ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో సెనెగల్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మేకీ సాల్ తో సమావేశమయ్యారు.
వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ ఇంకా భద్రత, శక్తి, గనుల త్రవ్వకం, వ్యవసాయం, ఔషధ నిర్మాణం, రైలు మార్గాలు, సామర్థ్యాల పెంపుదల, సంస్కృతి మరియు ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా వివిధ రంగాల లో తమ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచుకొనే మార్గాల ను గురించి నేత లు ఇద్దరు ఫలప్రదమైన చర్చల ను జరిపారు.
‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌథ్ సమిట్’ లో అధ్యక్షుడు శ్రీ సాల్ పాలుపంచుకొన్నందుకు మరియు కిందటి సంవత్సరం లో ఆఫ్రికా యూనియన్ కు ఆయన బలమైన నాయకత్వాన్ని ఇచ్చినందుకు ఆయన ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
చంద్రయాన్ మిశన్ విజయం పట్ల అధ్యక్షుడు శ్రీ సాల్ ప్రధాన మంత్రి కి అభినందనల ను తెలియ జేశారు. జి-20 లో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని పొందేటట్లుగా భారతదేశం ప్రయత్నించినందుకు ఆయన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల ప్రాథమ్యాల ను సమర్ధిస్తున్నందుకు ప్రధాన మంత్రి యొక్క నాయకత్వాన్ని ఆయన మెచ్చుకొన్నారు. భారతదేశం అధ్యక్షత న త్వరలో జరగబోయే జి-20 శిఖర సమ్మేళనం సఫలం కావాలంటూ ఆయన తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
Held talks with President @Macky_Sall in Johannesburg. India considers Senegal to be a valued developmental partner. We discussed sectors like energy, infrastructure, defence and more in our meeting. pic.twitter.com/keoZjjnjZg
— Narendra Modi (@narendramodi) August 24, 2023