ఎక్స్ లన్సి,
ఈ దుఃఖ ఘడియ లో ఈ రోజు న మనం భేటీ అవుతున్నాం. ఈ రోజు న జపాన్ కు చేరుకొన్నప్పటి నుండి, నా అంతట నేను మరింత దుఃఖానికి లోనవుతున్నాను. ఇలా ఎందుకు అంటే, కిందటి సారి నేను ఇక్కడ కు వచ్చినప్పుడు శ్రీ ఆబే శాన్ తో చాలా సేపు మాట్లాడడం జరిగింది. మరి వెనుదిరిగి వెళ్లిన తరువాత ఇటువంటి వార్త ను వినవలసి వస్తుందని నేను ఎన్నడు అనుకోనే లేదు.
శ్రీ ఆబే శాన్ మరియు ఆయన తో కలసి మీరు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గా భారతదేశం-జపాన్ సంబంధాల ను సరికొత్త శిఖరాల కు తీసుకు పోయారు; అంతేకాకుండా, వాటిని అనేక రంగాల కు విస్తరింప చేశారు కూడాను. మరి మన స్నేహం తో పాటు గా భారతదేశం మరియు జపాన్ ల యొక్క మైత్రి సైతం ఒక ప్రపంచ వ్యాప్త ప్రభావాన్ని ఏర్పరచడం లోనూ చాలా పెద్ద పాత్ర ను పోషించాయి. మరి దీనికంతటికీ గాను ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రజానీకం శ్రీ ఆబే శాన్ ను మరీ మరీ గుర్తు కు తెచ్చుకొంటున్నది; జపాన్ ను చాలా చాలా గుర్తు కు తెచ్చుకొంటోంది. భారతదేశం ఒక రకం గా ఆయన లేని లోటు ను ఎప్పటికీ తలచుకొంటూనే ఉంటుంది.
అయితే, మీ యొక్క నాయకత్వం లో భారతదేశం-జపాన్ సంబంధాలు గాఢతరం అవడమే కాకుండా మరింత గా ఉన్నతం అవుతాయన్న నమ్మకం కూడా నాకుంది. మరి ప్రపంచం యొక్క సమస్యల కు పరిష్కారాల ను వెదకడం లో మనం ఒక సముచితమైనటువంటి పాత్ర ను పోషించగలుగుతాం అని నేను దృఢం గా విశ్వసిస్తున్నాను.