అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన శ్రీ లోపోలీ మెలో ‘ఎ డే ఇన్ ద పార్లమెంట్ ఎండ్ పిఎమ్ఒ’ (పార్లమెంట్ లో మరియు పిఎమ్ ఒ లో ఒక రోజు) శీర్షిక తో వ్రాసినటువంటి వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిడ్ లా ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీని ద్వారా తనకు మేధావి యువజనుల ను కలుసుకొనే అవకాశం లభించింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన శ్రీ లోపోలీ మెలో యొక్క స్వీయ కథనాన్ని చదివారంటే గనక మీరు ఆనందాన్ని పొందుతారు. ఈ తరహా కార్యక్రమాని కి నాయకత్వాన్ని వహించినందుకు స్పీకర్ ఓమ్ బిడ్ లా గారి ని నేను కొనియాడదలచాను. ప్రతిభావంతులైన యువజనుల తో భేటీ అయ్యే అవకాశాన్ని ఆయన నాకు ప్రసాదించారు.’’ అని పేర్కొన్నారు.
You will enjoy reading this very personal account of Lopoli Melo from Arunachal Pradesh. I would like to laud Speaker Om Birla Ji for taking the lead for such an initiative which also gave me the opportunity to meet bright youngsters. @ombirlakota https://t.co/QROY7It41c
— Narendra Modi (@narendramodi) February 9, 2023