ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వ్రాసినటువంటి ఒక వ్యాసాన్ని శేర్ చేశారు. ‘‘హర్ స్టోరీ, మై స్టోరీ - వై ఐ యామ్ హోప్ ఫుల్ అబౌట్ జెండర్ జస్టిస్’’ (ప్రతి మహిళ యొక్క కథ నా కథ కూడాను – నేను మహిళల మరియు పురుషుల సమానత్వం పట్ల ఆశాభావం తో ఎందుకు ఉన్నానంటే) అనే శీర్షిక తో ఉన్నటువంటి ఆ యొక్క రచన నిజానికి భారతదేశం లో మహిళ ల అజేయ భావన ను గురించి మరియు స్వయం గా ఆమె యొక్క జీవన వృత్తాంతాన్ని గురించి వివరించింది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘త్రిపుర నుండి తిరిగి వచ్చే సమయం లో నేను ఈ వ్యాసాన్ని చదివాను, ఈ వ్యాసం అత్యంత ప్రేరణదాయకం గా ఉంది అనిపించింది. ఈ వ్యాసాన్ని చదవండి అంటూ ఇతరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళల దినం సందర్భం లో, ఇది ఒక అత్యంత ప్రేరణదాయకమైనటువంటి వ్యక్తిత్వం యొక్క జీవన వృత్తాంతం గా ఉంది; ఆ వ్యక్తి ప్రజల కు సేవ చేయడం కోసం తన జీవనాన్ని అంకితం చేసి, మరి ఆ క్రమం లో భారతదేశాని కి రాష్ట్రపతి గా ఎదిగారు.’’ అని పేర్కొన్నారు.
On the way back from Tripura I read this article and found it very motivating. I would urge others to read it as well. On Women’s Day, it chronicles the life journey of a very inspiring person who devoted her life to service and rose to become India’s President. https://t.co/bLR4K0PgxY
— Narendra Modi (@narendramodi) March 8, 2023