ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం మే 23 వ తేదీ న ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో ప్రముఖ ఆస్ట్రేటియన్ పారిశ్రమికవేత్త మరియు ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూపు, ఇంకా ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీజ్ ల ఎగ్జిక్యూటివ్ చైర్ మన్, వ్యవస్థాపకుడైన డాక్టర్ శ్రీ ఏండ్ర్ యూ ఫారెస్ట్ తో సమావేశమయ్యారు.
గ్రీన్ హైడ్రోజన్ రంగం లో భారతదేశాని కి చెందిన కంపెనీల తో కలసి పని చేయాలన్న ఫోర్టెస్క్యూ గ్రూపు ప్రణాళికల ను ప్రధాన మంత్రి స్వాగతించారు. నవీకరణ యోగ్య శక్తి రంగం లో భారతదేశంకి మహత్వాకాంక్ష భరిత ప్రణాళికల ను రచించుకొందన్న సంగతి ని ప్రధాన మంత్రి చెప్తూ, గ్రీన్ హైడ్రోజన్ మిశన్ వంటి పరివర్తన కారి సంస్కరణల ను మరియు కార్యక్రమాల ను లో భారతదేశం అమలు చేస్తోందన్నారు.
డాక్టర్ శ్రీ ఫారెస్ట్ భారతదేశం లో ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీజ్ యొక్క ప్రణాళికల ను గురించి మరియు ప్రాజెక్టుల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.