బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తాయి: ప్రధాని
దేశంలోని ప్రతి పౌరుడి ఆర్థిక సాధికారతను బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది: ప్రధాని మోదీ
వసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ సమగ్ర విధానాన్ని అవలంబిస్తోంది: ప్రధాని మోదీ

కేంద్ర బ‌డ్జెట్ 2020 ని దార్శ‌నిక‌త‌ కలిగినటువంటి బడ్జెట్ మరియు కార్యాచ‌ర‌ణ ప్రధానమైనటువంటి బడ్జెట్ అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు అభివర్ణించారు.

కేంద్ర బ‌డ్జెట్ ను లోక్ స‌భ‌ లో ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత ఆయ‌న మాట్లాడుతూ, ‘‘బ‌డ్జెట్ లో ప్ర‌కటించిన నూత‌న సంస్క‌ర‌ణ‌ లు దేశ ఆర్ధిక రంగానికి ఊతమివ్వడమే కాకుండా దేశం లో పౌరులందరి కి ఆర్ధిక సాధికారిత కల్పన కూడా బడ్జెట్ ఉద్దేశం గా ఉంద’’న్నారు.

‘‘ఈ బ‌డ్జెట్ ఈ నూత‌న ద‌శాబ్దం లో ఆర్థిక వ్యవస్థ ను మ‌రింత‌ బ‌లోపేతం చేసే దిశ గా కూడా దోహ‌దం చేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ క‌ల్ప‌న‌ పై ప్ర‌త్యేక దృష్టి:

వ్య‌వ‌సాయం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, వస్త్ర పరిశ్రమ మ‌రియు సాంకేతిక విజ్ఞానం అనేవి భారీగా ఉద్యోగాల‌ ను క‌ల్పించే రంగాలు, అందుకే వాటి పైన కేంద్ర బ‌డ్జెట్ దృష్టి సారించింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘వ్య‌వ‌సాయ‌ రంగ అభివృద్ధి ధ్యేయం గా 16 అంశాల కార్యాచ‌ర‌ణ‌ ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది, వీటి ద్వారా రైతు ల ఆదాయాలు రెట్టింపు అవుతాయి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘వ్య‌వ‌సాయ‌ రంగాని కి సంబంధించి స‌మ్మిళిత వైఖరి ని కేంద్ర బ‌డ్జెట్ అనుస‌రించింది, సాంప్ర‌దాయిక వ్య‌వ‌సాయ విధానాల‌ కు ప్రాధాన్యాయన్ని ఇస్తూనే తోట పంట‌ లు, మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌ మరియు ప‌శు సంవ‌ర్‌పనం లో విలువ జోడింపు ను పెంపొందించ‌డం పై శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఉద్యోగాల క‌ల్ప‌న హెచ్చుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

నీలి ఆర్థిక వ్యవస్థ లో చేపట్టే ప్రయత్నాలు ఫిశ్ ప్రోసెసింగ్ మరియు మార్కెటింగ్ లో యువ‌త‌ కు అధిక ఉద్యోగ అవ‌కాశాల ను కల్పించగలుగుతాయన్నారు.

జౌళి రంగం

టెక్నికల్ టెక్స్ టైల్స్ లో నూత‌న యంత్రాల‌ కు సంబంధించి ఒక నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డమైందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ముడి స‌రుకు కు సంబంధించిన సుంకం స్వరూపం లో సంస్క‌ర‌ణ‌ల ను కూడా బడ్జెట్ లో ప్ర‌కటించడమైందిని త‌ద్వారా మ‌నిషి త‌యారు చేసే టెక్స్‌టైల్ ఫైబ‌ర్ ఉత్ప‌త్తి ని పెంచాలనేదే ఇందులోని ఉద్దేశ్వయమని ఆయన అన్నారు. ఈ సంస్క‌ర‌ణ కావాల‌నే డిమాండు గ‌డచిన మూడు ద‌శాబ్దాలు గా వున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.

ఆరోగ్య రంగం

ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం దేశం లో ఆరోగ్య రంగ విస్త‌ర‌ణ‌ కు తోడ్పడినట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం వ‌ల్ల మ‌రిన్ని మాన‌వ‌ వ‌న‌రుల ఉప‌యోగం సాధ్య‌మైంద‌ని, వైద్యులు, న‌ర్సులు, అటెండెంట్స్ రూపం లో కొత్త‌ గా ఉద్యోగాలు వ‌చ్చాయ‌న్నారు. అంతే కాదు దేశ‌వ్యాప్తం గా వైద్యం మరియు ఆరోగ్య రంగ ప‌రిక‌రాల త‌యారీ అవ‌స‌రం పెరిగింద‌ని అన్నారు. ఈ దిశ‌ గా ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌ల‌ ను చేప‌ట్టిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు.

సాంకేతిక విజ్ఞాన రంగం

సాంకేతిక రంగం లో ఉపాధి క‌ల్ప‌న ను పెంచ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అనేక ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌ ను చేప‌ట్టింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. స్మార్ట్ సిటీస్ , ఇలెక్ట్రానిక్స్ త‌యారీ రంగం, డేటా సెంట్ర‌ల్ పార్కు లు, బ‌యో టెక్నాల‌జీ, క్వాంట‌మ్ టెక్నాల‌జీ మొద‌లైన‌ వాటి కి సంబంధించిన ప‌లు విధానప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నామ‌న్నారు. దాంతో అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ లో భార‌త‌దేశం ఒక అంతర్భాగం అయింద‌ని వివరించారు.

డిగ్రీ కోర్సుల లో భాగం గా అప్రెంటిస్ శిప్‌, స్థానిక సంస్థ‌ల లో ఇంట‌ర్న్ శిప్‌, ఆన్ లైన్ డిగ్రీ లు త‌దిత‌ర వినూత్న విధానాల కార‌ణం గా యువ‌త‌ లో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఈ బ‌డ్జెట్ ప్ర‌త్యేకం గా దృష్టి పెట్టింద‌ని అన్నారు.

సూక్ష్మ‌, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మలు, ఎగుమ‌తి రంగాల లో ఉపాధి క‌ల్ప‌న‌ కు ఆధారాలు. అందుకే ఈ రంగాల లో ఎగుమ‌తుల ను పెంచ‌డం, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ ల స్థాప‌న‌ కు ఆర్ధిక సహాయాన్ని పెంచ‌డానికి బ‌డ్జెట్ ప్రాధాన్యాేన్ని ఇచ్చింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న

ఆధునిక భార‌త‌దేశాని కి ఆధునిక మౌలిక స‌దుపాయాలు కావలసి వుంద‌ని, ఈ రంగం లో ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న భారీ గా ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

6500 ప్రాజెక్టుల‌ కు సంబంధించి 100 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా పెట్టుబ‌డులు పెట్టడం జరుగుతోంది, దీని ద్వారా భారీ స్థాయి లో ఉపాధి క‌ల్ప‌న జ‌రుగుతుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అలాగే వాణిజ్యం , వ్యాపారం , ప‌రిశ్ర‌మ‌ లు, ఉద్యోగ క‌ల్ప‌న అంశాల లో ప్ర‌యోజ‌నం చేకూర్చ‌డానికి జాతీయ లాజిస్టిక్స్ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

దేశం లో 100 నూత‌న విమానాశ్ర‌యాల‌ ను అభివృద్ధి చేయాల‌నే ప్ర‌క‌ట‌న తో ప‌ర్యాట‌క రంగం బ‌లోపేతం్ అవుతుంద‌ని, త‌ద్వారా నూత‌న ఉద్యోగాల క‌ల్ప‌న‌ కు భారీ అవ‌కాశంద ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

పెట్టుబ‌డులు

ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌నే ధ్యేయం గా ఈ బ‌డ్జెట్ అనేక చారిత్రాత్మ‌క చ‌ర్య‌ల‌ ను తీసుకుంద‌ని, త‌ద్వారా పెట్టుబ‌డులు పెరుగుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ కు సంబంధించి బాండ్ మార్కెట్ ను, వాటి కి దీర్ఘ‌కాలిక ఆర్ధిక సహాయాన్ని అందించండాన్ని బ‌లోపేతం చేయ‌డానికిగాను అనేక చ‌ర్య‌ల‌ ను చేప‌ట్టిన‌ట్టు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. డివిడెండ్ డిస్ట్రి బ్యూశన్ ట్యాక్స్ ర‌ద్దు కార‌ణం గా ఆయా కంపెనీల‌ కు 25 వేల కోట్ల రూపాయలు మిగులుతాయ‌ని, వాటితో అవి మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

విదేశీ ప్ర‌త్యక్ష పెట్టుబ‌డుల‌ ను ఆక‌ర్షించ‌డానికిగాను అనేక ప‌న్ను రాయితీల‌ ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

అలాగే స్టార్ట్- అప్ ల‌ను, రియ‌ల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికిగాను అనేక ప‌న్ను ప్రోత్సాహ‌కాల‌ ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప‌న్ను ల వ్య‌వ‌స్థ‌ లో న‌మ్మ‌కం పెంచ‌డం పై ప్ర‌త్యేక దృష్టి

ఆదాయ ప‌న్ను వ్య‌వ‌స్థ‌ లో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌కుండా, న‌మ్మ‌కం మాత్ర‌మే ఉండేలా ప్ర‌భుత్వం ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. చిన్న చిన్న త‌ప్పు లు కూడా కంపెనీ చట్టం ప్ర‌కారం పెద్ద పెద్ద త‌ప్పులు గా క‌నిపించేవ‌ని.. ఈ విధానం ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యం తో అటువంటి చ‌ట్టాల‌ ను తొల‌గించ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప‌న్ను లు చెల్లించే వారి కి మేలు చేయ‌డ‌మే ల‌క్ష్యం గా ట్యాక్స్ పేయ‌ర్ చార్ట‌ర్ ను ప్రారంభిస్తున్నామ‌ని, అందులో వారి హ‌క్కుల జాబితా ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

ప‌న్నుల వ్య‌వ‌స్థ‌ ప‌ట్ల న‌మ్మ‌కం పెంచ‌డం లో భాగంగా సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ కు ఉప‌యోగ‌ప‌డేలా ఒక నిర్ణ‌యాన్ని తీసుకున్నామ‌ని, అది 5 కోట్ల రూపాయ‌ల‌ వ‌ర‌కు టర్నోవ‌ర్ ను క‌లిగి వున్న ప‌రిశ్ర‌మ‌లు త‌ప్ప‌నిస‌రి ఆడిట్ కింద‌కు రార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఈ ప‌రిమితి గ‌తం లో ఒక కోటి రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్‌ కు మాత్ర‌మే ఉండేద‌ని, దీని ని ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వం 5 కోట్ల రూపాయ‌ల‌ కు పెంచింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీ కి ఏకీకృత ప‌రీక్ష విధానం

ఇంత‌వ‌ర‌కు దేశం లో వివిధ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ కోసం వివిధ ర‌కాల పరీక్ష‌ల‌ కు హాజ‌రు కావలసి వుండేది. ఈ రంగం లో వ్య‌వ‌స్థీకృత‌మైన మార్పుల‌ ను తేవ‌డానికిగాను జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ సాయం తో దేశ‌వ్యాప్తం గా వ‌ర్తించేలా ఉమ్మ‌డి ప‌రీక్ష‌ల‌ ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. బ్యాంకు లు, రైల్వే లు, ఇంకా ఇత‌ర ప్ర‌భుత్వ రంగ ఉద్యోగాల‌ కోసం ఈ ప‌ని చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.

కనీస స్థాయి ప్రభుత్వం- గరిష్ఠ స్థాయి పాల‌న‌

ప్ర‌త్య‌క ప‌న్నుల వ్య‌వ‌స్థ స‌ర‌ళీక‌ర‌ణ‌, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌, ఫేస్ లెస్ అపీల్‌, ఏకీకృత స‌మీక‌ర‌ణ వ్య‌వ‌స్థ‌, ఆటో ఎన్ రోల్ మెంట్‌ తదితర కార్య‌క్ర‌మాల‌ ద్వారా ప్ర‌భుత్వ జోక్యం త‌గ్గిపోయి, అత్య‌ధిక స్థాయి లో పాల‌న ను అందిస్తున్నామ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ & ఈజ్ ఆఫ్ లివింగ్

బ్రాడ్ బ్యాండ్ ఇంట‌ర్ నెట్ ద్వారా దేశ వ్యాప్తం గా ఒక ల‌క్ష గ్రామ పంచాయితీల‌ కు సంబంధించిన అంగ‌న్ వాడీల‌ ను, పాఠ‌శాల‌ల‌ ను, ఆరోగ్య కేంద్రాల‌ ను, పోలీసు ఠాణాల ను క‌లుపుతామ‌ని ఈ బ‌డ్జెట్ ప్ర‌క‌టించింది.

దీని ద్వారా స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌ని విధానం అమ‌లు లోకి వ‌చ్చి, జీవ‌నం మెరుగ్గా వుంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

త‌ద్వారా దేశ‌వ్యాప్తం గా ప‌లు మారుమాల గ్రామాల‌ ను ప్ర‌ధాన స్ర‌వంతి వ్య‌వ‌స్థ‌ తో క‌ల‌ప‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఒక ముక్క‌ లో చెప్పాలంటే కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ఈ 2020 బ‌డ్జెట్ ఆదాయాల‌ ను, పెట్టుబ‌డుల‌ ను , డిమాండ్ ను మ‌రియు వినియోగాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. అంతే కాదు ఈ బ‌డ్జెట్ దేశం లోని ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ కు నూత‌న స్ఫూర్తి ని ర‌గిలిస్తుంది అని ప్ర‌ధాన మంత్రి వివరించారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi