ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.
తక్కువ మంది కి మాత్రమే టీకామందు ను ఇప్పించడానికి కారణమైన అంశాల ను మరియు సవాళ్ళ ను గురించి జిల్లా మేజిస్ట్రేట్ లు వివరించారు. టీకామందు ను తీసుకోవాలా? లేక తీసుకోవద్దా అనే ఊగిసలాట వైఖరి కి కారణం అయిన వదంతులు, కొన్ని ప్రాంతాలు చేరుకోవడానికి దుర్గమంగా ఉండడం, ఇటీవలి నెలల్లో తలెత్తిన వాతావరణ స్థితి వంటి సవాళ్ళ ను వారు ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ సవాళ్ళ ను అధిగమించడం కోసం ఇంతవరకు వారు తీసుకొన్న చర్యల ను కూడా జిల్లా మేజిస్ట్రేట్ లు సమావేశం దృష్టి కి తీసుకు వచ్చారు. అలాగే, తాము చేపట్టిన చక్కటి అభ్యాసాలు టీకామందు రక్షణ లో వృద్ధి కి దారి తీసిన వైనాన్ని కూడా వారు ఈ సందర్భం లో వెల్లడించారు.
సంభాషణ కొనసాగిన క్రమం లో, ప్రజలు టీకా మందు ను తీసుకోవడానికి వెనుకాడటం, ఈ స్థితి కి వెనుక గల స్థానిక అంశాల ను గురించి ప్రధాన మంత్రి సమగ్రం గా చర్చించారు. ఆయా జిల్లాల లో అందరికీ టీకామందు ను వేయడానికి అమలుపరచవలసిన అనేకమైనటువంటి ఆలోచనల ను గురించి ఆయన ప్రస్తావించారు. ధర్మ గురువులు, సాముదాయక ప్రముఖుల ప్రమేయం ద్వారా ఈ కార్యక్రమం లో సముదాయాలు గరిష్ఠం గా పాలుపంచుకొనేటట్టు చేయడం గురించి ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం ఆఖరు కల్లా దేశం తన టీకామందు రక్షణ పరిధి ని విస్తరించుకొనేటట్లు గాను, రెట్టించిన ఆత్మవిశ్వాసం తో కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టేటట్లుగాను అధికారులు చూడాలి అని ఆయన ఉద్బోధించారు.
దేశం లో టీకాకరణ కార్యక్రమాన్ని గురించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమావేశం లో సమగ్రం గా వివరించారు. రాష్ట్రాల లో వాక్సీన్ డోజు లభ్యత ను గురించి ఆయన తెలియజేశారు. అంతేకాకుండా, టీకామందు రక్షణ పరిధి ని మరింత గా మెరుగుపరచడం కోసం రాష్ట్రాల లో ప్రత్యేకం గా నడుపుతున్న వాక్సీనేశన్ ప్రచారాలను గురించి కూడా ఆయన వివరించారు.
ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. వారి శ్రద్ధ మరింత దృఢ సంకల్పం తో కృషి చేయడానికి జిల్లా కు ప్రేరణ ను అందించగలదని ఆయన అన్నారు. వందేళ్ళ లో అత్యంత భారీ స్థాయి లో ప్రబలిన ఈ మహమ్మారి కాలం లో, దేశం అనేక సవాళ్ళ ను ఎదుర్కొందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘కరోనా కు వ్యతిరేకం గా దేశం జరిపిన యుద్ధం లో చోటు చేసుకొన్న ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటి అంటే అది మనం కొత్త పరిష్కార మార్గాల ను కనుగొనడం, వినూత్నమైన పద్ధతుల లో ముందుకు పోవాలని చూడటమూను’’ అని ఆయన అన్నారు. జిల్లా పాలనాధికారులు వారి వారి జిల్లాల లో వాక్సీనేశన్ ను పెంచడం కోసం సరికొత్తవైన మార్గాల లో కృషి చేయాలి అని ఆయన కోరారు. మంచి పని తీరును కనబరచిన జిల్లాల లో సైతం ఒకే తరహా సవాళ్ళు ఎదురుపడ్డాయి అని ఆయన చెప్తూ, కానీ దృఢ నిశ్చయం తోను, కొత్త కొత్త ఆలోచనల తోను ఆ సవాళ్ల కు ఎదురొడ్డడం జరిగిందన్నారు. స్థానికం గా ఏర్పడ్డ వెలితుల ను పూరించుకొంకటూ టీకామందు ను అందరికీ ఇప్పించడం లో ఇంతవరకు గడించిన అనుభవాన్ని దృష్టి లో పెట్టుకొని సూక్ష్మ వ్యూహాల ను అధికారులు రూపొందించాలి అని ఆయన అన్నారు. అవసరమనుకొంటే జిల్లాల లోని ప్రతి ఒక్క పట్టణానికి, ప్రతి ఒక్క పల్లె కు విభిన్నమైన వ్యూహాల ను రూపొందించండని జిల్లా అధికారుల కు ప్రధాన మంత్రి సూచించారు. ప్రాంతాన్ని బట్టి 20-25 మంది తో కూడినటువంటి ఒక జట్టు ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్యాన్ని సాధించవచ్చు అంటూ ఆయన సలహా ఇచ్చారు. మీరు ఏర్పాటు చేసిన జట్టుల మధ్య ఆరోగ్యకరమైనటువంటి ఓ పోటీ ని నిర్వహించే ప్రయత్నాన్ని చేయండి అని కూడా ఆయన చెప్పారు. స్థానిక లక్ష్యాల ను సాధించడం కోసం ప్రాంతం వారీ కాల పట్టికల ను రూపొందించాలని అధికారుల కు ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మీరు మీ యొక్క జిల్లాల ను జాతీయ సగటు కు దగ్గర గా తీసుకు పోవడం కోసం మీ వంతు గా ఉత్తమమైన కృషి ని చేయాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
టీకామందు ను వేయించుకోవడం గురించి వదంతులు ఉన్న విషయాన్ని, టీకామందు ను వేయించుకోవడం గురించి తప్పు భావనలు ఉన్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీనికి ఉన్న ఒకే పరిష్కారమల్లా చైతన్యమే అని ఆయన చెప్తూ, ధర్మ గురువు ల సాయాన్ని అడిగి తీసుకోవలసింది గా రాష్ట్రాల అధికారుల ను కోరారు. ధార్మిక నాయకులు టీకాకరణ ప్రచారం విషయం లో చాలా ఆసక్తి తో ఉన్నారు అని ప్రధాన మంత్రి చెప్పారు. కొద్ది రోజుల కిందట వాటికన్ లో పోప్ ఫ్రాన్సిస్ గారి తో తాను సమావేశం కావడాన్ని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. ప్రజల కు టీకా మందు ను వేసే అంశం లో ధర్మ గురువుల సందేశాన్ని సంపాదించుకోవడం పట్ల ప్రత్యేకం గా శ్రద్ధ వహించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీకామందు వేసే కేంద్రం వద్ద కు ప్రజల ను తీసుకు పోవడానికి, జాగ్రత గా టీకామందు ను వేయడానికి చేసిన ఏర్పాట్ల స్ధాయి నుంచి ఇంటింటి కి పోయి వాక్సీన్ లను వేయడం అనే స్థాయి కి మారండంటూ అధికారుల ను ప్రధాన మంత్రి కోరారు. ‘హర్ ఘర్ టీకా, ఘర్ ఘర్ టీకా’ (ప్రతి ఇంటికి టీకా, ఇంటింటికీ టీకా) అనే మానసిక ఉద్వేగం తో ప్రతి ఇంటి ని చేరుకోవలసింది గా ఆరోగ్య శ్రమికుల కు ప్రధాన మంత్రి మనవి చేశారు. పూర్తి స్థాయి లో టీకా మందు ను ఇప్పించే లక్ష్యాన్ని సాధించడం కోసం ‘హర్ ఘర్ దస్తక్’ అనే భావన తో ముందడుగు వేయండి అని ఆయన సూచించారు. ‘‘ప్రస్తుతం మనం టీకాకరణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం వద్ద కు తీసుకు పోవడానికి సన్నద్ధం అవుతున్నాం. ‘హర్ ఘర్ దస్తక్’ (ప్రతి ఇంటి తలుపు ను తట్టడం) అనే మంత్రం ద్వారా వాక్సీన్ తాలూకు రెండు డోజు ల భద్రత వలయం లోపించిన ప్రతి ఒక్క కుటుంబాని కి చేరువ కావడం జరుగుతుంది’’ అని ఆయన అన్నారు.
ప్రతి ఇంటి తలుపును తట్టేటప్పుడు, ఒకటో డోజు కు మాదిరిగానే రెండో డోజు కు కూడాను సమాన శ్రద్ధ ను తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి జాగ్రత చెప్పారు. ఇలా ఎందుకంటే, సంక్రమణ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పుడల్లా ఒక్కొక్క సారి అత్యవసరం అనేటటువంటి భావన పై ఉపేక్ష జనిస్తుంటుంది. టీకామందు ను వెంటనే వేయించుకోవాలి అనే ఆలోచన ప్రజల లో మందగిస్తుంది. ‘‘నిర్ణీత కాలం గడచిన తరువాత రెండో డోజు ను తీసుకోనటువంటి వ్యక్తుల ను ప్రాథమ్య ప్రాతిపదిక న మీరు సంప్రదించాలి.. ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ప్రపంచం లోని అనేక దేశాల లో సమస్యల ను కొనితెచ్చింది’’ అని చెప్తూ అధికారుల ను ఆయన అప్రమత్తం చేశారు.
‘అందరికీ ఉచితం గా టీకా మందు’ తాలూకు ప్రచారం లో భాగం గా భారతదేశం ఒక్క రోజు లో సుమారు 2.5 కోట్ల టీకామందు డోజుల ను ఇప్పించిన రెకార్డు ను నెలకొల్పిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘన కార్యం భారతదేశం శక్తియుక్తుల కు ఒక రుజువు గా ఉందని ఆయన అన్నారు. చక్కగా రాణిస్తున్న జిల్లాల లోని సహ అధికారులు అవలంబిస్తున్న చక్కని అభ్యాసాల నుంచి నేర్చుకోవలసింది గా జిల్లా అధికారులను ఆయన కోరారు. స్థానిక అవసరాల కు తగిన విధానాన్ని అనుసరించడం గురించి, పాటించవలసిన జాగ్రతచర్యలను గురించి ఆయన నొక్కిచెప్పారు.
100 साल की इस सबसे बड़ी महामारी में देश ने अनेक चुनौतियों का सामना किया है।
— PMO India (@PMOIndia) November 3, 2021
कोरोना से देश की लड़ाई में एक खास बात ये भी रही कि हमने नए-नए समाधान खोजे, Innovative तरीके आजमाए।
आपको भी अपने जिलों में वैक्सीनेशन बढ़ाने के लिए नए Innovative तरीकों पर और ज्यादा काम करना होगा: PM
अपने जिलों में एक-एक गांव, एक-एक कस्बे के लिए अगर अलग-अलग रणनीति बनानी हो तो वो भी बनाइए।
— PMO India (@PMOIndia) November 3, 2021
आप क्षेत्र के हिसाब से 20-25 लोगों की टीम बनाकर भी ऐसा कर सकते हैं।
जो टीमें आपने बनाई हों, उनमें एक Healthy Competition हो, इसका भी प्रयास कर सकते हैं: PM
एक चुनौती अफवाह और लोगों में भ्रम की स्थिति भी है।
— PMO India (@PMOIndia) November 3, 2021
अभी बातचीत के दौरान भी इसका जिक्र किया गया है।
इसका एक बड़ा समाधान है कि लोगों को ज्यादा से ज्यादा जागरूक किया जाए।
आप इसमें स्थानीय धर्मगुरुओं की भी मदद और ज्यादा ले सकते हैं: PM
अभी कुछ दिन पहले मेरी वेटिकन में पोप फ्रांसिस जी से भी मुलाकात हुई थी।
— PMO India (@PMOIndia) November 3, 2021
वैक्सीन पर धर्मगुरुओं के संदेश को भी हमें जनता तक पहुंचाने पर विशेष जोर देना होगा: PM @narendramodi
अभी तक आप सभी ने लोगों को वैक्सीनेशन सेंटर तक पहुंचाने और वहां सुरक्षित टीकाकरण के लिए प्रबंध किए।
— PMO India (@PMOIndia) November 3, 2021
अब हर घर टीका, घर-घर टीका, इस जज्बे के साथ आपको हर घर पहुंचना है: PM @narendramodi
हर घर पर दस्तक देते समय, पहली डोज़ के साथ-साथ आप सभी को दूसरी डोज़ पर भी उतना ही ध्यान देना होगा।
— PMO India (@PMOIndia) November 3, 2021
क्योंकि जब भी संक्रमण के केस कम होने लगते हैं, तो कई बार Urgency वाली भावना कम हो जाती है।
लोगों को लगने लगता है कि, इतनी भी क्या जल्दी है, लगा लेंगे: PM
सबको वैक्सीन, मुफ्त वैक्सीन अभियान के तहत हम एक दिन में करीब-करीब ढाई करोड़ वैक्सीन डोज लगाकर दिखा चुके हैं।
— PMO India (@PMOIndia) November 3, 2021
ये दिखाता है कि हमारी कैपेबिलिटी क्या है, हमारा सामर्थ्य क्या है: PM @narendramodi
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి