ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌లు అమెరికాలోని విల్మింగ్టన్‌లో 6వ క్వాడ్ నేతల సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. 2022 మే నుంచి వీరిద్దరూ వ్యక్తిగతంగా కలవడం ఇది తొమ్మిదోసారి.
రాజకీయ, వ్యూహాత్మక, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, పరిశోధన, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉన్నతస్థాయి సమావేశాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు ఊపందుకున్నాయని వారు అంగీకరించారు.
బహుళపక్ష కూటముల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ధరించారు. భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
Held extensive discussions with PM Albanese. We seek to add even more momentum in areas like trade, security, space and culture. India greatly cherishes the time tested friendship with Australia. @AlboMP pic.twitter.com/Bo4kzd8QwY
— Narendra Modi (@narendramodi) September 22, 2024