ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ పూర్వ ప్రధానులు శ్రీయుతులు యొశిరొ మొరి మరియు శింజో ఆబే లతో జపాన్ లోని టోక్యో లో ఈ రోజు (2022 మే 24) న సమావేశమయ్యారు. శ్రీ యొశిరొ మొరి జపాన్-ఇండియా అసోసియేశన్ (జెఐఎ) కు ప్రస్తుతం అధ్యక్షుని గా ఉన్నారు. అయితే, శ్రీ శింజో ఆబే త్వరలోనే ఈ బాధ్యత ను తాను స్వీకరించనున్నారు. జెఐఎ 1903వ సంవత్సరం లో ఏర్పాటైంది. ఇది జపాన్ లోని అత్యంత పాతదైన మైత్రీ సంఘాల లో ఒకటి గా ఉంది.
శ్రీ యొశిరొ మొరి నాయకత్వం లో జెఐఎ అందించిన గణనీయమైనటువంటి తోడ్పాటుల ను, మరీ ముఖ్యం గా భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాల లో ఆదాన ప్రదానాల ను ప్రోత్సహించడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. కొత్త బాధ్యతల ను స్వీకరించనున్న శ్రీ శింజో ఆబే కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియజేశారు. జెఐఎ తాను పోషిస్తున్న ముఖ్య పాత్ర ను కొనసాగిస్తుందని ఆశపడుతున్నాను అని ప్రధాన మంత్రి అన్నారు.
ఇండియా-జపాన్ స్పెశల్ స్ట్రటిజిక్ ఎండ్ గ్లోబల్ పార్ట్ నర్ శిప్ యొక్క విశాలమైన పరిధి ని గురించి, ఒక శాంతియుతమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి, సమృద్ధి యుక్తమైనటువంటి ఇండో- పసిఫిక్ అనే దృష్టి కోణాన్ని భారతదేశం మరియు జపాన్ ఆకాంక్షిస్తుండడాన్ని గురించి కూడా నేత లు చర్చించారు. రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల ను మరింతగా ప్రోత్సహించగల మార్గాలు సైతం చర్చలు చోటు చేసుకొన్నాయి.
Met former PMs @AbeShinzo and Yoshiro Mori. We had wonderful discussions on various topics. The Japan-India association is playing a commendable role in boosting ties between our nations. pic.twitter.com/sBcNTOPguP
— Narendra Modi (@narendramodi) May 24, 2022