రశ్యన్ ఫెడరేశన్ యొక్క ప్రెసిడెంటు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.
రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల కు తరువాయి గా ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన అనేక అంశాల లో పురోగతి ని ఇద్దరు నేత లు సమీక్షించారు.
వారు ద్వైపాక్షిక సంబంధాల లో ఘటన క్రమాల ను సానుకూల దృక్పథం తో అంచనా వేయడం తో పాటు ఇండియా-రశ్యా స్పెశల్ & ప్రివిలిజ్‌డ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను మరింత బలోపేతం చేయడం కోసం అనుసరించవలసిన కార్యక్రమాల తో ఒక మార్గసూచీ ని రూపొందించడాని కి సమ్మతించారు.
పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల ను మరియు ప్రపంచ అంశాల ను గురించి కూడా వారు వారి యొక్క అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు తెలియ జేసుకొన్నారు.
బ్రిక్స్ కు 2024 వ సంవత్సరం లో రశ్యా అధ్యక్షత వహించనున్న సందర్భం లో ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేసి, భారతదేశం యొక్క పూర్తి సమర్థన ను గురించిన హామీ ని ఇచ్చారు.
సంప్రదింపుల ను ఎప్పటికప్పుడు కొనసాగించడానికి నేత లు ఇద్దరూ అంగీకరించారు.