ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేశన్ బోర్డు డైరెక్టరు మరియు వ్యవస్థాపకుడు శ్రీ మాసాయోశీ సోన్ తో టోక్యో లో ఈ రోజు (23 మే 2022) న సమావేశమయ్యారు. వారు భారతదేశం యొక్క స్టార్ట్-అప్ రంగం లో సాఫ్ట్ బ్యాంక్ పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం లో సాంకేతిక విజ్ఞానం, శక్తి మరియు ఆర్థికం వంటి కీలక రంగాల లో సాఫ్ట్ బ్యాంక్ యొక్క భావి భాగస్వామ్యాన్ని గురించి చర్చించారు.
వారు భారతదేశం లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజ్ నెస్’ ను సమర్ధమైంది గా చేసేందుకు జరుగుతున్న వివిధ సంస్కరణ ల విషయమై చర్చించారు. సాఫ్ట్ బ్యాంకు భారతదేశం లో ఎక్కడెక్కడ తన పెట్టుబడుల ను అధికం చేసుకొనేందుకు ఆస్కారం ఉందనే విషయం లో కొన్ని విశిష్ట ప్రతిపాదన లు సమావేశం లో ప్రస్తావనకు వచ్చాయి.
In Tokyo, PM @narendramodi interacted with Founder @SoftBank_Group, Mr. Masayoshi Son. The subjects discussed include India's strides in the world of StartUps, opportunities in research, technology and ways to boost investment linkages. pic.twitter.com/dqvGTUn7Hj
— PMO India (@PMOIndia) May 23, 2022