ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని గౌరవనీయ బెంజమిన్ నెతన్యాహుతో సంభాషించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఇజ్రాయెల్ ప్రధానమంత్రి PM @netanyahuతో మాట్లాడాను. భారత-ఇజ్రాయెల్ బహుముఖ భాగస్వామ్యం మరింత బలోపేతం దిశగా అనుసరించాల్సిన మార్గాలపై ఆయనతో చర్చించాను. అలాగే ఆవిష్కరణ భాగస్వామ్యంతోపాటు రక్షణ-భద్రత రంగాల్లో ప్రస్తుత ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపైనా అభిప్రాయాలు పంచుకున్నాం” అని ప్రధాని వివరించారు.
Spoke with PM @netanyahu and discussed ways to strengthen the multifaceted India-Israel friendship, deepen our focus on innovation partnership, and our ongoing cooperation in defence and security.
— Narendra Modi (@narendramodi) February 8, 2023