Quote8,500 జన్ ఔషధి కేంద్రాలు ప్రభుత్వ దుకాణాలు మాత్రమే కాదు, అవి సామాన్య ప్రజల కు పరిష్కారాల నుఅందించే స్థలాలు గా కూడా శరవేగం గా మారుతున్నాయి
Quoteకేన్సర్, క్షయ, మధుమేహం, గుండె జబ్బు వంటి వ్యాధుల చికిత్స కు అవసరమైన 800కు పైగా ఔషధాల ధరల ను ప్రభుత్వం అదుపులోకితెచ్చింది
Quote‘‘ప్రైవేటు వైద్య కళాశాల లలో సగం సీట్ల కు ప్రభుత్వ వైద్య కళాశాల లతో సమానం గారుసుము ఉండాలని మేం నిర్ణయించాం’’

జన్ ఔషధి కేంద్రాల యజమానుల తో మరియు జన్ ఔషధి పథకం లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. జన్ ఔషధి పరియోజన తాలూకు ప్రయోజనాల ను గురించి, ఇంకా జెనెరిక్ ఔషధాల వాడకం గురించి చైతన్యాన్ని కలగజేయడాని కి జన్ ఔషధి వారాన్ని మార్చి నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తం గా పాటించడం జరుగుతోంది. ‘జన్ ఔషధి-జన్ ఉపయోగి’ అనేది ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉంది. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా తదితరులు ఉన్నారు.

పట్ నా కు చెందిన హిల్డా ఎంథని గారి తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, జన్ ఔషధి మందుల గురించి ఆమె ఎలా తెలుసుకొన్నారో అడిగారు. ఔషధాల నాణ్యత ఎలా ఉంటోంది? అంటూ ఆయన వాకబు చేశారు. ఇంతకు ముందు నెలవారి మందుల కు 1200 రూపాయలు మొదలుకొని 1500 రూపాయల వరకు అవుతూ ఉండగా ఇప్పుడు 250 రూపాయలు అవుతోందని ఆమె చెప్తూ, ఈ మందుల వల్ల తనకు ఎంతో లాభం కలిగింది అంటూ జవాబిచ్చారు. తన చేతి లో మిగిలిన డబ్బులు సామాజిక అంశాల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆమె భావన ను ప్రధాన మంత్రి అభినందించి, ఆమె వంటి వ్యక్తుల ద్వారా జన్ ఔషధి పట్ల ప్రజల లో నమ్మకం వృద్ధి అవుతుందన్న ఆశ ను వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజానీకం ఈ పథకాని కి ఒక గొప్ప ప్రచారకర్త కాగలరని ఆయన అన్నారు. వ్యాధి తాలూకు ప్రభావం అనేది సమాజం లో పేదలు, దిగువ మధ్యతరగతి, ఇంకా మధ్య తరగతి వర్గాల ఆర్థిక స్థితి ని ఏ విధం గా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. సంఘం లో చదువుకున్న వారు జన్ ఔషధి ప్రయోజనాల ను గురించి వివరించవలసిలందంటూ ఆయన పిలుపునిచ్చారు

|

భువనేశ్వర్ కు చెందిన లబ్ధిదారు దివ్యాంగుడు శ్రీ సురేశ్ చంద్ర బెహరా తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, జన్ ఔషధి పరియోజన లో శ్రీ సురేశ్ చంద్ర బెహరా కు కలిగిన అనుభవాన్ని గురించి తెలుసుకో దలచారు. మీకు అవసరమైన అన్ని మందులు జన్ ఔషధి స్టోర్ లో దొరుకుతున్నాయా అని కూడా ప్రధాన మంత్రి అడిగారు. ఆ దుకాణం నుంచి అన్ని మందుల ను తాను అందుకొంటున్నట్లు, తన తల్లితండ్రుల కు కూడా ఔషధాలు అవసరపడిన కారణం గా ప్రతి నెల 2,000 రూపాయలు మొదలుకొని 2,500 రూపాయల వరకు తాను ఆదా చేస్తున్నట్లు శ్రీ బెహరా చెప్పారు. శ్రీ బెహరా కుటుంబం కోలుకొని మంచి ఆరోగ్యం తో ఉండాలని భగవాన్ జగన్నాథుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు. దివ్యాంగుడు అయిన శ్రీ బెహరా సాహసించి యుద్ధం లో పోరాడుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.

మైసూరు కు చెందిన బబిత రావు గారి తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె ను ప్రచారం చేయవలసిందంటూ విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే ఈ పథకం నుంచి ప్రయోజనాన్ని మరింత ఎక్కువ మంది అందుకోగలుగుతారని ఆయన అన్నారు.

సూరత్ కు చెందిన ఊర్వశి నీరవ్ పటేల్ గారు జన్ ఔషధి ని గురించి మాట్లాడుతూ, ఆ పథకాన్ని ప్రచారం చేయడం లో తన పాత్ర ను గురించి వివరించారు. తక్కువ ఖరీదు కలిగిన శానిటరీ ప్యాడ్స్ ను మరింత మంది కి విరాళం గా ఇచ్చేందుకు జన్ ఔషధి కేంద్రం తన కు ఏ విధం గా తోడ్పడిందీ ఆమె వెల్లడించారు. ఒక రాజకీయ కార్యకర్త గా ఆమె కనబరుస్తున్న సేవా భావన ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఇది సార్వజనిక జీవనం లో సేవ తాలూకు భూమిక ను ఇనుమడింప చేస్తుంది అని ఆయన అన్నారు. వ్యక్తిగత ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన ను పెంచడం కోసం పిఎమ్ ఆవాస్ యోజన లబ్ధిదారుల ను, ఇంకా కరోనా కాలం లో ఉచితం గా ఆహార పదార్థాల ను అందుకొన్న లబ్ధిదారుల ను కలవాలి అని కూడా ఆయన సూచన చేశారు.

|

రాయ్ పుర్ కు చెందిన శ్రీ శైలేశ్ ఖండేల్ వాల్ మాట్లాడుతూ, జన్ ఔషధి పరియోజన తో తనకు ఏర్పడిన అనుబంధాన్ని గురించి తెలిపారు. మందులు తక్కువ ధరల కు దొరుకుతూ ఉండటం తనకు బాగుందని ఆయన అన్నారు. ఇతర వైద్యులు సైతం జన్ ఔషధి ని గురించి ప్రజల లో ప్రచారం చేయాలి అని ప్రధాన మంత్రి కోరారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జన్ ఔషధి కేంద్రాలు శరీరాని కి కావలసిన మందుల ను అమ్మే కేంద్రాలు మాత్రమే కాదు, అవి మనస్సు లోని వ్యాకులత ను కూడా తగ్గిస్తాయి. అలాగే, అవి ప్రజల కు వారి డబ్బు ను మిగిల్చి, ఊరట ను ఇచ్చే కేంద్రాలు కూడాను అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఆ కోవ కు చెందిన ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజల కు లభిస్తున్నాయి, అంతేకాక దేశం లోని అన్ని ప్రాంతాల లో ఆ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి అని ప్రధాన మంత్రి చెప్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక రూపాయి కి లభించే శానిటరీ నాప్ కిన్ సఫలం కావడాన్ని గురించి కూడా ఆయన వివరించారు. 21 కోట్ల శానిటరీ నాప్ కిన్స్ అమ్ముడయ్యాయి అంటే దేశం అంతటా మహిళల జీవనాన్ని సులభతరం గా జన్ ఔషధి కేంద్రాలు మార్చివేశాయి అన్నమాటే అని ఆయన అన్నారు.

 

దేశం లో 8,500కు పైగా జన్ ఔషధి కేంద్రాల ను ఇంతవరకు తెరవడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కేంద్రాలు కేవలం ప్రభుత్వం దుకాణం గా మిగలడం లేదని, అవి సామాన్య మానవుని కి పరిష్కార కేంద్రాలు గా మారుతున్నాయని ఆయన అన్నారు. కేన్సర్, క్షయ, మధుమేహం, గుండె జబ్బు వంటి వ్యాధుల చికిత్స కు అవసరమైన 800 కు పైగా ఔషధాల ధరల ను ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది అని కూడా ఆయన అన్నారు. స్టంట్ లు వేసేందుకు అవుతున్న ఖర్చు, మరి మోకాలి కీలు మార్పిడి కి అవుతున్న ఖర్చు.. ఈ రెంటి ని కూడా నియంత్రణ లో ఉంచేందుకు ప్రభుత్వం తగిన చర్యల ను తీసుకొందని ఆయన అన్నారు. చికిత్స తాలూకు ఖర్చు ను పౌరుల కు అందుబాటు ధర లో ఉంచేందుకు సంబంధించిన గణాంకాల ను గురించి ఆయన తెలియజేశారు. 50 కోట్ల మందికి పైగా ప్రజలు ఆయుష్మాన్ భారత్ యోజన పరిధి లోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. 3 కోట్ల మంది కి పైగా ఈ పథకం నుంచి లబ్ధి ని పొందారు. దీనితో పేదలకు, మధ్య తరగతి ప్రజలకు 70,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. పిఎమ్ నేశనల్ డాయాలిసిస్ కార్యక్రమం 550 కోట్ల రూపాయల మేరకు ఆదా చేసింది. మోకాలి కీలు మార్పిడి మరియు మందుల ధరల నియంత్రణ ల ఫలితం గా 13 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి అని ఆయన తెలిపారు.

|

కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం మరొక ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకొంది, ఈ నిర్ణయం పేదల మరియు మధ్యతరగతి ప్రజల బాలల కు ప్రయోజనకరం గా ఉంటుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘ప్రైవేటు వైద్య కళాశాల లలో ఉన్న సీట్ల లో సగం సీట్లకు ప్రభుత్వ వైద్య కళాశాల లతో సమానం గా రుసుము ఉండాలని మేం నిర్ణయించాం’’ అని ఆయన చెప్పారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond