రామాయణంలో భక్త శబరి ఉదంతంపై మైథిలీ ఠాకూర్ ఆలపించిన భావోద్వేగ గీతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాపన సందర్భంగా భగవాన్ శ్రీరాముని జీవితం, ఆదర్శాల సంబంధిత వివిధ ఉదంతాలను ఈ గీతం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తున్నదని శ్రీ మోదీ అన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“అయోధ్యలో పవిత్ర ప్రతిష్టాపనోత్సవం నేపథ్యంలో ఈ గీతం దేశంలోని నా కుటుంబ సభ్యులకు శ్రీరాముడి జీవితం, ఆదర్శాలకు సంబంధించిన ప్రతి ఉదంతాన్నీ గుర్తుకు తెస్తుంది. అలాంటి వాటిలో శబరికి సంబంధించిన భావోద్వేగ ఉదంతంపై ఈ గీతాన్ని#ShriRamBhajan మైథిలీ ఠాకూర్ తన శ్రావ్యమైన కంఠస్వరంతో ఎలా వినిపించారో వినండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
अयोध्या में प्राण-प्रतिष्ठा का अवसर देशभर के मेरे परिवारजनों को प्रभु श्री राम के जीवन और आदर्शों से जुड़े एक-एक प्रसंग का स्मरण करा रहा है। ऐसा ही एक भावुक प्रसंग शबरी से जुड़ा है। सुनिए, मैथिली ठाकुर जी ने किस तरह से इसे अपने सुमधुर सुरों में पिरोया है।
— Narendra Modi (@narendramodi) January 20, 2024
#ShriRamBhajan…