పాలస్తీనా అధ్యక్షుడు మాన్య శ్రీ మహమూద్ అబ్బాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
గాజా లో అల్ అహ్ లీ ఆసుపత్రి లో పౌరులు హతులవడం పట్ల ప్రధాన మంత్రి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
భారతదేశాని కి మరియు ఈ ప్రాంతాని కి మధ్య సాంప్రదాయకం గా సన్నిహితమైనటువంటి మరియు చరిత్రాత్మకమైనటువంటి సంబంధాలు కొనసాగుతూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఆ ప్రాంతం లో ఉగ్రవాదం, హింస మరియు క్షీణిస్తున్నటువంటి భద్రత సంబంధి స్థితి ల పట్ల తీవ్ర ఆందోళన ను వెలిబుచ్చారు.
ఇజ్ రాయిల్-పాలస్తీనా అంశం పట్ల భారతదేశం చాలా కాలం గా అనుసరిస్తున్న వైఖరి ని మరియు సైద్ధాంతిక స్థితి ని ఆయన పునరుద్ఘాటించారు.
అధ్యక్షుడు శ్రీ మహమూద్ అబ్బాస్ వర్తమాన స్థితి ని గురించి న తన మదింపు ను ఈ సందర్భం లో వెల్లడించారు. భారతదేశం యొక్క సమర్థన కు గాను ఆయన ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను తెలియజేస్తూ భారతదేశం యొక్క దృష్టికోణాన్ని ప్రశంసించారు.
పాలస్తీనా ప్రజల కోసం మానవత భరిత సహాయాన్ని అందజేస్తూ ఉండడాన్ని భారతదేశం కొనసాగిస్తుంది అని ప్రధాన మంత్రి తెలిపారు.
నేతలు ఇరువురు ఒకరి తో మరొకరు క్రమం తప్పక సంప్రదింపులు సాగించాలి అనే అంశం లో సమ్మతి ని వ్యక్తం చేశారు.