మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో నారీ శక్తి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘మహిళ ల దినం సందర్భం లో, నేను మన నారీ శక్తి కి మరియు వివిధ రంగాల లో వారి కార్యసాధనల కు నమస్కరిస్తున్నాను. భారత ప్రభుత్వం గౌరవానికి, అవకాశాల కు పెద్ద పీట ను వేస్తూ తన వివిధ పథకాల ద్వారా మహిళ ల సశక్తీకరణ పట్ల నిరంతరం శ్రద్ధ వహిస్తూ ఉంటుంది.’’
‘‘అన్ని వర్గాల కు ఆర్థిక సేవల ను అందించడం మొదలుకొని సామాజిక సురక్ష, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాల నుంచి గృహ నిర్మాణం, విద్య మొదలుకొని నవ పారిశ్రామికత్వం వరకు, భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర లో నారీ శక్తి ని ముందు భాగం లో నిలపడం కోసం అనేక ప్రయాసలు చేయడమైంది. రాబోయే కాలాల్లో ఈ ప్రయత్నాల ను మరింత ఎక్కువ శక్తి తో కొనసాగించడం జరుగుతుంది.’’
‘‘ఈ రోజు న సాయంత్రం పూట 6 గంటల వేళ కు, కచ్ఛ్ లో ఏర్పాటయ్యే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ప్రసంగించనున్నాను. ఆ కార్యక్రమం మన సమాజాని కి మహిళా సాధువులు అందించిన తోడ్పాటుల ను గురించి ప్రముఖం గా ప్రస్తావించనుంది.’’
‘‘సంస్కృతి తాలూకు వేరు వేరు దశ లు, కేంద్రం చేపడుతున్న అనేక సంక్షేమ చర్యల తో పాటు అనేక ఇతర అంశాల ను గురించిన ప్రస్తావన కూడా ఇందులో ఉంటుంది. https://t.co/ImLHzdJpEQ’’ అని పేర్కొన్నారు.
On Women’s Day, I salute our Nari Shakti and their accomplishments in diverse fields. The Government of India will keep focusing on women empowerment through its various schemes with an emphasis on dignity as well as opportunity.
— Narendra Modi (@narendramodi) March 8, 2022