ఫ్రాన్స్ కు చెందిన విదేశీ వ్యవహారాలు మరియు యూరోప్ శాఖ మంత్రి కేథరీన్ కోలోనా గారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు. ఆమె సెప్టెంబర్ 13వ తేదీ మొదలుకొని 15వ తేదీ మధ్య కాలం లో భారతదేశాన్ని ఆధికారికం గా సందర్శించడం కోసం తరలి వచ్చారు. ద్వైపాక్షిక అంశాల ను మరియు పరస్పర హితం ముడిపడిన ఇతర అంశాల ను చర్చించడం తో పాటుగా అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తరఫు న సహకార పూర్వక మరియు మైత్రి పూర్వక సందేశాన్ని కూడా మంత్రి ఈ సందర్భం లో ప్రధాన మంత్రి కి అందజేశారు. పేరిస్ లో మరియు జర్మనీ లోని శ్లాస్ ఎల్ మావు లో అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తో ఇటీవల తాను పాల్గొన్న సమావేశాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆప్యాయం గా గుర్తు కు తెచ్చుకొని, వీలైనంత త్వరలో అధ్యక్షుని కి భారతదేశం లో స్వాగతం పలకాలని వుందన్టూన తన ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.