా ఆయన వివరించారు.

న్యూ ఇండియా యొక్క సరికొత్తదైనటువంటి మరియు క్రమాభివృద్ధి తో కూడుకొన్నటువంటి నూతన ఆలోచనల సరళి ని గురించి, నవీన వైఖరి ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, ‘‘ప్రస్తుతం మనం భేదభావానికి తావు లేనటువంటి ఒక వ్యవస్థ ను సృష్టిస్తున్నాం, మనం సమానత్వం, ఇంకా సామాజిక న్యాయం అనే పునాది మీద దృఢం గా నిలబడివుండేటటువంటి ఒక సంఘాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు.

 

మహిళల ను ఆదరించేటటువంటి మరియు మహిళల కు ప్రాముఖ్యాన్ని ఇచ్చేటటువంటి భారతదేశం సంప్రదాయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచం చిమ్మ చీకటి లో మగ్గుతూ మహిళల విషయం లో పాతదైనటువంటి ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు, ఆ కాలం లోనే భారతదేశం మహిళల ను మాతృ శక్తి గాను, దేవత గాను పూజిస్తూ వచ్చింది. మన దేశం లో గార్గి, మైత్రేయి, అనుసూయ, అరుంధతి మరియు మదాలస వంటి విదుషీమణులు సంఘానికి జ్ఞ‌ానాన్ని ఇస్తూ వచ్చారు’’ అని ఆయన అన్నారు. భారతదేశ చరిత్ర తాలూకు వేరు వేరు యుగాల లో ప్రశంసాయోగ్యమైనటువంటి మహిళ ల తోడ్పాటు ను గురించి ఆయన తెలిపారు. మధ్యయుగం నాటి కష్ట కాలాల్లో, పన్నా ధాయి ఇంకా మీరాబాయి ల వంటి మహనీయమైన మహిళలు ఈ దేశం లో ఉండే వారు అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకువచ్చారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో సైతం, అనేక మంది మహిళ లు త్యాగాలు చేశారు అని ఆయన అన్నారు. కిత్తూరు కు చెందిన రాణి చెన్నమ్మ, మాతంగిని హజరా, రాణి లక్ష్మిబాయి, వీరాంగన ఝల్ కారి బాయి మొదలుకొని, సామాజిక రంగం లో అహిల్యాబాయి హోల్కర్ మరియు సావిత్రిబాయి ఫులే లు భారతదేశం యొక్క గుర్తింపు ను పరిరక్షించారు అని ఆయన వివరించారు. సాయుధ దళాల్లోకి బహిళల ప్రవేశం, మరిన్ని ప్రసూతి సెలవులు, మరింత ఎక్కువ మంది వోట్లు వేయడం, ఇంకా మంత్రిమండల లో ప్రాతినిధ్యం వంటి రూపాల లో రాజకీయ రంగం లో మెరుగైన ప్రాతినిధ్యం వంటివి మహిళల్లో నూతన ఆత్మవిశ్వాసానికి ఒక సంకేతం గా నిలచాయి అని ఆయన అన్నారు. ఈ ఉద్యమం సమాజ ప్రధానమైంది గా ఉండడం తో పాటు దేశం లో ఆడ మగ నిష్పత్తి మెరుగుపడటం పట్ల ఆయన సంతృప్తి ని వ్యక్తం చేశారు.

మన సంస్కృతి ని, మన నాగరకత ను, మన విలువల ను సజీవం గా అట్టిపెట్టవలసిందంటూను, మన ఆధ్యాత్మికత ను పరిరక్షించవలసింది గాను, మన వైవిధ్యాన్ని ప్రోత్సహించవలసిందిగాను ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అదే కాలం లో, సాంకేతిక విజ్ఞ‌ానం, మౌలిక సదుపాయాల కల్పన, విద్య మరియు వైద్యం వ్యవస్థల ను అదే పని గా ఆధునికీకరిస్తూ ఉండవలసిన అవసరం ఎంతయినా ఉంది అని ఆయన స్పష్టంచేశారు.

‘‘అమృత కాలం అనేది నిద్రిస్తూ కలలు కనడం కోసం కాదు, అంతకంటే అది మనం జాగ్రదావస్థ లోనే ఉండి సంకల్పాల ను నెరవేర్చుకోవలసిన కాలం అని ప్రధాన మంత్రి తెలియజేశారు. రాబోయే 25 సంవత్సరాలు అత్యంత కఠోర శ్రమ, త్యాగం మరియు తపస్సు ల కాలం. ఈ పాతికేళ్లు మన సంఘం వందల కొద్దీ సంవత్సరాల బానిసతనం లో కోల్పోయినదానిని మనం మళ్లీ సాధించుకొనే కాలం’’ అని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యం తరువాతి 75 సంవత్సరాల లో విధుల ను పట్టించుకోని పాపం, విధుల ను అన్నిటికంటే మిన్న గా భావించని దోషం జాతీయ జీవనం లోకి చొరబడింది అనే విషయాన్ని ఒప్పుకొని తీరవలసిందే అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కాలం లో, మనం హక్కుల ను గురించి మాట్లాడుకొంటూ, పోట్లాడుకొంటూనే సమయాన్ని గడిపేశాం అని ఆయన అన్నారు. హక్కుల ను గురించిన సంభాషణ కొంత వరకు సరి అయినదే కావచ్చు, కొన్ని పరిస్థితుల లో అయితే ఒకరి విధుల ను పూర్తి గా మరచిపోవడం అనేది భారతదేశాన్ని బలహీనంగా మార్చివేయడం లో ఒక పెద్ద పాత్ర ను పోషించింది అని ఆయన ఉద్ఘాటించారు. దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి గుండె లో ఒక దివ్వె ను వెలిగించండి - అదే కర్తవ్యం అనేటటువంటి దీపం. మనం అందరం కలసికట్టు గా, దేశాన్ని కర్తవ్య మార్గం లోకి ముందుకు తీసుకుపోదాం. అప్పుడు సంఘం లో ఉన్న చెడులు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది మరి దేశం కొత్త శిఖరాల కు చేరుకొంటుంది.’’ అని అందరి కి ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

భారతదేశం యొక్క ప్రతిష్ట ను, అంతర్జాతీయ స్థాయి లో సైతం ధ్వంసం చేసే ధోరణి పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇవి కేవలం రాజకీయాలే అని అంటూ దీని నుంచి మనం తప్పించకోలేం. ఇవి రాజకీయాలు కాదు, ఇది మన దేశానికి సంబంధించిన ప్రశ్న. ప్రస్తుతం, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న కాలం లో, భారతదేశాన్ని గురించి ప్రపంచ దేశాలు సరి అయిన రీతి లో తెలుసుకొనేటట్టు చూడటం కూడా మన బాధ్యత గా ఉన్నది’’ అంటూ ఆయన మనసు కు హత్తుకొనేటట్టు చెప్పారు. అంతర్జాతీయ ఉనికి కలిగివున్నటువంటి సంస్థ లు ఇతర దేశాల ప్రజల కు భారతదేశం తాలూకు సరి అయినటువంటి చిత్రాన్ని చూపగలగాలి; మరి అంతే కాదు, భారతదేశాన్ని గురించి వ్యాపింపచేస్తున్నటువంటి వదంతుల ను గురించిన వాస్తవాన్ని తెలియజెప్పాలి అని సూచిస్తూ తన ఉపన్యాసాన్ని ప్రధాన మంత్రి ముగించారు. భారతదేశాని కి విచ్చేసి ఈ దేశాన్ని గురించి తెలుసుకోండి అంటూ ప్రజల ను ప్రోత్సహించాలి అంటూ బ్రహ్మ కుమారీస్ వంటి సంస్థల కు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi