Quote‘‘సంగీతం అనేది మన ప్రాపంచిక విధుల ను గురించి మనల ను జాగృతం చేసేటటువంటి ఒకమాధ్యమం గా ఉంది; అంతేకాదు, అది ప్రాపంచిక అనుబంధాల ను మనం అధిగమించడంలో కూడాను సాయపడుతుంది’’
Quote‘‘భారతీయ వారసత్వం నుంచి ప్రపంచం లాభ పడింది అని యోగ దినం తాలూకు అనుభవం తెలియజేసింది; మరి భారతదేశ సంగీతాని కి కూడా మానవమేధస్సు యొక్క లోతు ను కుదుపేసే సామర్ధ్యం ఉంది’’
Quote‘‘భారతీయ వారసత్వం నుంచి ప్రపంచం లాభ పడింది అని యోగ దినం తాలూకు అనుభవం తెలియజేసింది; మరి భారతదేశ సంగీతాని కి కూడా మానవమేధస్సు యొక్క లోతు ను కుదుపేసే సామర్ధ్యం ఉంది’’
Quote‘‘ప్రపంచం లో ప్రతి ఒక్క వ్యక్తి కి భారతదేశం యొక్క సంగీతాన్ని గురించితెలుసుకొనే, నేర్చుకొనే, ప్రయోజనాల ను పొందే అధికారం ఉంది. ఈ విషయం లోశ్రద్ధ వహించవలసిన బాధ్యత మనకు ఉంది’’
Quote‘‘వర్తమాన యుగం లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం అంతటా వ్యాపించింది; సంగీత రంగం లో సైతం సాంకేతిక విజ్ఞానంమరియు ఐటి విప్లవం చోటుచేసుకోవాలి’’

భారతదేశ శాస్త్రీయ సంగీతం లో అనుభవజ్ఞ‌ుడు పండిత్ జస్ రాజ్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ఘనం గా శ్రద్దాంజలి ఘటించారు. పండిత్ జస్ రాజ్ ద్వారా సంగీతం తాలూకు అమర శక్తి మూర్తిమంతం కావడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఆ విద్వాంసుని వైభవోపేతమైనటువంటి వారసత్వాన్ని జీవం ఉట్టిపడేటట్టు పరిరక్షిస్తున్నందుకు గాను దుర్గ జస్ రాజ్ గారి ని, పండిత్ శారంగ్ దేవ్ గారి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పండిత్ జస్ రాజ్ కల్చరల్ ఫౌండేశన్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

భారతదేశ సంగీత పరంపర తాలూకు విజ్ఞ‌ులు బోధించిన విస్తృత జ్ఞానాన్ని గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు. విశ్వ శక్తి ని గురించిన ఎరుక ను సాధించడాని కి, మరి అదే విధం గా విశ్వం ఉనికి లో సంగీతాన్ని గమనించగల సామర్థ్యమే భారతదేశ శాస్త్రీయ సంగీత సంప్రదాయానికి ఎంతో అసాధారణత్వాన్ని సంపాదించిపెడుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సంగీతం అనేది మన ప్రాపంచిక కర్తవ్యాల ను గురించి మనకు తెలియజెప్పేటటువంటి ఒక సాధనం గా ఉంది, అలాగే ప్రాపంచిక అనుబంధాల ను అధిగమించడం లో కూడాను సంగీతం మనకు సహాయకారి అవుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

|

భారతదేశం యొక్క ఘనమైనటువంటి కళా వారసత్వాన్ని, అలాగే సంస్కృతి సంబంధి వారసత్వాన్ని పరిరక్షించాలని పండిత్ జస్ రాజ్ కల్చరల్ ఫౌండేశన్ లక్ష్యాన్ని పెట్టుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి ప్రశంస ను వ్యక్తం చేశారు. సాంకేతిక విజ్ఞాన ప్రధానమైన వర్తమాన యుగం లోని రెండు కీలకమైన దృష్టికోణాల పట్ల శ్రద్ధ తీసుకోవలసిందని ఫౌండేశన్ కు ఆయన సూచన చేశారు. ఆ రెండు దృష్టికోణాల లో ఒకటో దృష్టికోణం ఏమిటి అంటే అది భారతదేశ సంగీతం నేటి ప్రపంచీకరణ యుగం లో తనదైనటువంటి గుర్తింపు ను ఏర్పరచుకోవాలి అనేదే అని ఆయన చెప్పారు. భారతదేశ వారసత్వం నుంచి ప్రపంచం లబ్ధి ని పొందింది అని యోగ దినం తాలూకు అనుభవం తెలియజేసింది అని ఆయన చెప్పారు. అదే విధం గా భారతదేశ సంగీతాని కి మానవ మేధస్సు యొక్క లోతు ను తరచి చూడగల సామర్ధ్యం కూడా ఉందని ఆయన అన్నారు. ‘‘ఈ ప్రపంచం లో ప్రతి వ్యక్తి కి భారతదేశ సంగీతాన్ని గురించి తెలుసుకొనేందుకు, భారతదేశ సంగీతాన్ని నేర్చుకొనేందుకు, భారతదేశ సంగీతం యొక్క ప్రయోజనాల ను పొందేందుకు అధికారం ఉంది. ఈ విషయం లో శ్రద్ధ ను తీసుకోవడం మన బాధ్యత’’ అని ఆయన అన్నారు.

రెండో దృష్టికోణం ఏమిటి అంటే అది సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రభావం అంతటా వ్యాపించి ఉన్నటువంటి వర్తమాన యుగం లో సంగీత రంగం లో సైతం సాంకేతిక విజ్ఞానం, ఇంకా ఐటి సంబంధి విప్లవం చోటు చేసుకోవాలి అనేదే అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ వాద్య పరికరాలు మరియు సంప్రదాయాల పై ఆధారపడినటువంటి సంగీతాని కి పూర్తి గా అంకితం అయి పని చేసే స్టార్ట్-అప్స్ ముందుకు రావాలి అని ఆయన పిలుపు ను ఇచ్చారు.

కాశీ వంటి కళల సంబంధి కేంద్రాల ను, సంస్కృతి సంబంధి కేంద్రాల ను పునరుద్ధరించడం కోసం ఇటీవలి ప్రయత్నాల ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. భారతదేశం పర్యావరణ పరిరక్షణ పట్ల, ప్రకృతి ప్రేమ పట్ల తనకు గల విశ్వాసం ద్వారా ప్రపంచాని కి ఒక భద్రమైన భవిష్యత్తు కు మార్గాన్ని చూపించింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘వారసత్వం తో పాటుగా అభివృద్ధి దిశ లో సాగుతున్న భారతదేశం ప్రస్థానం లో, ‘సబ్ కా ప్రయాస్’ ను చేర్చాలి అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
‘Benchmark deal…trade will double by 2030’ - by Piyush Goyal

Media Coverage

‘Benchmark deal…trade will double by 2030’ - by Piyush Goyal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 జూలై 2025
July 25, 2025

Aatmanirbhar Bharat in Action PM Modi’s Reforms Power Innovation and Prosperity