ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15 న అబుదాబిలో సిఒపి 28 ప్రెసిడెంట్ గా నియమితులైన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూప్ సిఇఒ డాక్టర్ సుల్తాన్ అల్ జాబెర్ తో సమావేశమయ్యారు.
యుఎఇ అధ్యక్షతన యు ఎన్ ఎఫ్ సిసిసి రాబోయే సిఓపి -28 పై చర్చలు జరిగాయి. ఈ ప్రాముఖ్యమైన స మావేశానికి యుఎఇ అనుసరిస్తున్న విధానాన్ని డా. జాబేర్
భారత ప్రధాన మంత్రికి వివరించారు.
కాప్-28 ప్రెసిడెన్సీ కోసం యు ఎ ఇ కి భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి తెలియజేశారు.
అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం, మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ (ఎల్ ఐఎఫ్ ఇ) తో సహా వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత దేశం చేస్తున్న ప్రయత్నాలు, చొరవ లను ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
భారత్, యు ఎ ఇ ల మధ్య ఇంధన సహకారంపై కూడా చర్చించారు.