ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఇండియా -సెంట్రల్ ఆసియా శిఖరాగ్ర సమావేశం వర్చువల్ విధానంలో జనవరి 27,2022 న జరిగింది. ఈ సమావేశానికి రిపబ్లిక్ ఆప్ కజకస్థాన్ అధ్యక్షుడు, కిర్గిజ్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ తజకిస్థాన్, తుర్కుమెనిస్థాన్ , రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షులు హాజరయ్యారు.
ఇండియా - సెంట్రల్ ఆసియా తొలి శిఖరాగ్ర సమావేశం, ఇండియా- సెంట్రల్ ఆసియాదేశాల మధ్య దౌత్యపరమైనసంబంధాలు 30 సంవత్సరాలు నిండిన సమయంలో జరుగుతుండడం విశేషం.
ఈ శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , సెంట్రల్ ఆసియా నాయకులు , ఇండియా -సెంట్రల్ ఆసియామధ్య సంబంధాలను తదుపరి ఉన్నత దశకు తీసుకువెళ్లే అంశం గురించి చర్చించారు. ఇందుకు సంబంధించి వారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ, శిఖరాగ్ర సమ్మేళనం యంత్రాంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు నిర్ణయించారు. దీనిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు. విదేశాంగమంత్రులు, వాణిజ్య మంత్రులు, సాంస్కృతిక మంత్రులు, భద్రతా మమండలి కార్యదర్శులు శిఖరాగ్ర సమ్యేళనానికి తగిన నేపథ్యాన్ని సిద్ధం చేసేందుకు రెగ్యులర్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇండియా - సెంట్రల్ ఆసియా సెక్రటేరియట్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. ఇది నూతన ఏర్పాటుకుమద్దతునిస్తుంది.
వాణిజ్యం ,కనెక్టివిటీ, అభివృద్ధి ,సహకారం, రక్షణ , భద్రత , ప్రత్యేకించి సంస్కృతి ,ప్రజల మధ్య పరస్పర సంబంధాలపై సహకారానికి సంబంధించిన ప్రతిపాదనలపై నాయకులు చర్చించారు.
వీటిలో ఇంధనం, అనుసంధానత, ఆప్ఘనిస్థాన్‌పై సీనియర్ అధికారులస్థాయిలో సంయుక్త వర్కింగ్ గ్రూప్ లు, చబ్బార్ పోర్టును ఉపయోగించడం, మధ్య ఆసియా దేశాలలో బౌద్ధ ఎగ్జిబిషన్లు, సాధారణంగా వినియోగించే పదాలపై ఇండియా- సెంట్రల్ ఆసియా డిక్షనరీ, సంయుక్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ, ఏటా సెంట్రల్ ఆసియా దేశాల నుంచి వందమంది యువజన ప్రతినిధి బృందాన్ని ఇండియాలో పర్యటనకు ఏర్పాటు చేయడం, సెంట్రల్ ఏసియా దౌత్యవేత్తలకు ప్రత్యేక కోర్సు నిర్వహించడం ఇందులో ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులపై సెంట్రల్ ఆసియా నాయకులతో చర్చించారు. ఈ నాయకులు శాంతియుత, భద్రమైన, సుస్థిర ఆప్ఘనిస్థాన్‌కు తమ బలమైన మద్దతును పునరుద్ఘాటించారు. ఇది వాస్తవ ప్రాతినిధ్యపూర్వకంగా, అన్నివర్గాలను కలుపుకుపోయే రీతిలో ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు మానవతా సహాయం అందించడం కొనసాగించడానికి ఇండియా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి
తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇందుకు సంబంధించి సంయుక్త డిక్లరేషన్‌ను నాయకులు చేపట్టారు. ఇది ఇండియా - సెంట్రల్ ఆసియా భాగస్వామ్యానికి చిరకాల, సమగ్ర ఉమ్మడి దార్శనికతను ప్రతిబింబిస్తోంది.
भारत और Central Asia देशों के डिप्लोमेटिक संबंधों ने 30 सार्थक वर्ष पूरे कर लिए हैं।
— PMO India (@PMOIndia) January 27, 2022
पिछले तीन दशकों में हमारे सहयोग ने कई सफलताएं हासिल की हैं।
और अब, इस महत्वपूर्ण पड़ाव पर, हमें आने वाले सालों के लिए भी एक महत्वकांक्षी vision परिभाषित करना चाहिए: PM @narendramodi
क्षेत्रीय सुरक्षा के लिए हम सभी की चिंताएं और उद्देश्य एक समान हैं। अफगानिस्तान के घटनाक्रम से हम सभी चिंतित हैं।
— PMO India (@PMOIndia) January 27, 2022
इस सन्दर्भ में भी हमारा आपसी सहयोग, क्षेत्रीय सुरक्षा और स्थिरता के लिए और महत्वपूर्ण हो गया है: PM @narendramodi