శ్రేష్ఠులారా,
అఫ్ గానిస్తాన్ లో స్థితిగతులపైన ఎస్ సిఒ కు, సిఎస్ టిఒ కు మధ్య ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ రహమాన్ కు ధన్యవాదాలు తెలయజేసి అప్పుడు నన్ను ప్రసంగాన్ని మొదలుపెట్టనివ్వండి.
అఫ్ గానిస్తాన్ లో ఇటీవలి పరిణామాలు మా వంటి పొరుగుదేశాల మీద ఘనతమమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి.
మరి, అందుకే, ఈ అంశం పైన ఒక ప్రాంతీయ స్పష్టత ను, సహకారాన్ని ఏర్పరచడం జరూరు గా జరగాలి.
ఈ సందర్భం లో, మనం నాలుగు అంశాల పైన శ్రద్ధ వహించవలసి ఉంది.
ఒకటో అంశం ఏమిటి అంటే అది అఫ్ గానిస్తాన్ లో అధికార బదలాయింపు అనేది అన్ని వర్గాల ను కలుపుకొని పోయేది గా లేదు అనేది, అది సంప్రదింపులకు తావు లేకుండా జరిగింది అనేదే.
ఇది కొత్త వ్యవస్థ ఆమోదయోగ్యత విషయం లో ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
అఫ్ గాన్ సమాజం లో మహిళ లు మరియు అల్పసంఖ్యాక వర్గాలు సహా, అన్ని వర్గాల కు ప్రాతినిధ్యం ఉండటం అనేది కూడా ముఖ్యం.
మరి అందువల్ల, అటువంటి ఒక కొత్త వ్యవస్థ కు గుర్తింపు నిచ్చే అంశం లో ప్రపంచ సముదాయం సమష్టి గా బాగా ఆలోచన చేసిన తరువాత నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం.
ఈ అంశం లో ఐక్య రాజ్య సమితి యొక్క కేంద్రీయ ఫాత్ర ను భారతదేశం సమర్థిస్తుంది.
రెండోది ఏమిటి అంటే, అఫ్ గానిస్తాన్ లో అస్థిరత్వం, ఛాందస వాదం పట్టు విడువకపోతే, అది ప్రపంచ వ్యాప్తం గా ఉగ్రవాదులను, అతివాద సిద్ధాంతాల ను ప్రోత్సహించవచ్చు.
హింస ద్వారా అధికారం లోకి రావడం కోసం ఇతర ఉగ్రవాద సమూహాల ను సైతం ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది.
గతం లో మన దేశాలు అన్నీ కూడాను ఉగ్రవాద బాధిత దేశాలు అని చెప్పాలి.
మరి ఆ కారణం గా, మరే దేశం లోనూ ఉగ్రవాదాన్ని విస్తరించడం కోసం అఫ్ గానిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకోకుండా కలసికట్టు గా మనం పూచీపడాలి. ఈ విషయం లో కఠినమైన, అంగీకారపూర్వకమైనటువంటి నిబంధనల ను ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు రూపొందించాలి.
అప్పుడు ఈ నిబంధనావళి భవిష్యత్తు లో ప్రపంచం లో ఉగ్రవాద వ్యతిరేక చర్యల కు ఒక నమూనా గా మారగలుగుతుంది.
ఈ నిబంధనావళి ఉగ్రవాదం పట్ల జీరో-టాలరెన్స్ సూత్రం ఆధారం గా రూపొందాలి.
సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యల కు ఆర్థిక సాయంవంటి కార్యకలాపాల ను అడ్డుకోవడం కోసం ఒక ప్రవర్తన నియమావళి అంటూ ఉండాలి. అంతేకాదు, ఆ నియమావళి అమలు కు గాను ఒక వ్యవస్థ ను ఏర్పరచాలి.
శ్రేష్ఠులారా,
అఫ్ గానిస్తాన్ లో జరుగుతున్న ఘటనల కు సంబంధించిన మూడో అంశం ఏమిటి అంటే అది మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ ఆయుధాల ప్రవాహానికి తోడు మానవుల అక్రమ తరలింపు.
ఆధునికమైన ఆయుధాలు పెద్ద సంఖ్య లో అఫ్ గానిస్తాన్ లో పోగుపడి ఉన్నాయి. వాటి కారణం గా యావత్తు ప్రాంతం లోను అస్థిరత్వం తాలూకు అపాయం పొంచి ఉండగలదు.
ఈ ప్రవాహాల ను పర్యవేక్షించడం లోను, సమాచారాన్ని పంచుకోవడాన్ని పెంచడం లోను ఎస్ సిఒ తాలూకు ఆర్ ఎటిఎస్ యంత్రాంగం ఒక నిర్మాణాత్మకమైన భూమిక ను పోషించవచ్చును.
ఈ నెల నుంచి, భారతదేశం కౌన్సిల్ ఆఫ్ ఎస్ సిఒ-ఆర్ ఎటిఎస్ కు అధ్యక్షత వహిస్తున్నది. మేం ఈ విషయం లో ఆచరణీయ సహకారానికి గాను ప్రతిపాదనల ను రూపొందించాం.
నాలుగో అంశం ఏమిటి అంటే అది అఫ్ గానిస్తాన్ లో తీవ్రమైనటువంటి మానవత సంబంధి సంకటం ఏర్పడటం.
ఆర్థికపరమైనటువంటి, వ్యాపార పరమైనటువంటి ప్రవాహాల కు అంతరాయం కలిగిన కారణం గా అఫ్ గాన్ ప్రజల కు ఆర్థిక లోటు పాటులు అనేవి ప్రబలుతున్నాయి.
అదే కాలం లో, కోవిడ్ సవాలు కూడా ను వారి దుస్థితి కి ఒక కారణం అయింది.
భారతదేశం చాలా సంవత్సరాలు గా అభి వృద్ధిలో, మానవతాపూర్వక సహాయక కార్యకలాపాల లో అఫ్ గానిస్తాన్ కు ఒక విశ్వసనీయమైనటువంటి భాగస్వామి గా ఉంటూ వస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన మొదలుకొని విద్య, ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల రంగం వరకు ప్రతి ఒక్క రంగం లోను మేం అఫ్ గానిస్తాన్ లోని ప్రతి ఒక్క ప్రాంతానికి మా తోడ్పాటు ను అందించాం.
ఈనాటికి కూడాను, మనం అఫ్ గాన్ లోని మన మిత్రుల కు ఆహార పదార్థాల ను, మందులు మొదలైన వాటి ని అందజేయాలని ఆతురత తో ఉన్నాం.
అఫ్ గానిస్తాన్ కు మానవతాపూర్వకమైన సహాయం అడ్డంకి లేనటువంటి పద్థతి లో అందే విధం గా చూడటం కోసం మనం అందరం కలసికట్టుగా పనిచేయవలసి ఉంది.
శ్రేష్ఠులారా,
అఫ్ గాన్ ప్రజానీకం, భారతదేశం ప్రజానీకం శతాబ్దాల తరబడి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని పంచుకొంటూ వస్తున్నారు.
అఫ్ గాన్ సమాజానికి సాయపడటం కోసం చేపట్టే ప్రతి ఒక్క ప్రాంతీయ కార్యక్రమానికి గాని, లేదా ప్రపంచ స్థాయి కార్యక్రమానికి గాను భారతదేశం పూర్తి సహకారాన్ని అందిస్తుంది.
మీకు ధన్యవాదాలు.