ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాశీలోని లఖా మేళాకు సంబంధించి భారత్ మిలాప్ నుండి ఫోటోలను షేర్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సనాతన సంస్కృతిలో అంతర్భాగంగా పేర్కొంటూ, ఇది ఐదు శతాబ్దాల నాటి సంప్రదాయమని ప్రధాని మోదీ తెలియజేశారు. పార్లమెంటులో కాశీకి ప్రతినిధిగా ఆయన ఈ విశిష్ట సంప్రదాయంపై తెలియజేయడం గర్వంగా ఉందన్నారు.
ప్రధానమంత్రి ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేశారు:
"‘‘కాశీలో లఖా మేళా ఆధ్వర్యంలో జరిగే భారత్ మిలాప్ భారతదేశ సనాతన సంస్కృతిలో అంతర్భాగమైంది. గత ఐదు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రదర్శన మరోసారి శ్రీరామభక్తులను భావోద్వేగానికి గురి చేసింది. ఎంపీగా కాశీలో, ఈ సంప్రదాయం పట్ల నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను" అని అన్నారు.
काशी में लक्खा मेला के तहत होने वाला भरत मिलाप भारत की सनातन संस्कृति का अभिन्न हिस्सा रहा है। पिछली करीब पांच सदियों से चली आ रही इस प्रस्तुति ने एक बार फिर प्रभु श्री राम के भक्तों को भावविभोर कर दिया। काशी के सांसद होने के नाते मुझे इस परंपरा को लेकर विशेष गर्व की अनुभूति हो… pic.twitter.com/NRAIfIExBe
— Narendra Modi (@narendramodi) October 25, 2023