ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం లో గడచిన అయిదు సంవత్సరాల లో ప్రభుత్వం పరిపాలన కు ఒక నూతన వైఖరి ని మరియు క్రొత్త ఆలోచనల ను ప్రవేశ పెట్టిందని తెలిపారు. డిజిటల్ ఇండియా అనేది ఈ క్రొత్త ఆలోచన కు మరియు నూతన వైఖరి తో కూడిన పరిపాలన కు పలు ఉదాహరణల లో ఒకటి అంటూ ఆయన ప్రస్తావించారు. 2014వ సంవత్సరం కన్నా ముందు కేవలం 59 గ్రామ పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానం ఉందని, గత 5 సంవత్సరాల లో 1.25 లక్షల కు పైగా పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానాన్ని సమకూర్చడమైందని ప్రధాన మంత్రి చెప్పారు.

దేశం లో 2014వ సంవత్సరం లో 80 కామన్ సర్వీస్ సెంటర్ లు ఉన్నాయని, అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 3 లక్షల 65 వేల కు పైగా పెరిగిందని ఆయన అన్నారు. 12 లక్షల మంది కి పైగా గ్రామీణ ప్రాంత యువత ఈ కేంద్రాల లో ప్రభుత్వ సర్వీసులు అన్నిటి ని ఆన్ లైన్ మాధ్యమం ద్వారా అందజేసేందుకు పూచీ పడుతున్నారన్నారు.

భీమ్ యాప్ ను ప్రపంచవ్యాప్తం గా గుర్తిస్తున్నారని, ఇది ఒక భద్రమైన డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్లాట్ ఫార్మ్ గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. జనవరి మాసం లో భీమ్ యాప్ ద్వారా 2 లక్షల 16 వేల కోట్ల రూపాయల కు మించిన స్థాయి లో లావాదేవీ లు నమోదు అయ్యాయని ఆయన అన్నారు. రూపే కార్డు సైతం అనేక దేశాల లో స్వీకరణ కు పాత్రమవుతోందని ఆయన చెప్పారు.

జల్ జీవన్ మిశన్

ఈ ప్రభుత్వ వైఖరి కి జల్ జీవన్ మిశన్ మరొక ఉదాహరణ గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్క కుటుంబాని కి గొట్టపు మార్గం ద్వారా నీటి సరఫరా కై ఉద్దేశించిన ఈ మిశన్ కూడా స్థానిక పరిపాలన నమూనా కు ఒక సర్వ శ్రేష్ఠమైన ఉదాహరణ గా ఉందని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఈ మిశన్ ను ప్రారంభించినప్పటి కీ, దీని యొక్క నిర్వహణ మాత్రం గ్రామ స్థాయి లో ఉంటుంది అని ఆయన చెప్పారు. గ్రామ సంఘాలు దీని ని అమలుపరుస్తాయని, నిధుల ను నిర్వహిస్తాయని, గొట్టపు మార్గం ఏర్పాటు, బ్యాంకు ల నిర్మాణం వగైరా పనుల కు సంబంధించిన నిర్ణయాల ను తీసుకొంటాయని ఆయన వివరించారు.

సహకారాత్మక సమాఖ్య విధానాని కి ఉత్తమ ఉదాహరణ: ఆకాంక్షభరిత జిల్లా ల కార్యక్రమం ఇది

దేశం లో 100 కు పైగా ఆకాంక్ష భరిత జిల్లాల ను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పాలన యంత్రాంగం సమన్వయం తో కృషి చేస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆకాంక్ష భరిత జిల్లా కార్యక్రమం యొక్క అమలు ఏజెన్సీ గా జిల్లా ఉండటం తో ఇది సహకారాత్మక సమాఖ్య విధానాని కి ఒక ఉత్తమమైన ఉదాహరణ గా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ ఆకాంక్ష భరిత జిల్లాల లో పేద లు, ఆదివాసీ ల అభివృద్ధి కోసం సకల ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.

సమాజం లోని ప్రతి ఒక్క వర్గం కోసం సచేతన కృషి

దేశం లో ఆదివాసీ యోధులందరి ని గౌరవించుకోవడం కోసం గడచిన 5 సంవత్సరాల లో కృషి జరిగినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. దేశవ్యాప్తం గా మ్యూజియమ్ లను నిర్మించడం జరుగుతోంది. పరిశోధన సంస్థల ను నెలకొల్పడం జరుగుతోంది. ఆదివాసీ కళలు మరియు సాహిత్యాన్ని డిజిటల్ మాధ్యమం లో పదిలపరచడం జరుగుతోంది. ఆదివాసీ ప్రాంతాల లో ప్రతిభావంతులైన చిన్నారుల కు నాణ్యమైన విద్య అందేలా చూడటం కోసం ఏకలవ్య ఆదర్శ ఆశ్రమవాస పాఠశాలల ను ప్రారంభించడమైంది. ‘‘దీనికి అదనం గా, అటవీ ప్రాంత ఉత్పత్తుల ద్వారా మరింత ఆదాయాన్ని ఆర్జించడం కోసం ఆదివాసీ ప్రాంతాల లో 3 వేల వన సంపద కేంద్రాల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. 30 వేల స్వయం సహాయక సమూహాలు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటాయి. వీటిలో, 900 కేంద్రాల ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2.5 లక్షల కు పైగా ఆదివాసీ సహచరులు వీటి తో అనుబంధం ఏర్పరచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మహిళా సాధికారిత కు కట్టుబడిన ప్రభుత్వం

ఈ ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం అనేక చర్యలు తీసుకొందని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘దేశ చరిత్ర లో మొట్టమొదటిసారి గా సైనిక పాఠశాలల్లో పుత్రిక ల ప్రవేశానికి ఆమోదం తెలపడమైంది. మిలటరి పోలీస్ లో మహిళల ను నియమించే పని కొనసాగుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం లో మహిళల భద్రత కోసం 600 లకు పైగా వన్- స్టాప్ సెంటర్ లను నిర్మించడమైంది. దేశం లోని ప్రతి పాఠశాల లో ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు బాలికల కు స్వీయ రక్షణ కై శిక్షణ ను ఇవ్వడం జరుగుతున్నది. లైంగిక అపరాధి ని గుర్తించడం కోసం ఒక జాతీయ సమాచార నిధి ని సిద్ధం చేయడమైంది. ఇంకా, దేశం లోని ప్రతి జిల్లా లో మానవుల అక్రమ చేరవేత ను నిరోధించే విభాగాల ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు కూడా ఉన్నాయి. చిన్నారుల పై లైంగిక హింస తాలూకు గంభీరమైన కేసుల ను పరిష్కరించడం కోసం పాక్సో యాక్ట్ (POCSO Act) పరిధి లోకి వచ్చే నేరాల ను విస్తరించేందుకు సదరు చట్టాన్ని సవరించడమైంది. సరైన కాలాని కి న్యాయం జరిగేటట్లు గా దేశం అంతటా ఒక వేయి కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ను నిర్మించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు.

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India and UK sign historic Free Trade Agreement, set to boost annual trade by $34 bn

Media Coverage

India and UK sign historic Free Trade Agreement, set to boost annual trade by $34 bn
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2025
July 24, 2025

Global Pride- How PM Modi’s Leadership Unites India and the World