రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు శ్రీ మూన్ జే-ఇన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
కొవిడ్-19 మహమ్మారి తో పోరాటం లో పురోగతి ఇంటర్ నేషనల్ వేల్యూ చైన్ లలో ప్రస్తుతం చోటు చేసుకొంటున్న వివిధీకరణ, పారదర్శకమైనటువంటి, అభివృద్ధి ప్రధానంగా ఉండేటటువంటి, నియమాల పై ఆధారపడేటటువంటి ప్రపంచ వ్యాపార వ్యవస్థ ను పరిరక్షించవలసిన అవసరం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) కు గల ప్రధాన భూమిక సహా ప్రముఖ్య ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు సమీక్షను నిర్వహించారు.
పై అంశాల మీద ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు, అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకొనేందుకు ఇద్దరు నేతలు తమ సమ్మతి ని వ్యక్తం చేశారు.