ప్ర‌తిదేశం, ప్రతి స‌మాజం మ‌రియు ప్ర‌తి ఒక్క వ్య‌క్తి ఆరోగ్యం గా ఉండాలి అని ఆయ‌నప్రార్థించారు
M-Yoga App ను తీసుకువ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు; ఈ యాప్ ‘ఒకే ప్ర‌పంచం,ఒకేఆరోగ్యం’ ల‌క్ష్య సాధ‌న లో సాయపడుతుంద‌న్నారు
ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హ‌మ్మారి తో పోరాడే శ‌క్తి ని,విశ్వాసాన్నికూడగ‌ట్టుకోవ‌డం లో ప్ర‌జ‌ల‌ కు యోగ సాయ‌ప‌డింది: ప్ర‌ధాన మంత్రి
ఫ్రంట్లైన్ క‌రోనా వారియ‌ర్స్ యోగ ను వారి ర‌క్షా క‌వ‌చం గా చేసుకొన్నారు, అంతేకాదు వారి రోగుల కు కూడా సాయ‌ప‌డ్డారు : ప్ర‌ధాన మంత్రి
గిరిగీసుకొనివ్య‌వ‌హ‌రించ‌డం అనే వైఖ‌రి నుంచి ఒక్కుమ్మ‌డి గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే యోగ; ఐక‌మ‌త్యం తాలూకు శ‌క్తి ని గ్రహించే,ఏకత అనుభ‌వాన్ని రుజువు చేసే మార్గ‌మే యోగ‌: ప్ర‌ధాన మంత్రి
‘వసుధైవకుటుంబకమ్‌’ అనే మంత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తం గా ఆమోదం ల‌భిస్తోంది: ప్ర‌ధాన మంత్రి
బాలల‌ కుఆన్ లైన్ క్లాసుల కాలం లో యోగ అనేది క‌రోనా కు వ్య‌తిరేకం గా పోరాడ‌డం లో పిల్లలను బ‌ల‌ప‌రుస్తున్నది: ప్ర‌ధాన మంత్రి

మ‌హ‌మ్మారి విరుచుకు ప‌డుతున్న‌ప్ప‌టికీ కూడా ఈ సంవ‌త్స‌రం అంత‌ర్జాతీయ యోగ దినం తాలూకు ఇతివృత్తం అయిన‌ ‘యోగ ఫార్ వెల్‌ నెస్’ ప్ర‌జ‌ల నైతిక స్థైర్యాన్ని పెంచింది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్ర‌తి ఒక్క దేశం, ప్ర‌తి ఒక్క స‌మాజం, ప్ర‌తి ఒక్క వ్య‌క్తి ఆరోగ్యం గా ఉండాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు. మ‌నం అంద‌రం ఏక‌తాటి మీద నిల‌చి, ఒక‌రిని మ‌రొక‌రం బ‌ల‌ప‌ర‌చుకొంటామ‌న్న ఆశ‌ ను ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజు న ‘7వ అంత‌ర్జాతీయ యోగ దినాన్ని’ జ‌రుపుకొంటున్న సంద‌ర్భం గా ఆయ‌న ప్ర‌సంగిస్తూ ఈ మాట‌లు అన్నారు.

క‌రోనా కాలం లో యోగ కు ఉన్న పాత్ర ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ఈ క‌ఠిన కాలం లో ప్ర‌జ‌ల కు యోగ ఒక శ‌క్తి ని ఇచ్చేట‌టువంటి మార్గం గా త‌న‌ను తాను రుజువు చేసుకొంద‌న్నారు. యోగ త‌మ సంస్కృతి లో అంత‌ర్భాగం కాన‌టువంటి దేశాలు యోగ దినాన్ని మ‌ర‌చిపోవ‌డం సుల‌భం; అయితే, దీనికి భిన్నం గా, యోగ ప‌ట్ల ఉత్సాహం ప్ర‌పంచం అంత‌టా పెరిగింది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌హ‌మ్మారి తో పోరాడేందుకు ప్ర‌పంచం అంత‌టా ప్ర‌జ‌లు విశ్వాసాన్ని, బ‌లాన్ని కూడ‌గ‌ట్టుకోవ‌డం లో యోగ సాయ‌ప‌డింది అని ఆయ‌న అన్నారు. క‌రోనా తో పోరాడ‌టం లో ముందు వ‌రుస లో నిల‌చిన యోధులు ఏ విధంగా యోగ ను వారి సుర‌క్షాక‌వ‌చం గా మార్చుకొన్న‌దీ, యోగ ద్వారా వారిని వారు బ‌లం గా తీర్చిదిద్దుకొన్న‌దీ, వైర‌స్ ప్ర‌భావాల ను త‌ట్టుకోవ‌డానికి ప్ర‌జ‌లు, డాక్ట‌ర్లు, న‌ర్సులు ఏ విధంగా యోగ‌ ను ఆశ్ర‌యించిందీ ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. మ‌న శ్వాస వ్య‌వ‌స్థ‌ ను ప‌టిష్ట ప‌ర‌చుకోవ‌డం కోసం ప్రాణాయామం, అనులోమం-విలోమం క్రియ‌ల వంటి గాలి ని పీల్చుకొనే క‌స‌ర‌త్తు కు ప్రాముఖ్యం ఇవ్వాల‌ని నిపుణులు నొక్కి చెప్తున్నారు అని ఆయ‌న అన్నారు.

త‌మిళ మ‌హ‌ర్షి తిరువ‌ళ్ళువ‌ర్ మాట‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. యోగ వ్యాధి తాలూకు మూలం వ‌ద్ద‌కు వెళ్తుంది, వ్యాధి ని న‌యం చేయ‌డం లో కీలకంగా ప‌ని చేస్తుంది అన్నారు. యోగ కు ఉన్న వ్యాధి ని మాన్పించి వేసే కార‌కాల ను తెలుసుకోవ‌డం కోసం ప్ర‌పంచం అంత‌టా ప‌రిశోధ‌నలు జ‌రుగుతూ ఉన్నందుకు ప్రధాన మంత్రి సంతృప్తి ని వ్య‌క్తం చేశారు. యోగ ద్వారా వ్యాధినిరోధ‌క శ‌క్తి అనే అంశం పై అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయి. పిల్ల‌లు వారి ఆన్‌ లైన్ క్లాసుల లో భాగం గా యోగ సాధ‌న చేస్తున్నారు అని ఆయ‌న తెలిపారు. ఇది బాల‌ల‌ ను క‌రోనా తో పోరాడ‌టానికి వారిని సిద్ధం చేస్తోంది అని ఆయ‌న చెప్పారు.

యోగ కు ఉన్న సంపూర్ణ స్వ‌భావాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్తూ, అది శారీరిక ఆరోగ్యం తో పాటు మాన‌సిక ఆరోగ్యాని కి కూడా పూచీ ప‌డుతుంది అని ఆయ‌న అన్నారు. యోగ మ‌న అంతశ్శ‌క్తి ని వెలికి తీసుకు వ‌స్తుంది, అది మ‌న‌లను అన్ని విధాలైన ప్ర‌తికూల‌త‌ ల బారి నుంచి కాపాడుతుంది. యోగ తాలూకు అనుకూల‌త ను గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్తూ, ‘‘ వేరు వేరు గా ఉండే క‌న్నా, ఒక్క‌టిగా ఉండ‌డం గురించి యోగ సూచిస్తుంది, ఏక‌త తాలూకు బ‌లాన్ని గ్ర‌హించే రుజు మార్గం యోగ ’’ అని వివ‌రించారు. ఈ సంద‌ర్భం లో ‘‘మ‌న ఆత్మ కు అర్థాన్ని దైవం నుంచి, ఇత‌రుల నుంచి వేరు ప‌డ‌టం లో కనుగొనరాదు, దాని కోసం యోగ, కలయిక ల మార్గంలో ఎడతెగని విధం గా వెతకాలి ’’ అని చెప్పిన గురుదేవులు రవీంద్రనాథ్ టాగోర్ మాట‌ల‌ ను ఆయ‌న ఉట్టంకించారు.

భార‌త‌దేశం త‌రాల త‌ర‌బ‌డి అనుస‌రిస్తూ వ‌చ్చిన ‘వసుధైవ కుటుంబకమ్‌’ మంత్రం ప్ర‌స్తుతం ప్ర‌పంచం లో ఆమోదాన్ని పొందుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌న‌మంద‌ర‌మూ ప్ర‌తి ఒక్క‌రి క్షేమం కోసం ప్రార్థ‌న చేస్తున్నాం. మాన‌వ జాతి కి బెద‌రింపులు ఏవైనా ఎదురైతే ఒక స‌మ‌గ్ర‌ ఆరోగ్యాన్ని అంద‌జేసేట‌టువంటి ఒక మార్గాన్ని యోగ మ‌న‌కు త‌ర‌చుగా సూచిస్తుంది. ‘‘యోగ మ‌న‌కు ఒక సంతోష‌దాయక‌మైన జీవ‌న మార్గాన్ని కూడా ప్ర‌సాదిస్తుంది. యోగ ప్ర‌జానీకం ఆరోగ్య సంర‌క్ష‌ణ లో ఒక నివార‌క పాత్ర ను మ‌రి అలాగే స‌కారాత్మ‌క‌మైన భూమిక ను కూడాను పోషిస్తూ ఉంటుంది’’ అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలిపారు.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ఒ), భార‌త‌దేశం ఈ రోజు న ఒక ముఖ్య‌మైన చొరవ ను తీసుకొన్నాయి అని ప్ర‌ధాన మంత్రి ప్ర‌కటించారు. ప్ర‌పంచానికి M-Yoga app ను అందనుంది, అది యోగ విధివిధానాల పైన ఆధార‌ప‌డ్డ యోగ శిక్ష‌ణ కు సంబంధించిన అనేక వీడియోల ను అనేక భాష‌ల లో అందుబాటు లోకి తీసుకు రానుంది అని ఆయన చెప్పారు. ప్రాచీన విజ్ఞానం, ఆధునిక సాంకేతిక విజ్ఞానాల మేళనం తాలూకు ఒక ఘ‌న‌మైన ఉదాహ‌ర‌ణ‌ గా దీనిని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణిస్తూ, M-Yoga app అనేది యోగ ను ప్ర‌పంచవ్యాప్తం గా విస్త‌రించేందుకు తోడ్ప‌డ‌డంతో పాటు, ‘ వన్‌ వరల్డ్ - వన్ హెల్థ్ ’ ప్ర‌యాస‌ల కు కూడా త‌న వంతు తోడ్పాటు ను అందిస్తుంద‌న్న ఆశాభావాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.

గీత లో చెప్పిన మాట‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘ యోగ లో ప్ర‌తి ఒక్క‌రికీ సమాధానం ఉంది, ఈ కారణం గా మ‌నం యోగ ను సామూహిక యాత్ర గా ఎంచి ఆ మార్గం లో ముందుకు సాగిపోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది ’’ అన్నారు. యోగ పునాది ని, యోగ సారాన్ని ప‌దిలం గా కాపాడుతూ ప్ర‌తి ఒక్క వ్య‌క్తి చెంత‌ కు యోగ చేరేట‌ట్లు చూడ‌టం ముఖ్యం. యోగ ను ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద‌కు తీసుకుపోయే బాధ్యత ను యోగ ఆచార్యుల తో పాటు మ‌నమంతా తీసుకోవాలి అని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi