అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి పనుల విషయమై హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. -ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ అభివృద్ధి కార్యాలు అరుణాచల్ ప్రదేశ్ లోని సుదూర ప్రాంతాల లో నివసిస్తున్న ప్రజల జీవన నాణ్యత ను మెరుగుపరుస్తాయి’’ అని పేర్కొన్నారు.
హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ఒక ట్వీట్ లో, కిబితూ లో ఐటిబిపి ఆరంభించిన అనేక పథకాల తో పాటు తొమ్మిది మినీ-మైక్రో హైడ్రోఇలెక్ట్రిక్ ప్రాజెక్టుల ను తాను ప్రారంభించినట్లు తెలియ జేశారు. మహిళ ల ఆధ్వర్యం లో కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ హెచ్ జి స్ ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను కూడా ఆయన సందర్శించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘ఇది కచ్చితంగా ఒక స్మరణీయమైనటువంటి అనుభవమే అయి ఉంటుంది. ఇతరులను కూడా మరీ ముఖ్యం గా భారతదేశం యొక్క యువతీయువకుల ను సరిహద్దు ప్రాంత గ్రామాల ను సందర్శించవలసిందంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది మన యువతీ యువకుల కు వేరు వేరు సంస్కృతుల తో పరిచయాన్ని కలుగజేయడం తో పాటు గా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆతిథ్యాన్ని పొందేటటువంటి ఒక అవకాశాన్ని కూడా వారికి ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.
These development works will improve quality of life for people living in remote parts of Arunachal Pradesh. https://t.co/qAAIFLPW6K
— Narendra Modi (@narendramodi) April 11, 2023