దేశంలో బీచ్‌ల అభివృద్ధి, పరిశుభ్రతకు సంబంధించి దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యంతో వెలువడిన కీలక ట్వీట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ‘బ్లూ ఫ్లాగ్’ ధ్రువీకరణ పొందిన బీచ్‌ల గురించి దమన్-దియ్యూ పార్లమెంటు సభ్యుడు శ్రీ లాలూభాయ్ పటేల్ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
“అద్భుతమైన తీరప్రాంతం, బీచ్‌లకు దియ్యూ నిలయంగా ఉంది. తీరప్రాంత పరిశుభ్రత, అభివృద్ధికి సంబంధించి దియ్యూపై ప్రత్యేక ప్రస్తావనతో వెలువడిన ఈ ట్వీట్ కీలకమైనది. సమష్టి కృషి అందరి ఆలోచనల్లోనూ మార్పునకు దారితీసి యావత్ సమాజానికి ఎలా ప్రయోజనం కల్పిస్తుందో ఇది స్పష్టం చేస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A notable thread on coastal cleanliness and development with special reference to Diu, which is home to a wonderful coast and beaches. It shows how collective efforts lead to change in mindsets and benefit the entire society. https://t.co/haXswDMl2J
— Narendra Modi (@narendramodi) April 7, 2023