‘త్రికోణాసన’, మరో మాట లో చెప్పాలి అంటే త్రికోణాన్ని పోలినటువంటి భంగిమ ను గురించిన ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేస్తూ, ఈ విధమైన యోగాసనాన్ని అభ్యాసం చేస్తే శరీరం లో ఎగువ భాగం తో పాటు ఏకాగ్రత కూడ మెరుగు పడుతుందని, కాబట్టి త్రికోణాసన ను అభ్యాసం చేయ వలసిదిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
యోగ అంతర్జాతీయ దినం యొక్క పదో సంచిక కు ఇంకా కొన్ని రోజులే ఉండగా ప్రధాన మంత్రి శేర్ చేసిన ఈ క్లిప్, మనిషి నిలబడి ఆచరించవలసిన త్రికోణాసన తాలూకు దశలను వివరంగా చాటిచెబుతూంది.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘భుజాలు, వీపు తో పాటు గా ఏకాగ్రత ను కూడ మెరుగుపరచుకోవడం కోసం త్రికోణాసన ను అలవాటు చేసుకోండి.’’
‘‘త్రికోణాసనం యొక్క ఆచరణ తో వీపునకు, భుజాలకు బలం సమకూరుతుంది, అలాగే ఏకాగ్రత ను పెంచడం లో కూడ ఇది ఎంతో సహాయకారి అవుతుంది.’’ అని పేర్కొన్నారు.
Practice Trikonasana for improved shoulders, back and improving concentration! pic.twitter.com/8UJlcQZJh1
— Narendra Modi (@narendramodi) June 14, 2024
त्रिकोणासन का अभ्यास जहां पीठ और कंधे को मजबूती देता है, वहीं एकाग्रता बढ़ाने में भी यह काफी मददगार है। pic.twitter.com/gEQxvKj7l3
— Narendra Modi (@narendramodi) June 14, 2024