ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే ఈ నెల 5న, స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ తో కలసి ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొననున్నారు.
ఇది 2015వ సంవత్సరం తరువాత ఇద్దరు నేత ల మధ్య జరుగుతున్నటువంటి ఐదో సంభాషణ కానుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒకటో భారత- నార్డిక్ శిఖర సమ్మేళనంలో పాల్గొనడం కోసం 2018వ సంవత్సరం ఏప్రిల్ లో స్టాక్ హోమ్ ను సందర్శించారు. స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ ‘‘మేక్ ఇన్ ఇండియా’’ వారోత్సవం లో పాల్గొనడం కోసం 2016వ సంవత్సరం ఫిబ్రవరి లో భారతదేశాన్ని సందర్శించారు. అంతక్రితం, ఇరువురు నేత లు 2015వ సంవత్సరం సెప్టెంబరు లో ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశం నేపథ్యం లో సమావేశమయ్యారు. 2020వ సంవత్సరం ఏప్రిల్ లో కోవిడ్-19 మహమ్మారి కారణం గా ఉత్పన్నమైన స్థితి పై ఇద్దరు ప్రధాన మంత్రులు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకొన్నారు. దీనికి అదనంగా, స్వీడన్ రాజు మాన్య శ్రీ కార్ల్ పదహారో గుస్తాఫ్, రాణి సిల్వియా లు 2019వ సంవత్సరం డిసెంబరు లో భారతదేశాన్ని సందర్శించారు.
భారతదేశం, స్వీడన్ ల మధ్య ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం, బహుళవాదం నియమాలపై ఆధారపడ్డ అంతర్జాతీయ వ్యవస్థ తాలూకు భాగస్వామ్య విలువ లు పునాది గా ఆత్మీయమైనటువంటి, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. వ్యాపారం, పెట్టుబడి, నూతన ఆవిష్కరణ, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం రంగాల తో పాటు పరిశోధన, అభివృద్ధి రంగాలలో కూడా రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఉంది. స్వీడన్ కు చెందిన దాదాపు 250 మంది కంపెనీ లు భారతదేశం లో ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, ఆటో ఇండస్ట్రీ, క్లీన్ టెక్నాలజీ, రక్షణ, భారీ యంత్రాలు, ఉపకరణాలు వంటి రంగాలలో చురుకు గా పనిచేస్తున్నాయి. భారతదేశానికి చెందిన దాదాపు 75 కంపెనీ లు స్వీడన్ లో చురుకు గా పనిచేస్తున్నాయి.
ఈ సమావేశం లో, నేతలు ఇరువుర మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపడ్డ రంగాలపై చర్చ లు జరుగుతాయి. కోవిడ్ అనంతర కాలం లో సహకారాన్ని పెంచుకోవడం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల పై వారు వారి అభిప్రాయాలను వెల్లడి చేసుకోనున్నారు.
On #WorldWildlifeDay, I salute all those working towards wildlife protection. Be it lions, tigers and leopards, India is seeing a steady rise in the population of various animals. We should do everything possible to ensure protection of our forests and safe habitats for animals.
— Narendra Modi (@narendramodi) March 3, 2021