రాజస్థాన్‌లోని అజ్మీర్ నగర వాస్తవ్యురాలైన దివ్యాంగ మహిళ ‘మన్ కీ బాత్’ 100 భాగాల ప్రసారంపై చిత్రించిన కళాఖండాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“హృదయాన్ని రంజింపజేసే అద్భుత చిత్రమిది. అజ్మీర్ గడ్డపై జన్మించిన ప్రియ పుత్రిక నందిని ఈ రూపంలో పంపిన అభినందన సందేశం చూసి నేనెంతో పులకించిపోయాను. నా తరఫున ఆమెకు అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
बहुत मनमोहक पेंटिंग! अजमेर की प्यारी बिटिया नंदिनी के बधाई संदेश को देखकर अभिभूत हूं! मेरी ओर से उन्हें ढेर सारी शुभकामनाएं! https://t.co/EugMGRClL1
— Narendra Modi (@narendramodi) May 5, 2023