ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘‘పవర్ వితిన్: ది లీడర్‌షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ’’ పుస్తకం నకలుపై సంతకం చేశారు. సమర్థుడైన నాయకుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవన గమనంలోని విశేషాల కలబోతగా ఈ పుస్తకం రూపొందింది. అసమాన నేతగా ఆయన పయనాన్ని పాశ్చాత్య, భారతీయ ఆలోచనాసులోచనాల దృక్కోణంలో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ప్రజాసేవ పథంలో పాదం మోపాలని భావించే వారికి మార్గం చూపే కరదీపికలా ఆయన దీన్ని మలిచారు.
దీనిపై డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశంపై ప్రధానమంత్రి స్పందిస్తూ:
‘‘ఈ రోజు డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్ గారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన రచించిన పుస్తక ప్రతిపై సంతకం చేశాను. భవిష్యత్తులోనూ ఆయన రచనా వ్యాసంగం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
It was a delight to meet @drrbalu earlier today. Also signed a copy of his book. My best wishes to him for his future endeavours. https://t.co/OqGOuLXnOj
— Narendra Modi (@narendramodi) July 17, 2024