ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాదహస్తాసన లేదా మనిషి తన పాదాల కు తన చేతుల ను ఆనించే భంగిమ తో కూడిన ఒక వీడియో క్లిప్ ను శేర్ చేశారు. ఈ భంగిమ వెన్నెముక కు మేలు ను చేసేది కావడం తో పాటు గా మహిళల కు నెలసరి సంబంధి బాధ లో ఉపశమనాన్ని కూడ అందించేది కావడం తో, అందరు ఈ యోగాసనాన్ని అభ్యసించండి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
యోగ అంతర్జాతీయ దినం యొక్క పదో సంచిక త్వరలో సమీపించనుండగా శేర్ చేసిన ఈ వీడియో క్లిప్, మనిషి నిటారుగా నిలబడిన భంగిమ లో ఆచరించవలసిన యోగాసన తాలూకు దశల ను గురించి ఆంగ్ల భాష లోను మరియు హిందీ భాష లోను విపులంగా వివరిస్తున్నది.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో:
‘‘పాదహస్తాసన అనేకమైనటువంటి ప్రయోజనాల ను అందిస్తుంది. దీనిని క్రమం తప్పక ఆచరించగలరు.’’ అని సూచించారు.
Padahastasana has several benefits…do practice it. pic.twitter.com/MdWEBWgObg
— Narendra Modi (@narendramodi) June 16, 2024
पादहस्तासन का नियमित अभ्यास कई तरह से फायदेमंद है… pic.twitter.com/gVhT4DW5q9
— Narendra Modi (@narendramodi) June 16, 2024