వాక్సినేషన్ ఉత్సవం- టీకా ఉత్సవ్ కరొనాపై రెండో యుద్ధానికి ప్రారంభమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. టీకా ఉత్సవ్, మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి రోజున ప్రారంభమైంది.ఇది ఏప్రిల్ 14 బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వరకు కొనసాగుతుంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక సందేశం ఇస్తూ, టీకా ఉత్సవానికి సంబంధించి నాలుగు అంశాలనుప్రస్తావించారు. ఒకటి ప్రతి ఒక్కరికీ టీకా అంటే,
నిరక్షరాస్యులు , వృద్ధులు వంటి వారికి టీకా కోసం వెళ్ళలేని వారికి సహాయం చేయాలన్నారు.
రెండోది, ప్రతిఒక్క రూ – మరొకరికి చికిత్స అందించేలా చూడడం. అంటే కరొనా చికిత్స కు సంబంధించి పరిజ్ఞానం లేనివారు, వనరులు లేని వారికి కరోనా చికిత్స అందేలా చూసేందుకు సహాయపడడం.
మూడోది ప్రతి ఒక్కరూ- మరొకరిని కాపాడడం అంటే, నేను మాస్కు ధరించి నన్ను నేను కాపాడు కోవడం తో పాటు ఇతరులను కాపాడుతాను. ఇది నొక్కి చెప్పాలి.
చివరగా నాలుగోది, సమాజం, ప్రజలు మైక్రో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయడంలో ముందుండాలి. కుటుంబ సభ్యులు కమ్యూనిటీ సభ్యులు మైక్రో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా సరే భారత్ వంటి జనసాంద్రత ఎక్కువ గల దేశంలో కరోనా పై పోరాటంలో మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు కీలకమని ప్రధానమంత్రి అన్నారు.
కోవిడ్ పరీక్షలు,అవగాహన పై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇది సమాజం,పాలనా యంత్రాంగం ప్రాథమికకృషి కావాలని ఆయన అన్నారు.
మనం వాక్సిన్ ఏమాత్రం వృధాకాని దశకు చేరుకోవాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. గరిష్ఠ స్థాయిలో వాక్సిన్ సామర్ధ్యాన్ని వినియోగించుకోవడం , మన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి మార్గమని ప్రధానమంత్రి అన్నారు.
మైక్రో కంటైన్‌మెంట్ జోన్లపై అవగాహనపైనే మన విజయం ఆధార పడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. అనవసరంగా ఇంటినుంచి బయటకు రాకుండా ఉండడం, అర్హులైన వారందరూ వాక్సిన్ వేయించుకోవడం, మనం కోవిడ్ నిబంధనలైన మాస్కు ధరించడం, సామాజికదూరం పాటించడం వంటి ఇతర కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించడంపై మన విజయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
వ్యక్తిగత స్థాయిలో సామాజిక, పాలన యంత్రాంగం స్థాయిలో రాగల నాలుగురోజులు టీకా ఉత్సవానికి సంబంధించి లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. ప్రజల భాగస్వామ్యం, అవగాహన, చైతన్యం, బాధ్యతాయుత వ్యవహరణ ద్వారా మరోసారి మనం కోవిడ్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించగలమని ప్రధానమంత్రిఅన్నారు.
దవాయి భి, కడాయి భి -ఔషధంతోపాటు జాగ్రత్తకూడా అని ప్రధానమంత్రి గుర్తుచేశారు.
टीका उत्सव पर देशवासियों से आग्रह। pic.twitter.com/GvGV3OCnP7
— PMO India (@PMOIndia) April 11, 2021