ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లోని ఎలిసీ ప్యాలెస్ లో ఫ్రాన్స్ రిపబ్లిక్ అధ్య క్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో వ్యక్తిగత, ప్రతినిధి వర్గం స్థాయి చర్చలు జరిపారు.
రక్షణ, భద్రత, పౌర అణు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు సహా ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.
భారత్ జీ20 ప్రెసిడెన్సీ, ఇండో-పసిఫిక్ సహా పరస్పర ప్రయోజనాలున్న ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించారు.
"హారిజాన్ 2047: భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తును నిర్దేశించడం" తో సహా ప్రతిష్టాత్మక ఫలితాల పత్రాలను ఆమోదించారు.
2023 సెప్టెంబర్ లో జరగనున్న జీ20
నేతల సమావేశానికి అధ్య క్షుడు మాక్రాన్ కు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్లు ప్రధాన మంత్రి తెలిపారు.