ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ దేశ అమీరు శ్రీ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ తో మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భం లో కృపాపూర్వక శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను అమీరు కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలికారు. కతర్ లో జరుగనున్న ఫీఫా వరల్డ్ కప్ ఫలప్రదం కావాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను కూడా వ్యక్తంచేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కతర్ యొక్క అమీరు శ్రీ Amir @TamimBinHamad తో సంభాషించినందుకు నేను సంతోషిస్తున్నాను. దీపావళి సందర్భం లో వారు వారి యొక్క కృపాభరితమైనటువంటి శుభకామనల ను అందించినందుకు గాను వారి కి నేను ధన్యవాదాల ను వ్యక్తం చేశాను. అంతేకాకుండా కతర్ లో జరుగబోయేటటువంటి @FIFAWorldCup సఫలం కావాలి అంటూ నా యొక్క శుభాకాంక్షల ను కూడా తెలియజేశాను. 2023వ సంవత్సరం లో భారతదేశం-కతర్ దౌత్య సంబంధాల యొక్క 50 సంవత్సరాల ఘట్టాన్ని సంయుక్తం గా ఘనం గా జరుపుకోవాలి అని మేం అంగీకరించాం.’’ అని వెల్లడించారు.
Was happy to speak with HH Amir @TamimBinHamad of Qatar. Thanked him for his gracious Diwali greetings, and conveyed best wishes for a successful @FIFAWorldCup in Qatar. We agreed to jointly celebrate 50 yrs of India-Qatar diplomatic relations in 2023.
— Narendra Modi (@narendramodi) October 29, 2022