ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో కోపెన్ హేగన్ లో స్వీడన్ ప్రధాని మేగ్డెలీనా ఎండర్ సన్ తో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి ఒకటో సమావేశం ఇది.
భారతదేశాని కి, స్వీడన్ కు మధ్య చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. అవి సమాన విలువలు, బలమైనటువంటి వ్యాపారం, పెట్టుబడి మరియు ప్రపంచ శాంతి, పరిశోధన, ఇంకా అభివృద్ధి (ఆర్ ఎండ్ డి ) కోసం సమాన దృష్టి కోణాల పై ఆధారపడివున్నాయి. నూతన ఆవిష్కరణ లు, సాంకేతిక విజ్ఞానం, పెట్టుబడి మరియు పరిశోధన, ఇంకా అభివృద్ధి సంబంధి సమన్వయాలు అనేవి ఈ ఆధునిక సంబంధాల కు ఆధార స్తంభాలు గా ఉన్నాయి. ఒకటో ఇండియా-నార్డిక్ సమిట్ లో పాలుపంచుకోవడానికని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం లో స్వీడన్ ను సందర్శించినప్పుడు చోటు చేసుకొంది. ఆ సందర్భం లో ఉభయ పక్షాలు ఒక విస్తృతమైన సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ను ఆమోదించి, ఒక జాయింట్ ఇనొవేశన్ పార్ట్ నర్ శిప్ పైన సంతకాలు చేశాయి.
ఈ రోజు న జరిగిన సమావేశం లో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక భాగస్వామ్యం లో పురోగతి ని సమీక్షించారు. వారు లీడ్ ఐటి కార్యక్రమం లో నమోదైన పురోగతి పై సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఇది 2019 లో జరిగిన యుఎన్ క్లయిమేట్ యాక్షన్ సమిట్ లో పరిశ్రమ పరివర్తన పై నాయకత్వ సమూహం (లీడ్ ఐటి) ని ఏర్పాటు చేసేందుకు భారత్- స్వీడన్ ల యొక్క సంయుక్త ప్రపంచ చొరవ గా ప్రసిద్ధి కెక్కింది. దీని ద్వారా ప్రపంచం లో అత్యంత అధికమైన గ్రీన్ హౌస్ గ్యాస్ (జిహెచ్ జి) ఉద్గారాల పరిశ్రమల నుంచి తక్కువ కర్బనం వెలువడే ఆర్థిక వ్యవస్థ దిశ గా మళ్ళేందుకు మార్గదర్శకత్వం అందించాలని ఉద్దేశించడం జరిగింది. లీడర్ శిప్ గ్రూప్ ఆన్ ఇండస్ట్రీ ట్రాన్సిశన్ (లీడ్ ఐటి) లో సభ్యత్వాల సంఖ్య 16 దేశాలు మరియు 19 కంపెనీలు కలుపుకొని ప్రస్తుతం 35 కు పెరిగింది.
ఇద్దరు నేతలు నూతన ఆవిష్కరణ లు, క్లయిమేట్ టెక్నాలజీ, క్లయిమేట్ యాక్షన్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్షం, రక్షణ, పౌర విమాన యానం, ఆర్క్ టిక్, న, ధ్రువ ప్రాంతాల లో పరిశోధన, సస్టెయినబుల్ మైనింగ్, వ్యాపారం మరియు ఆర్థిక సంబంధాలు వంటి రంగాల లో సహకారాన్ని పటిష్టం చేసుకొనేందుకు ఉన్న అవకాశాల ను చర్చించారు.
ప్రాంతీయ, ప్రపంచ ఘటనక్రమాల పైన సైతం చర్చలు జరిగాయి.
Cementing ties with Sweden.
— PMO India (@PMOIndia) May 4, 2022
PM @narendramodi and @SwedishPM Magdalena Andersson held extensive talks on further diversifying the India-Sweden friendship. pic.twitter.com/d1bXP5JW5u