యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసఫ్ ఆర్. బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో పాలుపంచుకొన్నారు. ‘మహమ్మారి యొక్క అలసట ను అడ్డుకోవడం మరియు సన్నాహాల కు ప్రాధాన్యాల ను నిర్ణయించడం’ ఇతివృత్తం పై ఏర్పాటైన ఈ శిఖర సమ్మేళనం తాలూకు ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు.
భారతదేశం మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ప్రజలను కేంద్ర స్థానం లో ఉంచిన వ్యూహాన్ని అనుసరించిందని మరి ఈ సంవత్సరం లో తన ఆరోగ్య బడ్జెటు కై తవరకు అత్యధిక కేటాయింపు ను చేసిందని ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రపంచం లో అత్యంత పెద్దది అయినటువంటి టీకామందు వితరణ కార్యక్రమాన్ని భారతదేశం అమలు పరుస్తోందని, వయోజనుల లో ఇంచుమించు 90 శాతం మంది కి, ఏబై మిలియన్ కు పైగా బాలల కు టీకామందు ను ఇప్పించడం పూర్తి అయిందని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రపంచ సముదాయం లో ఒక బాధ్యతాయుత సభ్యత్వ దేశం గా భారతదేశం తన తక్కువ ఖర్చు తో కూడిన స్వదేశీ కోవిడ్ ఉపశమనకారి సాంకేతికతల ను, వాక్ సీన్ లను మరియు చికిత్స విజ్ఞానాన్ని ఇతర దేశాల తో పంచుకొంటూ చురుకైనటువంటి పాత్ర ను పోషిస్తూనే ఉంటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. జీనోమిక్ సర్విలాంస్ కంసోర్టియమ్ ను విస్తరించడం కోసం భారతదేశం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. భారతదేశం సాంప్రదాయిక చికిత్స ను విస్తృతం గా ఉపయోగించింది, ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటు లోకి తీసుకు రావడం కోసం భారతదేశం లో ‘సాంప్రదాయిక చికిత్స కోసం డబ్ల్యుహెచ్ ఒ కేంద్రం’ నిర్మాణాని కి పునాదిరాయి ని వేయడం జరిగింది అని ఆయన వివరించారు.
ప్రపంచం లో బలమైనటువంటి మరియు ఆటుపోటులకు తట్టుకొని నిలచేటటువంటి ఆరోగ్య భద్రత సంబంధి మౌలిక సదుపాయాల ను కల్పించడం కోసం డబ్ల్యుహెచ్ఒ ను బలపరచడమే కాక డబ్ల్యు హెచ్ఒ లో సంస్కరణల ను కూడా తీసుకు రావాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ఇతర దేశాల లో కార్యక్రమానికి సహ ఆతిథేయి కేరికామ్ అధ్యక్ష స్థానం లో ఉన్నటువంటి బెలీజ్ ప్రభుత్వ ప్రముఖులు, ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్ష స్థానం లో ఉన్న సెనెగల్, జి20 అధ్యక్ష స్థానం లో ఉన్న ఇండోనేశియా లతో పాటు జి7 అధ్యక్ష స్థానం లో ఉన్న జర్మనీ లు ఉన్నాయి. ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జనరల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ మరియు ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.
ప్రధాన మంత్రి 2021వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నాడు అధ్యక్షుడు శ్రీ బైడెన్ ద్వారా ఏర్పాటైన ఒకటో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో కూడాను పాలుపంచుకొన్నారు.