సౌదీ అరేబియా యువరాజు మరియు ప్రధాని శ్రీ మొహమ్మద్ బిన్ సల్ మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
నేత లు ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన పలు అంశాల ను సమీక్షించారు. అంతేకాక, పరస్పర హితం ముడిపడినటువంటి అనేక బహుపాక్షిక అంశాలను మరియు ప్రపంచ అంశాల పై వారి వారి అభిప్రాయాల ను కూడా ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు.
2023 వ సంవత్సరం ఏప్రిల్ లో సూడాన్ నుండి జెద్దా మీదు గా భారతదేశ పౌరుల ను స్వదేశానికి తిరిగి తీసుకు వచ్చే సందర్భం లో సౌదీ అరేబియా అందించిన గొప్ప సమర్థన కు గాను యువరాజు శ్రీ మొహమ్మద్ బిన్ సల్ మాన్ కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. త్వరలో ఆరంభం కానున్న హజ్ యాత్ర కు గాను ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను కూడా వ్యక్తం చేశారు.
జి20 కి ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష స్థానం లో ఉంటూ తన వంతు గా చేపడుతున్న కార్యక్రమాల కు యువరాజు శ్రీ మొహమ్మద్ బిన్ సల్ మాన్ పూర్ణ సమర్థన ను తెలియ శారు. తాను భారతదేశాన్ని సందర్శించడం కోసం ఆశపడుతున్నట్లు చెప్పారు.
పరస్పరం సంప్రదింపు లు జరుపుకొంటూ ఉండాలనే విషయం లో ఇద్దరు నేత లు సమ్మతి ని వ్యక్తం చేశారు.