ప్రభుత్వం లో వేరు వేరు విభాగాల లో మరియు సంస్థల లో కొత్త గా ఉద్యోగం లోనియమించుకొన్న వ్యక్తుల కు దాదాపు గా 71,000 నియామక పత్రాల ను ఆయన పంపిణీ చేశారు
‘‘భారతదేశం ప్రస్తుతం అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంది’’
‘‘కొత్త అవకాశాల కు తలుపుల ను తెరచినటువంటి విధానాల తోను, వ్యూహాల తోను ప్రస్తుతం ‘న్యూ ఇండియా ’ ముందుకు సాగిపోతున్నది’’
‘‘భారతదేశం 2014 వ సంవత్సరం తరువాత నుండి చొరవ తీసుకోవడానికి ఇష్టపడేవైఖరి ని అవలంబించింది, 2014 వ సంవత్సరాని కి పూర్వం అనుసరించినటువంటి ఏదైనా జరిగిన తరువాత దానిగురించి స్పందించే వైఖరి తో పోలిస్తే ఈ వైఖరి భిన్నమైంది అని చెప్పాలి’’
‘‘21వ శతాబ్దం లోని మూడో దశాబ్దం భారతదేశం లో అంతకు మునుపు ఊహ కు అయినాఅందనటువంటి ఉద్యోగ అవకాశాల ను మరియు స్వతంత్రోపాధి అవకాశాల కు సాక్షి గా ఉంది’’
‘‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క ఆలోచన విధానం మరియు ధోరణి స్వదేశీఉత్పత్తుల వైపు మొగ్గు చూపడం, ఇంకా ‘స్థానికం గా తయారైన ఉత్పాదనల ను బలపరచడం’ వంటి వాటి కంటే విస్తృతమైంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది పల్లె లు మొదలుకొని నగరాల వరకు చూస్తే కోట్లకొద్దీ ఉద్యోగ అవకాశాల ను కల్పించేటటువంటి ఒక ఉద్యమంగా ఉంది’’
‘‘రహదారులు గనుక పల్లెల ను చేరాయంటే, ఆ పరిణామం యావత్తు ఇకోసిస్టమ్ లో ఉపాధికల్పన శర వేగం గా జరిగేందుకు బాట ను పరుస్తుంది’’
‘‘ఒక ప్రభుత్వ ఉద్యోగి గా మీరుఎల్లప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి అంటే అవి ఒక సాధారణ పౌరుడు /పౌరురాలు గా మీకు కలిగినఅనుభూతులు ఏమేమిటి అనేవే’’

జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ప్రభుత్వం లోని వేరువేరు విభాగాల లో మరియు వేరు వేరు సంస్థల లో కొత్త గా ఉద్యోగం లో నియమించిన వ్యక్తుల కు దాదాపు గా 71,000 నియామక పత్రాల ను ఆయన పంపిణీ చేశారు. దేశవ్యాప్తం గా ఎంపిక చేసిన కొత్త ఉద్యోగుల లో భారత ప్రభుత్వం లోని వేరు వేరు హోదాల లో/ఉద్యోగాల లో చేరతారు. వారి లో ట్రైన్ మేనేజర్, స్టేశన్ మాస్టర్, సీనియర్ కమర్శియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇన్స్ పెక్టర్, సబ్ ఇన్స్ పెక్టర్ స్, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇన్ కమ్ టాక్స్ ఇన్స్ పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, సీనియర్ డ్రాఫ్ట్స్ మన్, జెఇ/సూపర్ వైజర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచర్, లైబ్రేరియన్, నర్స్, ప్రొబేశనరీ ఆఫీసర్స్, పిఎ, ఎమ్ టిఎస్ తదితరులు ఉన్నారు. కొత్త గా ఉద్యోగం లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు కర్మయోగి ప్రారంభ్ మాధ్యం ద్వారా వారంతట వారే శిక్షణ ను పొందే అవకాశం దక్కనుంది. కర్మయోగి ప్రారంభ్ అనేది ఒక ఆన్ లైన్ ఓరియంటేశన్ కోర్సు. ప్రభుత్వం లో వివిధ విభాగాల లో కొత్త గా నియమితులు అయిన వారందరి కోసం ఉద్దేశించిందే ఈ కర్మయోగి ప్రారంభ్ కోర్సు. ప్రధాన మంత్రి ప్రసంగాని కై 45 స్థానాల ను మేళా తో జోడించడం జరిగింది.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మంగళప్రదం అయినటువంటి బైశాఖి సందర్భం లో దేశ ప్రజల కు అభినందనల ను తెలియ జేశారు. నియామక పత్రాన్ని అందుకొంటున్నందుకు గాను అభ్యర్థుల ను మరియు వారి కుటుంబాల ను కూడా ఆయన అభినందించారు.

 

అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశం యొక్క సంకల్పాల ను సాధించడాని కి ప్రభుత్వం యువతీ యువకుల యొక్క ప్రతిభ కు మరియు వారి శక్తి కి సరి అయినటువంటి అవకాశాల ను అందించేందుకు కంకణం కట్టుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎన్ డిఎ పాలన లో ఉన్న రాష్ట్రాల లో గుజరాత్ మొదలుకొని అసమ్ వరకు, ఉత్తర్ ప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర వరకు ప్రభుత్వం లో భర్తీ చేసుకొనే ప్రక్రియ వేగవంతం గా చోటు చేసుకొంటోంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. మధ్య ప్రదేశ్ లో నిన్ననే 22,000 కు పైగా గురువుల కు భర్తీ సంబంధి పత్రాల ను ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు. ‘‘దేశం లోని యువతీ యువకుల పట్ల మాకు ఉన్న నిబద్ధత కు ఈ రోజ్ గార్ మేళా రుజువు గా ఉంది.’’ అని ఆయన అన్నారు.

ప్రపంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లలో ఒక ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం ఉంది అని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ మాంద్యం మరియు మహమ్మారి ప్రపంచవ్యాప్త సవాళ్ళు గా ఉన్న స్థితి లో భారతదేశాన్ని ఒక ఆశాకిరణం గా ఇతర దేశాలు భావిస్తున్నాయన్నారు. ‘‘కొత్త అవకాశాల కు తలుపుల ను తెరచినటువంటి విధానాల తో మరియు వ్యూహాల తో నేటి ‘న్యూ ఇండియా’ ముందుకు సాగిపోతోంది’’, అని ఆయన అన్నారు. 2014 వ సంవత్సరం అనంతర కాలం లో, భారతదేశం అంతకు మునుపు ఉన్నటువంటి కాలాల్లో అనుసరించినటువంటి ‘ఏదైనా జరిగిన తరువాత దాని గురించి స్పందించడానికి వేచి ఉండే’ ధోరణి కి భిన్నం గా ‘ఏదైనా జరిగిన తరువాత దాని గురించి స్పందించడానికి వేచి ఉండ కుండా ఏదో ఒక చొరవ ను తీసుకొనే’ వైఖరి ని అవలంబించింది అని ఆయన అన్నారు. ‘‘తత్ఫలితం గా 21 వ శతాబ్ది లోని మూడో దశాబ్దం ఇదివరకు ఊహ కు అయినా అందని అటువంటి స్థాయి లో ఉద్యోగ అవకాశాల కు మరియు స్వతంత్రోపాధి కి సాక్షి గా ఉన్నది. పది సంవత్సరాల కిందట ఉనికి లో అయినా లేని అటువంటి అనేక రంగాల ను యువత కనుగొంటున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. స్టార్ట్-అప్స్ లోని ఉత్సాహానికి మరియు భారతదేశ యువతీ యువకుల లోని ఉత్సాహాని కి సంబంధించిన కొన్ని ఉదాహరణల ను ప్రధాన మంత్రి ఇస్తూ, స్టార్ట్-అప్స్ 40 లక్షల కు పైచిలుకు ప్రత్యక్ష నౌకరీల ను లేదా పరోక్ష కొలువుల ను అందించాయని తెలియ జేసిన ఒక నివేదిక ను గురించి ప్రస్తావించారు. డ్రోన్ స్ మరియు క్రీడల రంగం.. ఇవి ఉద్యోగ కల్పన తాలూకు సరిక్రొత్త మార్గాలు గా వెలిశాయి అని కూడా ఆయన చెప్పారు.

 

‘‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క ఆలోచన మరియు వైఖరి అనేది స్వదేశీ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపడం, ఇంకా స్థానికం గా తయారైన ఉత్పాదనల ను బలపరచడం వంటి వాటి కంటే విస్తృతమైంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పల్లెలు మొదలుకొని నగరాల వరకు కోట్ల కొద్దీ ఉద్యోగ అవకాశాల ను కల్పించే ఒక ‘ఉద్యమం’ ’’ అని ఆయన చెప్పారు. ఈ సందర్భం లో ఆయన దేశీయం గా రూపుదిద్దిన అత్యాధునిక మానవ నిర్మిత ఉపగ్రహాలు మరియు సెమి-హై-స్పీడ్ ట్రైన్స్ తాలూకు ఉదాహరణ లను ఇచ్చారు. గడచిన 8-9 ఏళ్ల లో భారతదేశం లో ముప్ఫయ్ వేల కు పైగా ఎల్ హెచ్ బి కోచ్ లను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ కోచ్ లకు అవసరపడిన సాంకేతిక పరిజ్ఞానం మరియు ముడి పదార్థాలు భారతదేశం లో వేల కొద్దీ కొలువుల ను అందించాయి అని ఆయన అన్నారు.

భారతదేశం లోని ఆట వస్తువుల తయారీ పరిశ్రమ ను ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి పేర్కొంటూ, భారతదేశం లో బాలలు దశాబ్దాల పాటు దిగుమతి అయిన ఆట వస్తువుల తోనే ఆటలు ఆడుకొంటూ వచ్చారని వివరించారు. ఆ ఆట బొమ్మలు మంచి నాణ్యమైనవి గాని లేదా భారతదేశ బాలల ను దృష్టి లో పెట్టుకొని రూపొందించినవి గాని కాదు అని ఆయన అన్నారు. దిగుమతి అయ్యే ఆట వస్తువుల కు నాణ్యత సంబంధి ప్రమాణాల ను ప్రభుత్వం ఏర్పరచింది, అంతేకాదు దేశీయం గా ఆట బొమ్మల పరిశ్రమ ను ప్రోత్సహించడం కూడా మొదలు పెట్టింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. దీనికి ఫలితం గా, భారతదేశం లో ఆట వస్తువుల తయారీ పరిశ్రమ యొక్క ముఖచిత్రం ఆసాంతం మార్పుల కు లోను కావడం తో పాటు అసంఖ్యకం గా ఉద్యోగ అవకాశాల ను కల్పించడం లో ఒక ముఖ్యమైన పాత్ర ను కూడా పోషించింది అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం లోని రక్షణ రంగ పరికరాల ను కేవలం దిగుమతి చేసుకోవలసిందేనన్న దశాబ్దాల నాటి మనస్తత్వాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, దేశీయ తయారీదారు సంస్థల ను విశ్వసించే సరళి ద్వారా ప్రభుత్వం ఈ వైఖరి ని మార్చివేసిందని, ఫలితం గా భారతదేశం లో మాత్రమే తయారు చేసేటటువంటి సామగ్రి, ఇంకా ఆయుధాల తో కూడిన 300 లకు పైగా ఉత్పత్తుల జాబితా ను సాయుధ బలగాలు రూపొందించడానికి ఈ విధానం దారి తీసిందని ఆయన అన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువ కలిగిన రక్షణ సామగ్రి ని ప్రపంచం లోని అనేక దేశాల కు ఎగుమతి చేయడం జరుగుతోంది అని ఆయన తెలిపారు.

గత కొన్నేళ్లలో మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో సాధించిన పురోగతిని కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. స్థానిక తయారీని ప్రోత్సహించడం ద్వారా, అందుకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భారతదేశం చాలా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని, భారతదేశం ఇప్పుడు స్థానిక డిమాండ్ ను తీర్చడంతో పాటు మొబైల్ హ్యాండ్ సెట్ లను ఎగుమతి చేస్తోందని ఆయన అన్నారు.

 

ఉపాధి కల్పనలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడుల పాత్రను కూడా ప్రధాన మంత్రి ప్రముఖంగా వివరించారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, భవనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మూలధన వ్యయానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల ఉపాధి అవకాశాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం నాలుగు రెట్లు పెరిగిందని ప్రధాన మంత్రి తెలియజేశారు.

2014కు ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతూ, 2014కు ముందు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 20,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ల విద్యుదీకరణ మాత్రమే జరిగిందని, అయితే గత తొమ్మిదేళ్లలో 40,000 కిలోమీటర్ల రైలు మార్గాల విద్యుదీకరణ జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. 2014కు ముందు నెలకు 600 మీటర్లుగా ఉన్న మెట్రో రైలు మార్గాల నిర్మాణం నేడు నెలకు 6 కిలోమీటర్లకు పెరిగిందని తెలిపారు. 2014కు ముందు దేశంలో 70 జిల్లాలకే గ్యాస్ నెట్ వర్క్ పరిమితమైందని, ఇప్పుడు ఆ సంఖ్య 630 జిల్లాలకు పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పొడవు గురించి ప్రస్తావిస్తూ, 2014 తర్వాత ఇది 4 లక్షల కిలోమీటర్ల నుంచి 7 లక్షల కిలోమీటర్లకు పెరిగిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. "రోడ్లు గ్రామాలకు అనుసంధానం అయినప్పుడు ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థలో వేగవంతమైన ఉపాధి కల్పనకు దారితీస్తుంది", అని ఆయన అన్నారు.

విమానయాన రంగం గురించి ప్రస్తావిస్తూ, 2014లో 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 148కి పెరిగిందని శ్రీ మోదీ తెలిపారు. విమానాశ్రయ కార్యకలాపాల్లో ఉపాధి అవకాశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఎయిరిండియా విమానాల కోసం రికార్డు స్థాయిలో ఆర్డర్ చేయడం, మరికొన్ని కంపెనీల ప్రణాళికలను ఆయన ప్రస్తావించారు. గతంతో పోలిస్తే కార్గో హ్యాండ్లింగ్ రెట్టింపు అయిందని, సమయాన్ని సగానికి తగ్గించడంతో పోర్టు రంగం కూడా ఇదే విధమైన పురోగతిని సాధిస్తోందని ఆయన అన్నారు. ఈ పరిణామాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.

2014కు ముందు దేశంలో 400 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉంటే, నేడు 660 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు 2014 లో ఉన్న 50 వేల నుండి లక్షకు పైగా పెరిగాయని, నేడు పట్టభద్రులైన వైద్యుల సంఖ్య రెట్టింపుకు పైగా ఉందని తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ పీవోలు, స్వయం సహాయక సంఘాలకు లక్షల కోట్ల రూపాయల సాయం అందుతోందని, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నామని, 2014 తర్వాత 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఆరు లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ వేశామని, పీఎంఏవై కింద 3 కోట్ల ఇళ్లలో 2.5 కోట్లకు పైగా ఇళ్లను గ్రామాల్లో నిర్మించామని, 10 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, 1.5 లక్షలకు పైగా వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయని, వ్యవసాయ రంగం లో యాంత్రీకరణ పెరిగిందనితెలిపారు. . "ఇవన్నీ భారీ గా ఉపాధి అవకాశాలను సృష్టించాయి", అని ఆయన అన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెరగడం, చిన్న పరిశ్రమలను భాగస్వామ్యం చేయడం గురించి కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రూ.23 లక్షల కోట్లకు పైగా బ్యాంకు గ్యారంటీ లేని రుణాలు పంపిణీ చేశామని, లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా మహిళలే ఉన్నారని తెలిపారు. ఈ పథకం 8 కోట్ల మంది కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సృష్టించింది. ముద్రా యోజన సాయంతో తొలిసారిగా తమ వ్యాపారాన్ని ప్రారంభించిన వారు వీరే‘‘ అని అన్నారు. అట్టడుగు స్థాయిలో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడంలో మైక్రో ఫైనాన్స్ శక్తిని ఆయన ప్రముఖంగా వివరించారు.

ఈ రోజు అపాయింట్ మెంట్ లెటర్లు అందుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న సమయంలో ఇది దేశాభివృద్ధికి దోహదపడే అవకాశం అని వ్యాఖ్యానించారు. "ఈ రోజు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రయాణంలో, ఒక సాధారణ పౌరుడిగా మీరు అనుభవించిన విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి" అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్తగా నియమితులైన వారికి ప్రభుత్వం నుంచి ఉండే ఆకాంక్షల గురించి ప్రస్తావిస్తూ, ముందు ఇతరుల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు వారిపై ఉందని ప్రధాని అన్నారు. "మీలో ప్రతి ఒక్కరూ మీ పని ద్వారా ఒక సామాన్యుడి జీవితాన్ని ఏదో ఒక విధంగా ప్రభావితం చేయాలి "అని ఆయన అన్నారు. పనిపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి ,సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరగాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ప్రసంగాన్ని ముగిష్టూ,కొత్తగా నియమితులైన వారు తమ నేర్చుకునే ప్రక్రియను నిలిపివేయవద్దని కోరారు కొత్త విషయాలు తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం వారి పని ,వ్యక్తిత్వం రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఐగోట్ కర్మయోగిలో చేరడం ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.

నేపథ్యం

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాని హామీని నెరవేర్చే దిశగా రోజ్ గార్ మేళా ఒక ముందడుగు.

రోజ్ గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, యువతకు సాధికారత , జాతీయ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi