మహమ్మారి విరుచుకుపడిన నాటి నుంచి సకాలం లో మార్గదర్శకత్వం వహించినందుకు మరియు సమర్ధన ను ఇచ్చినందుకు ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రులు
‘‘భారతదేశం రాజ్యాంగం లో ఉల్లేఖించిన సహకారాత్మక సమాఖ్య వాదం స్ఫూర్తి తోకరోనా కు వ్యతిరేకం గా ఒక దీర్ఘమైన యుద్ధాన్ని చేసింది’’
‘‘కరోనా సవాలు అనేది ఇంకా పూర్తి గా సమసిపోలేదు అనేది స్పష్టం’’
‘‘అర్హులైన బాలలందరికీ టీకామందు ను చాలా ముందుగానే ఇప్పించడం అనేది మనకుప్రాధాన్యమున్న అంశం. పాఠశాల లో ప్రత్యేక ప్రచార ఉద్యమాలు కూడా అవసరమవుతాయి’’
‘‘పరీక్షించడం, జాడ ను గుర్తించడం మరియు చికిత్స ను అందించడం అనే మన వ్యూహాన్ని మనం తప్పక అమలుపరచాలి’’
‘‘పెట్రోలు మరియు డీజిల్ ధరల భారాన్ని తగ్గించడాని కి కేంద్ర ప్రభుత్వంఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది, అయితే చాలా రాష్ట్రాలు పన్నుల ను తగ్గించ లేదు’’
‘‘ఇది ఆ రాష్ట్రాల ప్రజల పట్ల చేసిన అన్యాయం; అంతేకాదు, ఇది ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కీడు చేస్తుంది’’
‘‘ఈ ప్రపంచ వ్యాప్త సంకట కాలం లో సహకారాత్మక సమాఖ్యవాదం తాలూకు స్ఫూర్తి నిఅనుసరిస్తూ ఒక జట్టు గా పని చేయవలసిందిగా అన్ని రాష్ట్రాల కు నేను విజ్ఞప

కోవిడ్-19 స్థితి ని సమీక్షించడం కోసం ముఖ్యమంత్రుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు.

కొన్ని రాష్ట్రాల లో కోవిడ్ కేసులు ఇటీవల పెరిగిపోవడాన్ని గురించి, టెస్ట్, ట్రాక్, ట్రీట్, వేక్సీనేశన్ వాటిని అనుసరించవలసిన అవసరాన్ని గురించి మరియు కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని తగిన రీతి లో నడచుకొనేటట్టుగా పూచీపడడం గురించి హోం శాఖ కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆరోగ్య శాఖ కేంద్ర కార్యదర్శి ఒక నివేదిక ను సమర్పించారు. ఆ నివేదిక లో ఆయన ప్రపంచం లోని అనేక దేశాల లో కేసు లు పెరుగుతూ ఉండటాన్ని గురించి వివరించారు. భారతదేశం లోనూ కొన్ని రాష్ట్రాల లో కేసు లు అధికం గా నమోదు అవుతూ ఉండడాన్ని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. రాష్ట్రాలు క్రమం తప్పక పర్యవేక్షించవలసిన మరియు సమాచారాన్ని నివేదించవలసిన అవసరం, గట్టి నిఘా ను పెట్టవలసిన అవసరం ఉందని, మౌలిక సదుపాయాల ను ఉన్నతీకరించుకోవఃడం తో పాటు కేంద్రం ఇచ్చిన నిధుల ను వినియోగించాలి అని ఆయన అన్నారు.

మహమ్మారి విజృంభించినప్పటి నుంచి సకాలం లో మార్గదర్శకత్వం వహిస్తూ, సమర్ధన ను ఇస్తున్నందుకు ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాన మంత్రి సరి అయిన కాలం లో ఈ సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చారు అని వారు అన్నారు. వారు వారి రాష్ట్రాల లో కోవిడ్ కేసుల స్థాయి ని గురించి, ప్రజల కు టీకామందు ను ఇప్పించడాన్ని గురించి వివరించారు.

జీవనం మరియు బతుకుతెరువు ను గురించి ప్రధాన మంత్రి ఇచ్చిన మంత్రాన్ని ఉత్తర్ ప్రదేశ్ లో అనుసరించడం జరుగుతోంది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఎన్ సిఆర్ లోని నగరాల లో కేసు లు పెద్ద సంఖ్య లో వస్తున్నాయి అని ఆయన ప్రస్తావించారు. ఇటీవలి కాలం లో దిల్లీ అధికమైన పాజిటివిటీ రేటు ను నమోదు చేసిందని దిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. మాస్క్ లను తప్పనిసరి గా వాడాలి అనే నియమాన్ని మళ్లీ విధించినట్లు కూడా ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఇచ్చిన గట్టి సమర్ధన మరియు మార్గదర్శకత్వం మునుపటి వేవ్ లను అధిగమించడం లో రాష్ట్రాని కి సహాయకారి అయ్యాయి అని మిజోరమ్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇతర ఆరోగ్య సంబంధి అంశాల లో, అలాగే అభివృద్ధి సంబంధి అంశాల లో సైతం కేంద్ర ప్రభుత్వం యొక్క సమర్ధన కు గాను ఆయన ధన్యవాదాలు వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఇచ్చిన మార్గదర్శనం తదుపరి వేవ్ లను రాష్ట్రం మెరుగైన రీతి లో ఎదుర్కోవడాని కి చక్కగా పనికివచ్చింది అని కర్నాటక ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని తగిన జాగ్రత చర్యల ను తీసుకోవాలి అని సూచిస్తూ జాగృతి ప్రధాన ప్రచార ఉద్యమాల ను నడుపుతున్నట్లు ఆయన ప్రస్తావించారు. హరియాణా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,రాష్ట్రం లో అధిక సంఖ్య లో కేసు లు ప్రధానం గా దిల్లీ చుట్టుపక్కల, గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్ లలో వస్తున్నాయి అని వెల్లడించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చివర లో మాట్లాడారు. ఆయన తన ప్రసంగం లో ముందుగా తమిళ నాడు లోని తంజావూరు లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన ప్రాణ నష్టాని కి దారితీసినందుకు మృతుల దగ్గరి సంబంధికుల కు సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటన లో బాధితులు అయిన వారికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

కరోనా కు వ్యతిరేకం గా పోరాడడం లో కేంద్రం మరియు రాష్ట్రాలు ఉమ్మడి ప్రయాసల కు నడుం కట్టిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ముఖ్యమంత్రులు, అధికారులు, కరోనా యోధులు అందరూ వారి వంతు ప్రయత్నాల ను చేస్తున్నందుకు ఆయన తన ప్రశంస ను వ్యక్తం చేశారు. కరోనా సవాలు ఇంకా పూర్తి గా సమసి పోలేదు అనేది స్పష్టం అని ఆయన అన్నారు. ఓమిక్రాన్, ఇంకా దాని సబ్ వేరియెంట్ లు సమస్య ను తెచ్చి పెట్టవచ్చు అనే విషయం యూరోప్ లోని అనేక దేశాల విషయం లో తేటతెల్లం అయింది అని ఆయన అన్నారు. ఈ సబ్ వేరియెంట్ లు చాలా దేశాల లో వ్యాపిస్తున్నాయి అని ఆయన ప్రస్తావించారు. అనేక దేశాల కంటే భారతదేశం ఈ స్థితి ని మెరుగు గా ఎదుర్కోగలిగింది అని ఆయన అన్నారు. అయినప్పటి కీ గడచిన రెండు వారాల లో కొన్ని రాష్ట్రాల లో అధికం అవుతున్న కేసు లు మనం అప్రమత్తం గా ఉండవలసిన అవసరం ఎంతయినా ఉంది అని చాటుతున్నాయి అని ఆయన అన్నారు.

దృఢ సంకల్పం తో, ఎటువంటి భయాని కి లోనవకుండా ఓమిక్రాన్ వేవ్ ను ఎదుర్కోవడమైందని ప్రధాన మంత్రి అన్నారు. గత రెండు సంవత్సరాల లో కరోనా తో పోరాటం తాలూకు అన్ని అంశాలు.. అది ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఆక్సిజన్ సరఫరా కావచ్చు, లేదా వేక్సీనేశన్.. వీటి ని బలపరచడం జరిగింది అని ఆయన వివరించారు. మూడో వేవ్ కాల లో, ఏ ఒక్క రాష్ట్రం లో స్థితి అదుపు తప్పనేలేదు. దీని ని పెద్ద ఎత్తున ప్రజల కు టీకామందు ను ఇప్పించడం జరిగిందనే దృష్టి కోణం లో నుంచి గమనించాలి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. టీకామందు దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి కి అందింది. వయోజనుల లో 96 శాతం మంది వేక్సీన్ ను కనీసం ఒక డోజు తీసుకొన్నారు అనే విషయం తో పాటుగా 15 సంవత్సరాల వయస్సు దాటిన వారి లో దాదాపు 84 శాతం మంది రెండు డోజుల ను తీసుకొన్నారు అనే అంశం గర్వకారణం అని ఆయన అన్నారు. నిపుణులు చెప్పే మాటల ను బట్టి వేక్సీన్ అనేది కరోనా కు వ్యతిరేకం గా అతి ప్రధానమైన సంరక్షణ చర్య గా ఉంది అని కూడా ఆయన తెలిపారు.

బడుల ను చాలా కాలం తరువాత తెరవడమైంది, మరి కొంత మంది తల్లితండ్రులు కొన్ని చోట్ల కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నందువల్ల చెందుతున్నారన్న విషయాల ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అనేక మంది విద్యార్థులు టీకామందు ను తీసుకొంటున్నారు అంటూ ఆయన తన సంతోషాన్ని వెలిబుచ్చారు. 12 ఏళ్ళ వయస్సు కలిగిన బాలలు మొదలుకొని 14 ఏళ్ళ వయస్సు కలిగిన బాలల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమాన్ని మార్చి నెల లో మొదలు పెట్టడం జరిగింది. 6 ఏళ్ళు మొదలు కొని 12 ఏళ్ళ ప్రాయం కలిగిన పిల్లల కు కోవాక్సిన్ ను ఇప్పించేందుకు అనుమతి ని మరి నిన్నటి రోజునే మంజూరు చేయడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘అర్హులైన బాలలు అందరికీ టీకామందు ను చాలా త్వరగా ఇప్పించాలి అనేదే మన ప్రాధాన్యం గా ఉంది. దీని కోసం ఇదివరకటి మాదిరి గానే పాఠశాలల్లో ప్రత్యేక ప్రచార ఉద్యమాల ను చేపట్టడం కూడా అవసరం. ఈ విషయాన్ని విద్యార్థినీవిద్యార్థుల తల్లితండ్రులు మరియు గురువులు తెలుసుకోవాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. టీకా మందు యొక్క రక్షణ కవచాన్ని పటిష్టం చేయడం కోసం దేశం లో వయోజనులు అందరికీ ముందు జాగ్రత డోజుల ను అందుబాటు లో ఉంచడం జరిగింది. గురువులు, తల్లితండ్రులు, ఇంకా అర్హత కలిగిన ఇతర వ్యక్తులు ఈ ప్రికాశనరీ డోజు ను తీసుకోవచ్చును అని ఆయన చెప్పారు.

మూడో వేవ్ కాలం లో, భారతదేశం ఒక్కో రోజు లో మూడు లక్షల కేసు ల వరకు చూసింది. మరి అన్ని రాష్ట్రాలు ఈ స్థితి ని సంబాళించాయి. సామాజిక కార్యకలాపాలు మరియు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేటట్లు గా చూశాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సమతుల్యత భవిష్యత్తు లో మన వ్యూహాని కి ఆధారభూతం కావాలి అని ఆయన అన్నారు. శాస్త్రవేత్త లు, నిపుణులు పరిస్థితి ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వారు ఇచ్చే సూచనల ను, సలహాల ను మనం శ్రద్ధాసక్తుల తో పాటించవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘సంక్రమణల ను మొగ్గ లోనే తుంచివేయడం అనేది మన కు ప్రాథమ్యం గా ఉండింది. మరి ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగాలి. టెస్ట్, ట్రాక్, ఎండ్ ట్రీట్ అనే మన వ్యూహాన్ని అదే విధమైన దక్షత తో అమలుపరచాలి’’ అని ఆయన అన్నారు.

తీవ్రమైన చలి జ్వరం కేసుల ను వంద శాతం పరీక్షించడం ఎంతైనా ముఖ్యం. మరి అలాగే పాజిటివ్ కేసుల లో జినోమ్ సీక్వెన్సింగ్ కు కూడా ముందడుగు వేయాలి. కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని సార్వజనిక ప్రదేశాల లో తగ్గ జాగ్రతచర్యల ను అవలంబించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. అలాగే, భయాందోళనల కు లోనవకూడదు అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల కల్పన ను అదే పని గా మెరుగు పరచుకొంటూ ఉండడం, ఇంకా వైద్య రంగం లో సిబ్బంది ని తగినంత మంది ని కలిగి వుండడం కూడా కీలకం అని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశం రాజ్యాంగం లో పొందుపరచుకొన్న సహకారాత్మక సమాఖ్యవాదం తాలూకు స్పూర్తి తో కరోనా కు వ్యతిరేకం గా దీర్ఘకాలం పాటు పోరాడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రపంచం లో నెలకొన్న స్థితి లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి అంటే అందుకోసం ఆర్థిక నిర్ణయాల లో కేంద్ర ప్రభుత్వాని కి, రాష్ట్ర ప్రభుత్వాల కు మధ్య సమన్వయం అవసరం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. వర్తమానకాలం లో ప్రపంచం లో చోటు చేసుకొంటున్నటువంటి ఘటన క్రమాల వల్ల ఏర్పడ్డ స్థితి లో, సహకారాత్మక సమాఖ్యవాదం తాలూకు స్ఫూర్తి మరింత ముఖ్యం గా మారింది అని ఆయన అన్నారు. పెట్రోల్, ఇంకా డీజిల్ ధరల విషయం లో ఆయన ఈ అంశాన్ని గురించి వివరించారు.

పెట్రోల్ ధర ల , డీజిల్ ధర ల భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, దీనితో పాటు గా పన్నుల ను తగ్గించవలసింది గా రాష్ట్రాల ను కూడా అభ్యర్ధించింది అని ప్రధాన మంత్రి అన్నారు. కొన్ని రాష్ట్రాలు పన్నుల ను తగ్గించాయి. అయితే, కొన్ని రాష్ట్రాలు ప్రయోజనాల ను ప్రజల కు అందించ లేదు. తత్ఫలితం గా ఆ రాష్ట్రాల లో పెట్రోల్ ధరలు, డీజిల్ ల ధరలు అధికం అయ్యాయి. ఇది రాష్ట్ర ప్రజల కు చేసిన అన్యాయం ఒక్కటే కాక, ఇరుగు పొరుగు రాష్ట్రాల కు కూడా కీడు ను కొని తెస్తుంది అని ఆయన అన్నారు. కర్నాటక మరియు గుజరాత్ వంటి రాష్ట్రాలు రాబడిపరం గా నష్టం ఏర్పడుతూ ఉన్నప్పటికీ కూడా పన్ను ను తగ్గించడానికి చొరవ ను తీసుకొన్నాయి. కాగా, వాటి ఇరుగు పొరుగు రాష్ట్రాలు పన్నులు తగ్గించకుండా రాబడి ని రాబట్టుకొన్నాయి అని ఆయన అన్నారు.

ఇదే విధం గా, కిందటి నవంబర్ లో విఎటి (‘వ్యాట్’) ను తగ్గించాలి అంటూ ఒక అభ్యర్థన అందింది. అయితే, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు, కేరళ, ఝార్ ఖండ్ వంటి చాలా రాష్ట్రాలు ఏదో కారణం వల్ల అలా చేయలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. కేంద్రానికి వచ్చే రాబడి లో 42 శాతం రాబడి రాష్ట్ర ప్రభుత్వాల కు వెళ్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ ప్రపంచ సంకట కాలం లో సహకారాత్మక సమాఖ్య వాదం తాలూకు స్ఫూర్తి ని అనుసరిస్తూ ఒక జట్టు గా పని చేయాలి అని అన్ని రాష్ట్రాల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అంటూ ప్రధాన మంత్రి అభ్యర్థించారు.

ఉష్ణోగ్రత అధికం అవుతుండడం తో భవనాల లో, అడవుల లో మంటలు చెలరేగే సంఘటన లు పెరుగుతున్నాయి అని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. మరీ ముఖ్యం గా ఆసుపత్రుల లో ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ ను చేపట్టాలి అని ఆయన కోరారు. ఈ సవాలు ను తట్టుకోవడం కోసం మనం చేసే ఏర్పాటు లు సంపూర్ణమైనవి గా మరియు మనం ప్రతిచర్య ను తీసుకోవడాని కి పట్టే కాలం కనిష్ఠం గా ఉండాలి అని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
RuPay credit card UPI transactions double in first seven months of FY25

Media Coverage

RuPay credit card UPI transactions double in first seven months of FY25
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets valiant personnel of the Indian Navy on the Navy Day
December 04, 2024

Greeting the valiant personnel of the Indian Navy on the Navy Day, the Prime Minister, Shri Narendra Modi hailed them for their commitment which ensures the safety, security and prosperity of our nation.

Shri Modi in a post on X wrote:

“On Navy Day, we salute the valiant personnel of the Indian Navy who protect our seas with unmatched courage and dedication. Their commitment ensures the safety, security and prosperity of our nation. We also take great pride in India’s rich maritime history.”