ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అయోధ్యలో లతామంగేష్కర్ చౌక్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమం సందర్భంగా వీడియో మెసేజ్ ద్వారా అక్కడ హాజరైన వారికి సందేశమిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రతి భారతీయుడు ఎంతగానో అభిమానించే లతా దీదీ జన్మదినాన్ని ఆయన ఈ సందర్భంగాగుర్తు చేసుకున్నారు. దసరా నవరాత్రులలో 3వ రోజున అమ్మవారు చంద్రఘంట అవతారంలో దర్శనమిస్తారని చెబుతూ అమ్మవారికి ప్రధానమంత్రి నమస్కరించారు. సాధకులు పట్టుదలతో సాధనచేస్తే అతడు లేదా ఆమె మా చంద్రఘంటాదేవి కృపతో దివ్యగాత్రాన్ని సంతరించుకున్న భావన కలుగుతుందన్నారు. ఇలా నిరంతర సాధనా తపస్సుద్వారా సరస్వతీ మాత అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి లతాజీ అని ప్రధానమంత్రి కొనియాడారు. మనందరికీ ఆమెగాత్రం ఒక వరంలా లభించిందని ఆయన అన్నారు. అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ లో ఏర్పాటైన భారీ వీణ సంగీత సాధనకు గుర్తుగా నిలుస్తుందని అన్నారు. లతా మంగేష్కర్ చౌక్ కాంప్లెక్స్‌లో పారే నీటిలో ఏర్పాటు చేసిన 92 తెల్ల మార్బుల్ కమలం పువ్వులు లతాజీ జీవించిన సంవత్సరాలకు గుర్తుగా ఉంటాయని అన్నారు.
లతా మంగేష్కర్ చౌక్ లో వినూత్నంగా భారీ వీణను ఏర్పాటు చేసే వినూత్న ఆలోచన చేసినందుకు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, అయోధ్య అభివృద్ధి అథారిటీని అభినందించారు. దేశ ప్రజలందరి తరఫున లతాజీకి హృదయపూర్వక నివాళులర్పించారు. లతాజీ నుంచి మనం అందుకున్న దీవెనలు ఆమె సుమధుర గీతాల ద్వారా భవిష్యత్ తరాలకు కూడా అందాలని మనస్ఫూర్తిగా భగవాన్ శ్రీరాముడిని కోరుకుంటున్నాను అని ప్రధానమంత్రి అన్నారు.
లతా దీది జన్మదినానికి సంబంధించి ప్రేమ పూర్వక జ్ఞాపకాలను ఎన్నింటినో ఆయన గుర్తుచేసుకున్నారు.
తాను ఆమెతో మాట్లాడిన ప్రతిసారీ, ఆమె స్వరంలోని అద్భుత మాధుర్యం తనను మంత్రముగ్ధుడిని చేసేదని ప్రధానమంత్రి అన్నారు. లతామంగేష్కర్ జీ ఎప్పుడూ తనతో ఒక మాట అంటూ ఉండేవారని చెబుతూ, మనిషిని వయసును బట్టి కాక అతను చేసే మంచిపనులను బట్టి అందరూ గుర్తుంచుకుంటారని అనేవారని అన్నారు. ఆమె దేశానికి ఎంతో చేశారని అంత గొప్ప వ్యక్తి లతామంగేష్కర్ జీ అన్నారు. అయోధ్యలోని లతామంగేష్కర్ చౌక్, ఆమెతో ముడిపడిన జ్ఞాపకాలను పదిలంగా ఉంచడంతోపాటు, దేశం పట్ల మన కర్తవ్యాన్ని గుర్తు చేసేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను అని ప్రథానమంత్రి అన్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ అనంతరం తనకు లతా దీదీ నుంచి ఫోన్ కాల్‌వచ్చిందని ,దీనిపై ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారని, ప్రధానమంత్రి అన్నారు.ఈ సందర్భంగా లతా దీని ఒక పాట పాడివినిపించారని, మన్ కీ అయోధ్య తబ్ తక్‌సునీ, జబ్ తక్ రామ్ న ఆయే. అయోధ్యలో ని భారీ రామమందిరంలోకి రాముడు వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాముడిని కోట్లాది మంది ప్రజల హృదయాలలో ప్రతిష్ఠింప చేసిన లతాదీదీ పేరు ఇక శాశ్వతంగా పవిత్ర అయోధ్యా నగరంతో ముడి పడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. రామ చరిత మానస్ నుంచి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, రామ్ తే అధిక్, రామ్ కర్ దాస అంటే రాముడి భక్తులు రాముడి కంటే ముందే అక్కడికి చేరుకుంటారు. అందువల్ల లతా మంగేష్కర్ చౌక్ ఆమె స్మృత్యర్థం , భవ్య రామ మందిర నిర్మాణానికి ముందే రూపుదిద్దుకున్నదని ఆయన అన్నారు.
అయోధ్య కు గల ఘనవారసత్వాన్ని పునరుద్ధరించడం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, నగరంలో అభివృద్ధికి నూతన ఉషొదయమైందని అన్నారు. భగవాన్ రాముడు మన నాగరికతకు చిహ్నమని, మన నైతిక తకు, విలువలకు, హుందాతనం, నిబద్ధతకు సజీవ ఆదర్శమని, ప్రధానమంత్రి అన్నారు. అయోధ్యనుంచి రామేశ్వరం వరకు, భారతదేశంలోని ప్రతి అణువు అణువూ రాముడిని తనలో ఇముడ్చుకున్నదని ఆయన అన్నారు. రాముడి ఆశీస్సులతో అయోధ్యలో భవ్య రామమందిరం శరవేగంతో రూపుదిద్దుకుంటుండడం చూసి దేశం సంతోషిస్తున్నదని ఆయన అన్నారు.
అయోధ్యలో ప్రధాన సాంస్కృతిక ప్రదేశాలను కలిపే కీలక ప్రాంతాలలో లతా మంగేష్కర్ చౌక్ ఒకటి అని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చౌక్ రామ్ కి పైడి కి అలాగే, సరయూ నదికి దగ్గరగా ఉంటుందని అన్నారు. లతా దీదీ పేరు మీద చౌక్ నిర్మించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఏముంటుంది? అని ప్రధానమంత్రి అన్నారు. ఇన్ని యుగాల తర్వాత కూడా అయోధ్య భగవాన్ రాముడిని పొదివిపట్టుకుని ఉన్న తీరును ప్రస్తావిస్తూ, లతా దీదీ కీర్తనలు మన మనస్సాక్షిని రాముడిలో లీనమయ్యేలా చేశాయని ప్రధాని అన్నారు.
మానస మంత్రమైన శ్రీ రామచ్రంద కృప భజ మాన్, హరణ్ భవ భయ దారుణం లేదా మీరాజీ కీర్తన అయిన పాయో జీ మైనే రామ్ రతన్ ధ్యాన్ పాయో , లేదా బాపూకు ఇష్టమైన వైష్నవ్ జన లేదా తుమ్ ఆశా విశ్వాస్ హమారే రామ్ వంటి సుమధుర గీతాలు ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రధానమంత్రి అన్నారు. లతాజీ పాటలద్వారా ఎన్నో దేశాలకు చెందిన ప్రజలు భగవాన్ రాముడి దివ్యత్వాన్ని అనుభవించారని ఆయన అన్నారు. "లతా దీదీ దివ్య స్వరం ద్వారా రాముని అతీంద్రియ స్వరాన్ని మనం వినగలిగామని" శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
లతాదీదీ గొంతులో వందేమాతర గీతం విన్నప్పుడు, భరతమాత మన కళ్ల ముందు ప్రత్యక్షమైనట్టు ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. లతా దీదీ పౌర సేవల విషయంలో ఎంతో చైతన్యంతో ఉండేవారని అందువల్ల లతామంగేష్కర్‌చౌక్ అయోధ్యలో నివసించే ప్రజలకు, విధిపట్ల అంకిత భావంతో అయోధ్యకు వచ్చే ఎందరికో ఇది ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
ఈ చౌక్, ఇక్కడి వీణ అయోధ్య అభివృద్ధిని ప్రతిధ్వనింప చేస్తుందని, అయోధ్య ప్రేరణగా ఉంటుందని అన్నారు. అలాగే కళా రంగంతో ముడి పడిన వారికి , లతాదీదీ పేరుతో ఏర్పడిన ఈ చౌక్ ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు. ఆధునికతవైపు పయనిస్తూనే, మన మూలాలతో మనం అనుసంధానమై ఉండటానికి, భారతదేశ కళలు, సంస్కృతిని ప్రపంచంలోని మూల మూలకూ తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని ఇది గుర్తుచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ కళలు, సంస్కృతిని ప్రపంచంలోని మూల మూలకూ తీసుకెళ్లడం మన కర్తవ్యం అని ప్రధానమంత్రి అన్నారు.
భారతదేశం, వెయ్యేళ్ల నాటి వారసత్వం పట్ల గర్విస్తూనే, భారతదేశ సంస్కృతిని రాబోయే తరాలకు అందించడానికి బాధ్యత వహించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. "లతా దీదీ గాత్రం ఈ దేశంలోని ప్రతి అణువునూ రాబోయే యుగాలతో కలుపుతుందని" అని ఆయన అన్నారు.
लता जी, मां सरस्वती की एक ऐसी ही साधिका थीं, जिन्होंने पूरे विश्व को अपने दिव्य स्वरों से अभिभूत कर दिया: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2022
लता दीदी के साथ जुड़ी मेरी कितनी ही यादें हैं, कितनी ही भावुक और स्नेहिल स्मृतियाँ हैं।
— PMO India (@PMOIndia) September 28, 2022
जब भी मेरी उनसे बात होती, उनकी वाणी की युग-परिचित मिठास हर बार मुझे मंत्र-मुग्ध कर देती थी: PM @narendramodi
मुझे याद है, जब अयोध्या में राम मंदिर निर्माण के लिए भूमिपूजन संपन्न हुआ था, तो मेरे पास लता दीदी का फोन आया था।
— PMO India (@PMOIndia) September 28, 2022
वो बहुत खुश थीं, आनंद में थी। उन्हें विश्वास नहीं हो रहा था कि आखिरकार राम मंदिर का निर्माण शुरू हो रहा है: PM @narendramodi
अयोध्या के भव्य मंदिर में श्रीराम आने वाले हैं।
— PMO India (@PMOIndia) September 28, 2022
और उससे पहले करोड़ों लोगों में राम नाम की प्राण प्रतिष्ठा करने वाली लता दीदी का नाम, अयोध्या शहर के साथ हमेशा के लिए स्थापित हो गया है: PM @narendramodi
प्रभु राम तो हमारी सभ्यता के प्रतीक पुरुष हैं।
— PMO India (@PMOIndia) September 28, 2022
राम हमारी नैतिकता के, हमारे मूल्यों, हमारी मर्यादा, हमारे कर्तव्य के जीवंत आदर्श हैं।
अयोध्या से लेकर रामेश्वरम तक, राम भारत के कण-कण में समाये हुये हैं: PM @narendramodi
भारत की हजारों वर्ष पुरानी विरासत पर गर्व करते हुए, भारत की संस्कृति को नई पीढ़ी तक पहुंचाना, ये भी हमारा दायित्व है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2022