ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి గ్రీసు ప్రధాని శ్రీ కిరియకోస్ మిట్సుటాకీస్ ఫోన్ చేశారు.
భారత సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని గ్రీస్ ప్రధాని శ్రీ మిట్సుటాకీస్ అభినందించారు.
ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి చర్చల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పుంజుకోవడంపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత- గ్రీసు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్న అభిప్రాయాన్ని పునరుద్ఘాంటించారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పీఎం శ్రీ మిట్సుటాకీస్ భారత పర్యటన అనంతరకాలంలో- వాణిజ్యం, రక్షణరంగం, నౌకాయానం, తత్సంబంధిత అనుసంధాన వ్యవస్థల పరంగా చోటు చేసుకున్న పురోగతిని ఇద్దరు నేతలూ సమీక్షించారు.
పశ్చిమాసియాలోని తాజా పరిణామాలు, భారత్- మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్ధిక మండలి (ఐఎంఈఈసీ) తోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.
తరచూ మాట్లాడుకునేందుకు ఉభయులూ అంగీకరించారు.
Yesterday, had a productive conversation with PM @kmitsotakis, reaffirming our shared commitment to strengthening the India-Greece Strategic Partnership. Together, we aim to deepen our collaboration across trade, defence, shipping and connectivity. Greece is a valued partner for…
— Narendra Modi (@narendramodi) November 2, 2024