కేంద్ర బడ్జెట్ 2020 ని దార్శనికత కలిగినటువంటి బడ్జెట్ మరియు కార్యాచరణ ప్రధానమైనటువంటి బడ్జెట్ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభివర్ణించారు.
కేంద్ర బడ్జెట్ ను లోక్ సభ లో ప్రవేశపెట్టిన తరువాత ఆయన మాట్లాడుతూ, ‘‘బడ్జెట్ లో ప్రకటించిన నూతన సంస్కరణ లు దేశ ఆర్ధిక రంగానికి ఊతమివ్వడమే కాకుండా దేశం లో పౌరులందరి కి ఆర్ధిక సాధికారిత కల్పన కూడా బడ్జెట్ ఉద్దేశం గా ఉంద’’న్నారు.
‘‘ఈ బడ్జెట్ ఈ నూతన దశాబ్దం లో ఆర్థిక వ్యవస్థ ను మరింత బలోపేతం చేసే దిశ గా కూడా దోహదం చేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగ కల్పన పై ప్రత్యేక దృష్టి:
వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన, వస్త్ర పరిశ్రమ మరియు సాంకేతిక విజ్ఞానం అనేవి భారీగా ఉద్యోగాల ను కల్పించే రంగాలు, అందుకే వాటి పైన కేంద్ర బడ్జెట్ దృష్టి సారించింది అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘వ్యవసాయ రంగ అభివృద్ధి ధ్యేయం గా 16 అంశాల కార్యాచరణ ను ప్రకటించడం జరిగింది, వీటి ద్వారా రైతు ల ఆదాయాలు రెట్టింపు అవుతాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘వ్యవసాయ రంగాని కి సంబంధించి సమ్మిళిత వైఖరి ని కేంద్ర బడ్జెట్ అనుసరించింది, సాంప్రదాయిక వ్యవసాయ విధానాల కు ప్రాధాన్యాయన్ని ఇస్తూనే తోట పంట లు, మత్స్య పరిశ్రమ మరియు పశు సంవర్‌పనం లో విలువ జోడింపు ను పెంపొందించడం పై శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఉద్యోగాల కల్పన హెచ్చుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
నీలి ఆర్థిక వ్యవస్థ లో చేపట్టే ప్రయత్నాలు ఫిశ్ ప్రోసెసింగ్ మరియు మార్కెటింగ్ లో యువత కు అధిక ఉద్యోగ అవకాశాల ను కల్పించగలుగుతాయన్నారు.
జౌళి రంగం
టెక్నికల్ టెక్స్ టైల్స్ లో నూతన యంత్రాల కు సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడమైందని ప్రధాన మంత్రి అన్నారు.
ముడి సరుకు కు సంబంధించిన సుంకం స్వరూపం లో సంస్కరణల ను కూడా బడ్జెట్ లో ప్రకటించడమైందిని తద్వారా మనిషి తయారు చేసే టెక్స్‌టైల్ ఫైబర్ ఉత్పత్తి ని పెంచాలనేదే ఇందులోని ఉద్దేశ్వయమని ఆయన అన్నారు. ఈ సంస్కరణ కావాలనే డిమాండు గడచిన మూడు దశాబ్దాలు గా వున్న విషయాన్ని ఈ సందర్భం గా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
ఆరోగ్య రంగం
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశం లో ఆరోగ్య రంగ విస్తరణ కు తోడ్పడినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల మరిన్ని మానవ వనరుల ఉపయోగం సాధ్యమైందని, వైద్యులు, నర్సులు, అటెండెంట్స్ రూపం లో కొత్త గా ఉద్యోగాలు వచ్చాయన్నారు. అంతే కాదు దేశవ్యాప్తం గా వైద్యం మరియు ఆరోగ్య రంగ పరికరాల తయారీ అవసరం పెరిగిందని అన్నారు. ఈ దిశ గా ప్రభుత్వం అనేక చర్యల ను చేపట్టిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
సాంకేతిక విజ్ఞాన రంగం
సాంకేతిక రంగం లో ఉపాధి కల్పన ను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యల ను చేపట్టిందని ప్రధాన మంత్రి అన్నారు. స్మార్ట్ సిటీస్ , ఇలెక్ట్రానిక్స్ తయారీ రంగం, డేటా సెంట్రల్ పార్కు లు, బయో టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ మొదలైన వాటి కి సంబంధించిన పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. దాంతో అంతర్జాతీయ వ్యవస్థ లో భారతదేశం ఒక అంతర్భాగం అయిందని వివరించారు.
డిగ్రీ కోర్సుల లో భాగం గా అప్రెంటిస్ శిప్, స్థానిక సంస్థల లో ఇంటర్న్ శిప్, ఆన్ లైన్ డిగ్రీ లు తదితర వినూత్న విధానాల కారణం గా యువత లో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ప్రత్యేకం గా దృష్టి పెట్టిందని అన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎగుమతి రంగాల లో ఉపాధి కల్పన కు ఆధారాలు. అందుకే ఈ రంగాల లో ఎగుమతుల ను పెంచడం, చిన్న తరహా పరిశ్రమ ల స్థాపన కు ఆర్ధిక సహాయాన్ని పెంచడానికి బడ్జెట్ ప్రాధాన్యాేన్ని ఇచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు.
మౌలిక సదుపాయాల కల్పన
ఆధునిక భారతదేశాని కి ఆధునిక మౌలిక సదుపాయాలు కావలసి వుందని, ఈ రంగం లో ఉపాధి, ఉద్యోగ కల్పన భారీ గా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు.
6500 ప్రాజెక్టుల కు సంబంధించి 100 లక్షల కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది, దీని ద్వారా భారీ స్థాయి లో ఉపాధి కల్పన జరుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. అలాగే వాణిజ్యం , వ్యాపారం , పరిశ్రమ లు, ఉద్యోగ కల్పన అంశాల లో ప్రయోజనం చేకూర్చడానికి జాతీయ లాజిస్టిక్స్ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.
దేశం లో 100 నూతన విమానాశ్రయాల ను అభివృద్ధి చేయాలనే ప్రకటన తో పర్యాటక రంగం బలోపేతం్ అవుతుందని, తద్వారా నూతన ఉద్యోగాల కల్పన కు భారీ అవకాశంద ఉంటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
పెట్టుబడులు
ఉపాధి, ఉద్యోగ కల్పనే ధ్యేయం గా ఈ బడ్జెట్ అనేక చారిత్రాత్మక చర్యల ను తీసుకుందని, తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు సంబంధించి బాండ్ మార్కెట్ ను, వాటి కి దీర్ఘకాలిక ఆర్ధిక సహాయాన్ని అందించండాన్ని బలోపేతం చేయడానికిగాను అనేక చర్యల ను చేపట్టినట్టు ప్రధాన మంత్రి చెప్పారు. డివిడెండ్ డిస్ట్రి బ్యూశన్ ట్యాక్స్ రద్దు కారణం గా ఆయా కంపెనీల కు 25 వేల కోట్ల రూపాయలు మిగులుతాయని, వాటితో అవి మరిన్ని పెట్టుబడులు పెట్టవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ను ఆకర్షించడానికిగాను అనేక పన్ను రాయితీల ను ప్రకటించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.
అలాగే స్టార్ట్- అప్ లను, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికిగాను అనేక పన్ను ప్రోత్సాహకాల ను ప్రకటించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.
పన్ను ల వ్యవస్థ లో నమ్మకం పెంచడం పై ప్రత్యేక దృష్టి
ఆదాయ పన్ను వ్యవస్థ లో ఎటువంటి సమస్యలు ఉండకుండా, నమ్మకం మాత్రమే ఉండేలా ప్రభుత్వం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. చిన్న చిన్న తప్పు లు కూడా కంపెనీ చట్టం ప్రకారం పెద్ద పెద్ద తప్పులు గా కనిపించేవని.. ఈ విధానం ఉండకూడదనే ఉద్దేశ్యం తో అటువంటి చట్టాల ను తొలగించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
పన్ను లు చెల్లించే వారి కి మేలు చేయడమే లక్ష్యం గా ట్యాక్స్ పేయర్ చార్టర్ ను ప్రారంభిస్తున్నామని, అందులో వారి హక్కుల జాబితా ఉంటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకం పెంచడం లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కు ఉపయోగపడేలా ఒక నిర్ణయాన్ని తీసుకున్నామని, అది 5 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ను కలిగి వున్న పరిశ్రమలు తప్పనిసరి ఆడిట్ కిందకు రారని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ పరిమితి గతం లో ఒక కోటి రూపాయల టర్నోవర్ కు మాత్రమే ఉండేదని, దీని ని ఇప్పుడు తమ ప్రభుత్వం 5 కోట్ల రూపాయల కు పెంచిందని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి ఏకీకృత పరీక్ష విధానం
ఇంతవరకు దేశం లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ రకాల పరీక్షల కు హాజరు కావలసి వుండేది. ఈ రంగం లో వ్యవస్థీకృతమైన మార్పుల ను తేవడానికిగాను జాతీయ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ సాయం తో దేశవ్యాప్తం గా వర్తించేలా ఉమ్మడి పరీక్షల ను నిర్వహిస్తామని ప్రధాన మంత్రి అన్నారు. బ్యాంకు లు, రైల్వే లు, ఇంకా ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఈ పని చేస్తామని ఆయన అన్నారు.
కనీస స్థాయి ప్రభుత్వం- గరిష్ఠ స్థాయి పాలన
ప్రత్యక పన్నుల వ్యవస్థ సరళీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల లో పెట్టుబడుల ఉపసంహరణ, ఫేస్ లెస్ అపీల్, ఏకీకృత సమీకరణ వ్యవస్థ, ఆటో ఎన్ రోల్ మెంట్ తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ జోక్యం తగ్గిపోయి, అత్యధిక స్థాయి లో పాలన ను అందిస్తున్నామని ప్రధాన మంత్రి అన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ & ఈజ్ ఆఫ్ లివింగ్
బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ ద్వారా దేశ వ్యాప్తం గా ఒక లక్ష గ్రామ పంచాయితీల కు సంబంధించిన అంగన్ వాడీల ను, పాఠశాలల ను, ఆరోగ్య కేంద్రాల ను, పోలీసు ఠాణాల ను కలుపుతామని ఈ బడ్జెట్ ప్రకటించింది.
దీని ద్వారా సమర్థవంతమైన పని విధానం అమలు లోకి వచ్చి, జీవనం మెరుగ్గా వుంటుందని ప్రధాన మంత్రి అన్నారు.
తద్వారా దేశవ్యాప్తం గా పలు మారుమాల గ్రామాల ను ప్రధాన స్రవంతి వ్యవస్థ తో కలపడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
ఒక ముక్క లో చెప్పాలంటే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ 2020 బడ్జెట్ ఆదాయాల ను, పెట్టుబడుల ను , డిమాండ్ ను మరియు వినియోగాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అంతే కాదు ఈ బడ్జెట్ దేశం లోని ఆర్ధిక వ్యవస్థ కు నూతన స్ఫూర్తి ని రగిలిస్తుంది అని ప్రధాన మంత్రి వివరించారు.
मैं इस दशक के पहले बजट के लिए, जिसमें विजन भी है, एक्शन भी है, वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी टीम को बहुत-बहुत बधाई देता हूं: PM @narendramodi on the Union Budget
— PMO India (@PMOIndia) February 1, 2020
बजट में जिन नए रीफॉर्म्स का ऐलान किया गया है, वो अर्थव्यवस्था को गति देने, देश के प्रत्येक नागरिक को आर्थिक रूप से सशक्त करने और इस दशक में अर्थव्यवस्था की नींव को मजबूत करने का काम करेंगे: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
रोजगार के प्रमुख क्षेत्र होते हैं, एग्रीकल्चर, इंफास्ट्रक्चर, टेक्सटाइल और टेक्नोलॉजी। इम्प्लॉयमेंट जनरेशन को बढ़ाने के लिए इन चारों पर इस बजट में बहुत जोर दिया गया है: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
किसान की आय दोगुनी हो, इसके प्रयासों के साथ ही, 16 एक्शन प्वाइंट्स बनाए गए हैं जो ग्रामीण क्षेत्र में रोजगार को बढ़ाने का काम करेंगे: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
बजट में कृषि क्षेत्र के लिए Integrated approach अपनाई गई, जिससे परंपरागत तौर तरीकों के साथ ही हॉर्टिकल्चर, फिशरीज, एनीमल हस्बेंड्री में वैल्यू एडिशन बढेगा और इससे भी रोजगार बढ़ेगा। ब्लू इंकोनॉमी के अंतर्गत युवाओं को फिश प्रोसेसिंग और मार्केटिंग क्षेत्र में भी नए अवसर मिलेंगे: PM
— PMO India (@PMOIndia) February 1, 2020
टेक्निकल टेक्सटाइल के लिए नए मिशन की घोषणा हुई है। मैनमेड फाइबर को भारत में प्रोड्यूज करने के लिए उसके रॉ मटेरियल के ड्यूटी स्ट्रक्चर में रीफॉर्म किया गया है। इस रीफॉर्म की पिछले तीन दशकों से मांग हो रही थी: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
आयुष्मान भारत योजना ने देश के हेल्थ सेक्टर को नया विस्तार दिया है। इस सेक्टर में ह्यूमन रीसोर्स- डॉक्टर, नर्स, अटेनडेंट के साथ ही मेडिकल डिवाइस मैन्यूफैक्चरिंग का बहुत स्कोप बना है। इसे बढ़ाने के लिए सरकार द्वारा नए निर्णय लिए गए हैं: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
टेक्नोलॉजी के क्षेत्र में इम्प्लॉयमेंट जनरेशन को बढ़ावा देने के लिए इस बजट में हमने कई विशेष प्रयास किए हैं। नए स्मार्ट सिटीज, इलेक्ट्रॉनिक मैन्यूफैक्चरिंग, डेटा सेंटर पार्क्स, बायो टेक्नोलॉजी और क्वांटम टेक्नोलॉजी, जैसे क्षेत्रों के लिए अनेक पॉलिसी इनिशिएटिव्स लिए गए हैं: PM
— PMO India (@PMOIndia) February 1, 2020
इसके द्वारा भारत, ग्लोबल वैल्यू चेन का एक अभिन्न अंग बनने की तरफ मजबूती से आगे बढ़ेगा: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
इसके द्वारा भारत, ग्लोबल वैल्यू चेन का एक अभिन्न अंग बनने की तरफ मजबूती से आगे बढ़ेगा: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
आधुनिक भारत के लिए आधुनिक इंफ्रास्ट्रक्चर का बहुत महत्व है। इंफ्रास्ट्रक्चर का क्षेत्र भी बड़ा इंप्लायमेंट जनरेटर है।100 लाख करोड़ रुपए से 65 सौ प्रोजेक्ट्स का निर्माण, बड़े पैमाने पर रोजगार के अवसर बढ़ाएगा। नेशनल लॉजिस्टिक्स पॉलिसी से भी व्यापार, कारोबार, रोज़गार को लाभ होगा: PM
— PMO India (@PMOIndia) February 1, 2020
डिविडेंट डिस्ट्रिब्यूशन टैक्स को हटाने के कारण, कंपनियों के हाथ में 25 हजार करोड़ रुपए आएंगे जो उनको आगे इनवेस्टमेंट करने में मदद करेंगे। बाहर के निवेश को भारत में आकर्षित करने के लिए विभिन्न टैक्स कन्सेशन्स दिए गए हैं: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
स्टार्ट अप्स और रीयल इस्टेट्स के लिए भी टैक्स बेनिफिट्स दिए गए हैं। ये सभी फैसले अर्थव्यवस्था को तेज गति से बढ़ाने और इसके जरिए युवाओं को रोजगार के नए अवसर उपलब्ध कराएंगे। अब हम इनकम टैक्स की व्यवस्था में, विवाद से विश्वास के सफर पर चल पड़े हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 1, 2020
हमारे कंपनी कानूनों में जो अभी कुछ सिविल नेचर की गलतियां होती हैं, उन्हें अब डी-क्रिमिनलाइज करने का बड़ा फैसला किया गया है। टैक्सपेयर चार्ट्रर के द्वारा टैक्यपेयर्स के अधिकारों को स्पष्ट किया जाएगा: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
मिनिमम गवन्मेंट, मैक्सीमम गवर्नेंस के कमिटमेंट को इस बजट ने और मजबूत किया है: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
फेसलेस अपील का प्रावधान, डायरेक्ट टैक्स का नया, सरल स्ट्रक्चर, डिसइनवेस्टमेंट पर जोर, ऑटो इनरोलमेंट के जरिए यूनिवर्सल पेंशन का प्रावधान, यूनिफाइड प्रोक्योरमेंट सिस्टम की ओर बढ़ना, ये कुछ ऐसे कदम हैं, जो लोगों की जिंदगी में से सरकार को कम करेंगे, उनकी ईज ऑफ लिविंग को बढ़ाएंगे: PM
— PMO India (@PMOIndia) February 1, 2020
आज सरकारी नौकरी के लिए युवाओं को कई अलग-अलग परीक्षाएं देनी होती हैं। इस व्यवस्था को बदलकर, अब नेशनल रिक्रूटमेंट एजेंसी द्वारा लिए गए ऑनलाइन कॉमन एक्जाम के जरिए, नियुक्तियां की जाएंगी: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
किसानों के लिए अपने उत्पादों को सही तरह से मार्केट करने और ट्रांसपोर्ट के लिए - किसान रेल और कृषि उड़ान के द्वारा नई व्यवस्था बनाई जाएगी: PM @narendramodi #JanJanKaBudget
— PMO India (@PMOIndia) February 1, 2020
मुझे विश्वास है कि ये बजट Income और Investment को बढ़ाएगा, Demand और Consumption को बढ़ाएगा, Financial System और Credit Flow में नई स्फूर्ति लाएगा।
— PMO India (@PMOIndia) February 1, 2020
ये बजट देश की वर्तमान आवश्यकताओं के साथ ही इस दशक में भविष्य की अपेक्षाओं की पूर्ति करेगा: PM @narendramodi #JanJanKaBudget