సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి
సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి

ఈ రోజు సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభివాదం చేశారు. భారత సైన్యం పట్టుదల, వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావానికి ప్రతీక అని అన్నారు. “సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొన్నేళ్లుగా మేము అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాం. ఆధునికీకరణపై దృష్టి పెట్టాం" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

'ఈ రోజు, సైనిక దినోత్సవం సందర్భంగా... మన దేశ భద్రతకు రక్షణగా నిలుస్తున్న భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు నా వందనం. అలాగే, ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయుల భద్రతకు భరోసా ఇస్తున్న వీర జవాన్ల త్యాగాలను కూడా స్మరించుకుంటున్నాం. భారత సైన్యం సంకల్పం, వృత్తి సామర్ధ్యం, అంకితభావానికి ప్రతీక. మన సరిహద్దులను కాపాడడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయం అందించడంలో కూడా మన సైన్యం తన ప్రత్యేకతను చాటింది. సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొన్నేళ్లుగా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ఆధునికీకరణపై దృష్టి సారించాం. రానున్న రోజుల్లోనూ ఇది కొనసాగుతుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.

 

"The Indian Army epitomises determination, professionalism and dedication. In addition to safeguarding our borders, our Army has made a mark in providing humanitarian help during natural disasters."

 

"Our government is committed to the welfare of the armed forces and their families. Over the years, we have introduced several reforms and focused on modernisation. This will continue in the times to come."

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Artificial intelligence & India: The Modi model of technology diffusion

Media Coverage

Artificial intelligence & India: The Modi model of technology diffusion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 మార్చి 2025
March 22, 2025

Citizens Appreciate PM Modi’s Progressive Reforms Forging the Path Towards Viksit Bharat