A task force has been formed, which will monitor the cheetahs and see how they are adapting to the environment: PM Modi
Deendayal ji's 'Ekatma Manavdarshan' is such an idea, which in the realm of ideology gives freedom from conflict and prejudice: PM Modi
It has been decided that the Chandigarh airport will now be named after Shaheed Bhagat Singh: PM Modi
A lot of emphasis has been given in the National Education Policy to maintain a fixed standard for Sign Language: PM Modi
The world has accepted that yoga is very effective for physical and mental wellness: PM Modi
Litter on our beaches is disturbing, our responsibility to keep coastal areas clean: PM Modi
Break all records this time to buy Khadi, handloom products: PM Modi
Use locally made non-plastic bags; trend of jute, cotton, banana fibre bags is on the rise once again: PM Modi

ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.

మిత్రులారా, ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాం. ఈ టాస్క్ ఫోర్క్ చీతాలను మానిటర్ చేస్తుంది. ఇక్కడ పరిస్థితులతో అవి ఎంతగా కలిసిపోతాయో చూస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని కొన్ని నెలల తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాం. మరి అప్పటిదాకా చీతాలను మనం చూడగలుగుతాం. కానీ అప్పటిదాకా నేను మీకందరికీ కొన్ని పనులు అప్పజెబుతున్నాను. దానికోసం మై గవర్నమెంట్ వేదికమీద ఓ కాంపిటీషన్ ను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో నేను అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను. చీతాలకోసం మనం ఓ పథకాన్ని నడుపుతున్నాం. మరి ఆ పథకానికి ఏ పేరు పెడితే బాగుంటుంది. మనం వాటికి పేరు పెట్టడం గురించి ఆలోచించగలుగుతామా, అసలు వాటిలో ప్రతి ఒక్కదాన్నీ ఏ పేరుతో పిలవాలని. నిజానికి ఆ నామకరణం సంప్రదాయబద్ధంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మన సమాజం, మన సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాలతో ముడిపడి ఉన్నది ఏదైనా సరే మనల్ని సహజంగానే దానివైపుకి ఆకర్షిస్తుందికదా. అది మాత్రమే కాదు మీరింకో విషయం కూడా చెప్పాలి. అసలు మనుషులు జంతువులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని. మన ప్రాథమిక విధుల్లోకూడా రెస్పెక్ట్ ఫర్ యానిమల్స్ అనే విషయం మీద కూడా శ్రద్ధ చూపించారు. నేను మీకందరికీ ఏం అప్పీల్ చేస్తున్నానంటే మీరందరూ ఈ కాంపిటీషన్ లో తప్పక భాగస్వాములు కావాలి. ఎవరికి తెలుసు బహుమానంగా చీతాని చూసే మొదటి అవకాశం మీకే రావొచ్చుకదా.

ప్రియమైన దేశవాసులారా, ఈ సెప్టెంబర్ 25కి దేశంలోని ప్రముఖ మానవతావాదులు, ఆలోచనాపరులు, భరతమాత ముద్దుబిడ్డ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జన్మదిన వేడుకల్ని జరుపుకుంటాం. ఏ దేశంలో అయినా సరే యువకులు వాళ్లకు లభించే గుర్తింపును, గౌరవాన్నీ చూసి గర్విస్తారో, వాళ్లని ప్రాథమికమైన ఆలోచనలు, ముందుచూపు అంతే స్థాయిలో ఆకర్షిస్తాయి. దీన్ దయాళ్ గారి ఆలోచనల్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఆయన తన జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద ఉత్థాన పతనాల్ని చూశారు. అలాంటి ఆలోచనలకు, సంఘర్షణలకు ఆయన సాక్షిగా నిలిచారు.

అందుకే ఆయన సమసమాజ స్థాపన, అలాగే అంత్యోదయ లాంటి చక్కటి ఆలోచనల్ని దేశం ముందు ఉంచారు. అవి పూర్తిగా భారతీయ భావనలు. దీన్ దయాళ్ గారు చెప్పిన సమసమాజ స్థాపన అసలు ఎలాంటి ఆలోచనంటే అది ఆలోచనా ధార అనే పేరుతో ద్వంద్వానికి, దురాగ్రహానికి తావు లేకుండా చేసేది. ఆయన మనుషులందర్నీ సమానంగా చూసే భారతీయ దర్శనాన్ని మళ్లీ ప్రపంచం ముందుంచారు. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, ఆత్మవత్ సర్వభూతేషు అన్నాయి. అంటే దానర్థం మనం జీవులన్నింటినీ మనతో సమానంగా చూడాలని. వాటిలో కూడా మనందరిలాగే వ్యవహరించాలని. ఆధునిక, సామాజిక అలాగే రాజనైతిక దృష్టికోణంలోకూడా భారతీయ దర్శనం ప్రపంచానికి ఎలా మార్గదర్శనం కాగలదో, దీన్ దయాళ్ గారు మనకి నేర్పించారు. ఓ విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి హీనమైన భావన ఉండేదంటే, దాని నుంచి విముక్తి కల్పించి ఆయన మన అంతః చైతన్యాన్ని జాగృతం చేశారు. ఆయనేమనేవారంటే మనకి వచ్చిన ఈ స్వాతంత్ర్యం ఎప్పటికి సార్థకమవుతుందంటే అది మన సంస్కృతికి, గుర్తింపుకు మారుపేరుగా ఉన్నప్పుడే. ఈ ఆలోచనల ఆధారంగా ఆయన దేశం అభివృద్ధి చెందడానికి ఓ విజన్ ని రూపొందించగలిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఏమనేవారంటే దేశ ప్రగతికి చిహ్నం, చిట్ట చివరి మెట్టుమీదున్న వ్యక్తే అవుతాడనేవారు.

స్వాతంత్ర్య అమృతోత్సవ కాలంలో మనం దీన్ దయాళ్ గారి గురించి ఎంతగా తెలుసుకోగలిగితే, ఆయన్ని చూసి ఎంత నేర్చుకోగలిగితే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనందరికీ అంతగా ప్రేరణ లభిస్తుంది.

ప్రియమైన దేశవాసులారా, ఇవ్వాళ్టినుంచి మూడు రోజుల తర్వాత అంటే  సెప్టెంబర్ 28వ తేదీన అమృత మహాత్సవాలకు సంబంధించి ఓ ప్రత్యేకమైన రోజొస్తోంది. ఆ రోజున మనం భరతమాత వీర పుత్రుడు భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటాం.

భగత్ సింగ్ జయంతిని జరుపుకోవడానికి ముందుగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాం. చండీఘడ్ ఎయిర్ పోర్ట్ కు అమర వీరుడైన భగత్ సింగ్ పేరును పెడుతున్నాం. దానికోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నాం. నేను చండీఘడ్, పంజాబ్, హర్యానా అలాగే ఈ దేశవాసులందరికీ ఓ నిర్ణయం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మిత్రులారా, మనం మన స్వాతంత్ర్యం సేనానులనుంచి ప్రేరణ పొందాలి, వాళ్ల ఆదర్శాలను పాటిస్తూ వాళ్లు కలలుగన్న భారత దేశాన్ని నిర్మించాలి. అదే మనం వాళ్లకు అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. అమర వీరుల్ని స్మరించుకోవడం, వాళ్ల పేరును కొన్ని ప్రదేశాలకు, కొన్ని కట్టడాలకు పెట్టడం మనకి ప్రేరణనిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ దేశం ఆ కర్తవ్య పథంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇప్పుడు చండీఘడ్ ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు పెట్టడం ఆ దిశగా మరో అడుగు ముందుకు వెయ్యడమే.

నాక్కావాల్సిందేంటంటే, అమృత మహోత్సవాల్లో మనం మన స్వాతంత్ర్య సేనానులకు సంబంధించి విశేషమైన సందర్భాలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదే విధంగా సెప్టెంబర్ 28వ తేదీనాడుకూడా ప్రతి ఒక్క యువకుడూ ఓ సరికొత్త ప్రయత్నాన్ని తప్పకుండా మొదలుపెట్టాలి.

అలాగే నా ప్రియమైన దేశవాసులారా, మీకందరికీ సెప్టెంబర్ 28వ తేదీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా? నేను కేవలం రెండు ముక్కలు మాత్రం చెబుతాను. కానీ నాకు తెలుసు మీ ఉత్సాహం నాలుగు రెట్లు ఎక్కువగా పెరిగిపోతుంది.

ఆ రెండు పదాలేంటంటే సర్జికల్ స్ట్రైక్! ఉత్సాహం పెరిగిందికదా! మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న అమృత మహాత్సవాల సంరంభం దాన్ని మనం మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన సంతోషాన్ని అందరితో పంచుకోవాలి.

నా  ప్రియమైన దేశవాసులారా! జీవితంలో అనేక సంఘర్షణలను ఎదుర్కున్న వ్యక్తి ముందు ఎలాంటి బాధా నిలబడలేదంటారు. మన నిత్య జీవితంలో మనం కొందరు ఎలాంటి వాళ్లను చూస్తామంటే, వాళ్లు ఏదో ఒక శారీరకమైన లోపంతో బాధపడుతూ ఉంటారు. చాలామంది వినలేనివాళ్లుంటారు, లేదంటే మాట్లాడి మనసులోని మాటలు చెప్పలేనివాళ్లుంటారు.అలాంటి మిత్రలకు చాలా పెద్ద ఆధారం సైన్ లాంగ్వేజ్. కానీ భారత దేశంలో చాలా కాలంగా చాలా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సంజ్ఞల భాషకు చాలా కాలం వరకూ స్పష్టమైన హావభావాలుండేవికావు. స్టాండర్డ్స్ ఉండేవి కావు. ఆ ఇబ్బందుల్ని తొలగించడం కోసమే 2015లో ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ సెంటర్ ని స్థాపించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ సంస్థ ఇప్పటికే వెయ్యి పదాలు, భావాలతో కూడిన డిక్ష్నరీని తయారు చేసింది. రెండు రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 23వ తేదీన సైన్ లాంగ్వేజ్ డే రోజున ఎన్నో స్కూళ్ల పాఠ్యాంశాలను కూడా సైన్ లాంగ్వేజ్ లో లాంచ్ చేశాం. సైన్ లాంగ్వేజ్ నిర్ణయించిన స్టాండర్డ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు దేశీయ విద్యా విధానంలోకూడా చాలా గట్టి ప్రయత్నాలే చేశాం. ఇప్పుడు తయారు చేసిన సైన్ లాంగ్వేజ్ డిక్ష్నరీని వీడియో తీసి నిరంతరాయంగా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. యూట్యూబ్ లో చాలామంది, చాలా సంస్థలు, భారతీయ భాషల్లో సైన్ లాంగ్వేజ్ లో ఛానళ్లుకూడా ప్రారంభించారు. అంటే ఏడెనిమిదేళ్లక్రితం సైన్ లాంగ్వేజ్ ని అభివృద్ధి చెయ్యడానికి ప్రారంభించిన పథకంవల్ల ఇప్పుడు లక్షలాదిమంది దివ్యాంగులైన సోదరసోదరీమణులకు లాభం కలుగుతోంది.

హర్యానా వాసియైన పూజగారు ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ ని చూసి చాలా సంతోషపడుతున్నారు. ముందసలు ఆవిడకి తన బిడ్డతో సంబంధం ఉండేది కాదు. కానీ 2018లో సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ తీసుకున్నాక తల్లీ బిడ్డా ఇద్దరి జీవితం సుఖంగా సాగిపోతోంది. పూజగారి పిల్లవాడు కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. పైగా తను వాళ్ల స్కూల్లో స్టోరీ టెల్లింగ్ లో ప్రైజ్ గెలిచి చూపించాడుకూడా.  ఈ విధంగామో టింకా గారికి ఓ పదేళ్ల కూతురుంది. తను పాపం వినలేదు. టింకా గారు తన కూతురితో సైన్ లాంగ్వేజ్ కోర్స్ చేయించారు. కానీ ఆవిడకు మాత్రం ఆ సైన్ లాంగ్వేజ్  రాదు. ఆ కారణం వల్ల తను తన బిడ్డతో కమ్యూనికేట్ చేయలేకపోయేవారు. కానీ ఇప్పుడు టింకాగారుకూడా సైన్ లాంగ్వేజ్ లో శిక్షణ పొందిన తర్వాత వాళ్లిద్దరూ హాయిగా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నారు.

ఈ ప్రయత్నాలవల్ల కేరళవాసియైన మంజుగారికి కూడా చాలా లాభం కలిగింది. మంజుగారు పుట్టినప్పట్నుంచీ బధిరురాలే. అదిమాత్రమే కాక తన తల్లిదండ్రులకు కూడా ఇలాంటి స్థితే ఉండేది. ఆ పరిస్థితుల్లో సైన్ లాంగ్వేజ్ మొత్తం కుటుంబానికి మాట్లాడుకోవడానికి మాధ్యమం అయ్యింది. ఇప్పుడసలు మంజుగారు స్వయంగా తనే సైన్ లాంగ్వేజ్ టీచర్ కావాలని నిర్ణయించుకున్నారు.

మిత్రులారా నేను దీని గురించి మనసులో మాటలో ఎందుకు చెబుతున్నానంటే ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ గురించి అందరికీ అవగాహన కలగాలని. దీని ద్వారా వికలాంగులైన సోదర సోదరీమణులకు మనం వీలైనంత ఎక్కువగా సాయం చెయ్యగలుగుతాం.

సోదర సోదరీమణులారా, కొన్ని రోజుల క్రితం నాకు బ్రెయిలీ లిపిలో రాసిన హేమకోశం ఓ కాపీ దొరికింది. హేమకోశం అస్సామీ భాషలోని అత్యంత పురాతనమైన డిక్ష్నరీలలో ఒకటి. దాన్ని 19వ శతాబ్దంలో తయారు చేశారు. దానికి ప్రముఖ భాషావేత్త హేమచంద్రబారువా సంపాదకత్వం వహించారు.

ఆ హేమకోశం ఎడిషన్ దాదాపుగా 10వేల పేజీలకు పైనే ఉంది. దాన్ని 15 వాల్యూములుగా ప్రచురించడం జరుగుతోంది. దాంట్లో ఉన్న లక్షకంటే ఎక్కువ పదాలను అనువదించాలి. నేను అత్యంత ప్రయోజనకరమైన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రయత్నం దివ్యాంగులైన సోదరసోదరీమణుల కౌశలాన్ని, సామర్ధ్యాన్ని పెంచడానికి చాలా సాయపడుతుంది. ఇవ్వాళ్ల భారతదేశం పారా స్పోర్ట్స్ లోకూడా విజయకేతనాన్ని ఎగరేస్తోంది. మనం అలాంటి ఎన్నో టోర్నమెంట్లలో పాలుపంచుకోవడం జరిగింది. ఇవ్వాళ్ల చాలామంది ఎలా ఉన్నారంటే వికలాంగుల్లో ఫిట్ నెస్ కల్చర్ ని పెంచేందుకు క్షేత్ర స్థాయిలో చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దానివల్ల దివ్యాంగుల ఆత్మ విశ్వాసానికి చాలా బలం చేకూరుతోంది.

ప్రియమైన దేశవాసులారా, నేను కొన్ని రోజుల క్రితం సూతర్ కి చెందిన ఓ పిల్ల అన్వీని కలిశాను. అన్వీతోపాటు అన్వీ యోగా కూడా నాకు ఎంత బాగా గుర్తుండిపోయిందంటే దాని  గురించి నేను మనసులో మాట శ్రోతలందరికీ చెప్పదలచుకున్నాను.

మిత్రలారా, అన్వీ పుట్టినప్పటినుంచే డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతోంది. తను చిన్నప్పట్నుంచీ అత్యంత క్లిష్టతరమైన హృద్రోగంతో బాధపడుతోంది. తను మూడు నెలల పిల్లగా ఉన్నప్పుడు, అప్పుడే తను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది. ఇన్ని కష్టాలున్నప్పటికీ కూడా, అన్వీగానీ, తన తల్లిదండ్రులుగానీ ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. అన్వీ తల్లిదండ్రులు డౌన్ సిండ్రోమ్ గురించి మొత్త సమాచారాన్ని సేకరించారు. తర్వాత అన్వీ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించారు. వాళ్లు అన్వీకి మంచినీళ్ల గ్లాస్ ఎలా పట్టుకోవాలి, బుట్లకు లేసులు ఎలా కట్టుకోవాలి, బట్టలకు గుండీలు ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న చిన్న విషయాలను నేర్పించడం మొదలుపెట్టారు. ఏ వస్తువును ఎక్కడుంచాలి, మంచి అలవాట్లంటే ఏంటి లాంటి విషయాలన్నింటినీ చాలా ధైర్యంగా వాళ్లు అన్వీకి నేర్పించే ప్రయత్నం చేశారు. అసలు అన్వీ వాటన్నింటినీ ఎంత ఇష్టంగా నేర్చుకుందంటే, ఎంత ప్రతిభను చూపించిందంటే,  దాన్ని చూసి దాన్ని చూసి వాళ్లమ్మానాన్నలకు కూడా కాస్త నమ్మకం కలిగింది. వాళ్లు అన్వీని యోగా నేర్చుకోమని ప్రోత్సహించారు. అసలప్పుడు ఎంత కష్టంగా ఉండేదంటే అన్వీ కనీసం తన కాళ్లమీద నిలబడగలిగేది కాదు. అలాంటి పరిస్థితిలో అన్వీ తల్లిదండ్రులు తనని యోగా నేర్చుకోమని ప్రోత్సహించారు. మొట్టమొదటిసారి తను యోగ గురువు దగ్గరికి వెళ్లినప్పుడు ఆయనకూడా అసలీ పిల్ల యోగా చెయ్యగలుగుతుందా అన్న సందిగ్థంలో ఉన్నారు. కానీ అసలా కోచ్ కి కూడా అసలు అన్వీకి ఈ విషయంలో ఎంత పట్టుదల ఉంది అన్న విషయం గురించి ఎలాంటి అంచనా లేదేమో. తను తన తల్లితోపాటు యోగాను అభ్యసించడం మొదలుపెట్టింది. పైగా ఇప్పుడు తను యోగాలో ఎక్స్ పర్ట్ అయిపోయింది. ఇవ్వాళ్ల అన్వీ కాంపిటీషన్లలో పాల్గొంటోంది, మెడల్స్ సాధిస్తోంది. యోగా అన్వీకి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అన్వీ పట్టుదలగా శ్రద్ధగా యోగాని నేర్చుకుని తన జీవితాన్ని సాఫల్యం చేసుకుంది. వాళ్లమ్మానాన్నలు నాకేం చెప్పారంటే యోగావల్ల అన్వీ జీవితం చాలా అద్భుతంగా మారిపోయిందన్నారు. ఇప్పుడు తనకి ఆత్మ విశ్వాసం బాగా పెరిగింది. యోగావల్ల అన్వీకి ఫిజికల్ హెల్త్ కూడా బాగుపడింది. అలాగే మందుల అవసరం కూడా రోజురోజుకీ తగ్గిపోతోంది. నా ఉద్దేశం ఏంటంటే దేశ విదేశాల్లో ఉన్న మనసులో మాటల శ్రోతలు అన్వీకి యోగా వల్ల కలిగిన లాభాన్ని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చెయ్యాలి. నాకు తెలిసినంతవరకూ యోగా శక్తి సామర్ధ్యాలను పరీక్షించడానికి, నిరూపించడానికి అన్వీ చాలా గొప్ప కేస్ స్టడీ అవుతుంది. విద్యావేత్తలైన శాస్త్రజ్ఞులు ముందుకొచ్చి అన్వీ గురించి ఆధ్యయనం చేసి యోగా సామర్ధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉంది. 

 

అలా పరిశోధనలు చెయ్యడంవల్ల ప్రపంచంలో డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న అనేకమంది పిల్లలకు చాలా మేలు కలుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగా దోహదపడుతుందో ప్రపంచం మొత్తానికీ ఇప్పుడు చాలా బాగా తెలిసిపోయింది. ప్రత్యేకించి డయాబెటీస్, బ్లడ్ ప్రెజర్ లాంటి లోపాలకు సంబంధించిన కష్టానష్టాలనుంచి బైటపడేందుకు యోగవల్ల చాలా మేలు కలుగుతుంది. యోగాకి ఉన్న ఇంతటి శక్తిని గుర్తించి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి భారత దేశానికి సంబంధించిన మరో ప్రయత్నాన్నికూడా ఇప్పుడు గుర్తించింది. దాన్ని గౌరవించింది. ఆ ప్రయత్నం ఏంటంటే 2017లో ప్రారంభించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్. దానివల్ల బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్న లక్షలాదిమందికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంతర్జాతీయ సంస్థల దృష్టిని మనవైపుకు ఎంతగా ఆకర్షించిందంటే నిజంగా చాలా అద్భుతం అది. అసలు మనందరికీ అత్యంత ఆశాజనకమైన విషయం ఏంటంటే ఎంతమందికైతే చికిత్స చేశారో వాళ్లలో సగంమందికి బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంది. నేను ఈ ఇనిషియేటివ్ కోసం పనిచేస్తున్నవాళ్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. వాళ్లంతా ఎంతో శ్రమపడి దీనిలో సఫలతను సాధించారు.

మిత్రులారా, మానవ జీవన అభివృద్ధి యాత్రం, నిరంతరాయంగా నీళ్లతో ముడిపడి ఉంది. అయితే అది సముద్రం కావొచ్చు, లేదంటే నదికావొచ్చు, చెరువు కావొచ్చు.

 

 

భారత దేశపు సౌభాగ్యం ఏంటంటే దాదాపుగా 7వేల 5 వందల కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ ఉన్నందువల్ల మనకి సముద్రంతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఈ తీర ప్రాంతం ఎన్నో రాష్ట్రాలను, ద్వీపాలను తాకుతూ పోతుంది.

భారత దేశంలో ఉన్న వేర్వేరు సముదాయాలు, అలాగే వైవిధ్యంతో కూడిన సంస్కృతి ఇక్కడ పరిఢవిల్లడాన్ని మనం స్వయంగా చూడొచ్చు. అది మాత్రమే కాక ఈ తీరప్రాంతాల్లో ఉన్నవాళ్ల ఆహార వ్యవహారాలు అందర్నీ చాలా ఆకట్టుకుంటాయి. మనకున్న ఈ తీర ప్రాంతం పర్యావరణానికి సంబంధించిన అనేక సమస్యల్ని ఎదుర్కుంటోంది. ఓ వైపున క్లైమేట్ ఛేంజ్ మెరైన్ ఎకో సిస్టమ్స్ కి చాలా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. మరో వైపున మన బీచ్ లలో పెరిగిపోతున్న మురికి అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. మనందరి బాధ్యత ఏంటంటే మనం ఆ సమస్యల గురించి చాలా పట్టుదలగా, నిరంతరాయంగా శ్రమించాలి. నేను దేశంలోని తీర ప్రాంతాల్లో ఉన్న కోస్టల్ క్లీనింగ్ కోసం స్వచ్ఛమైన సాగరం, సురక్షితమైన సాగరం అనే పేరుతో ఒక ప్రయత్నం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. జూలై 5వ తేదీన ప్రారంభమైన ఈ పథకానికి సంబంధించిన ప్రయత్నాలుగడచిన సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి రోజున సఫలమయ్యాయి. ఆ రోజు కోస్టల్ క్లీనింగ్ అప్ డే కూడా. స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో మొదలైన ఈ యుద్ధం 75 రోజుల పాట నడిచింది. దీంట్లో జన భాగ్యస్వామ్యం పెద్ద ఎత్తున ఉంటోంది. ఈ ప్రయోగం వల్ల దాదాపుగా నెలన్నర ముంచీ పరిశుభ్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాల్ని చూడడం జరిగింది. గోవాలో ఓ పెద్ద మానవ హారాన్ని రూపొందించారు. కాకినాడలో గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా జనానికి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు.

NSSకి చెందిన దాదాపు 5000 మంది సోదర సోదరీమణులు 30 టన్నులకంటే ఎక్కువ ప్లాస్టిక్ ని సేకరించారు. ఒడిషాలో మూడు రోజుల్లోనే 20 వేలమంది కంటే ఎక్కువ మంది విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛమైన సాగరం – సురక్షితమైన సాగరం కోసం వాళ్లు వాళ్లతోపాటుగా వాళ్ల కుటుంబాల్ని, చుట్టుపక్కల వాళ్లనందర్నీ ప్రేరేపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Elected Officials, ప్రభుత్వంలోని నగరాల్లోని మేయర్లు, గ్రామాల్లోని సర్పంచులతో నేను మాట్లాడినప్పుడు నేను వాళ్లకి ఓ మాట తప్పక చెబుతాను. స్వచ్ఛతకోసం చేస్తున్న ఈ యజ్ఞంలో స్థానిక సంస్థల ప్రతినిధులను, స్థానికుల్ని కూడా భాగస్వాముల్ని చెయ్యాలని ఇన్నోవేటివ్ తరహాలో పనులు చెయ్యమని చెబుతుంటాను.

బెంగళూరులో ఓ టీమ్ ఉంది - Youth For Parivarthan– యూత్ ఫర్ పరివర్తన్. గడచిన ఎనిమిది సంవత్సరాలుగా ఈ టీమ్ స్వచ్ఛతకోసం అదే విధంగా ఇతర సామాజిక అంశాలకోసం చాలా పరిశ్రమ చేస్తోంది.  వాళ్ల మోటో చాలా స్పష్టంగా ఉంది. 'Stop Complaining, Start Acting'. ఈ టీమ్ నగరంలోని దాదాపు 370 ప్రాంతాల్లో సుందరంగా తీర్చిదిద్దింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ Youth For Parivarthanఅనే సంస్థలో వంద నుంచి నూట యాభైమంది సభ్యులు చేరారు. ప్రతి ఆదివారం వీళ్లీ పని మొదలుపెడతారు. మధ్యాహ్నం వరకూ చేస్తారు. ఈ పనిలో చెత్తను ఎలాగూ ఏరి పారేస్తారు. దాంతోపాటుగా పెయింటింగ్ అలాగే Artistic Sketches వేసే పని కూడా జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో వీళ్లు సుప్రసిద్ధులైన వ్యక్తుల మాటల్ని, వాళ్ల ఇన్స్పిరేషనల్ కొటేషన్లని కూడా మీరు చూడొచ్చు. బెంగుళూరులో Youth For Parivarthanచేసిన ప్రయత్నాల తర్వాత మీకు నేను మీరట్ కి చెందిన కబాడ్ సే జుగాడ్ ('कबाड़सेजुगाड़') పథకం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ పథకం పర్యావరణ పరిరక్షణతోపాటుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పని కూడా చేస్తోంది. ఈ యుద్ధంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో లోహ వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్, పాత టైర్లు, అలాగే డ్రమ్ములు లాంటి  పాడైపోయిన వస్తువుల్ని ఉపయోగిస్తున్నారు.

తక్కువ ఖర్చుతో సామాజిక స్థలాలను సుందరంగా తీర్చిదిద్దడం ఎలాగో చూపించేందుకు ఈ ప్రయత్నాన్నికూడా మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రయత్నాలు చేపట్టిన వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.

ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు దేశంలో అన్నిచోట్లా ఉత్సవాల వెలుగులు కనిపిస్తున్నాయి. రేపు నవరాత్రుల్లో మొదటి రోజు. ఈ రోజున మనం అమ్మవారి మొదటి స్వరూపమైన శైలపుత్రిని ఆరాధిస్తాం. ఇక్కడ్నుంచి తొమ్మిది  రోజులపాటు నియమబద్ధులమై, ఉపవాసం ఉంటూ, తర్వాత విజయ దశమి పండుగను జరుపుకుంటాం. అంటే ఓ విధంగా మన రక్తంలో భక్తి మరియు ఆధ్యాత్మికతలతోకూడన ఎంతటి నిగూఢమైన సందేశం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. నియమబద్ధమైన ప్రణాళికతో సిద్ధిని పొందడానికి ఆ తర్వాత విజయదశమి పండుగ జరుపుకోవడం, ఈ రెండూ జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించుకునే మార్గాలు అవుతాయి. దసరా తర్వాత ధన త్రయోదశి, దీపావళి పండుగలు కూడా వస్తాయి.

మిత్రులారా, కొద్ది సంవత్సరాలుగా మన పండుగలకు ఓ సరికొత్త సంకల్పాన్నికూడా జోడించుకున్నాం. మీకందరికీ తెలిసిన విషయమే, ఆ సంకల్పం ఏంటంటే - 'Vocal for Local' అనే సంకల్పం. ఇప్పడు మనం పండుగల సంతోషంలో మన local పౌరుల్ని, శిల్పకారుల్ని, వ్యాపారుల్ని కూడా కలుపుకుంటున్నాం. రాబోయే అక్టోబర్ 2వ తేదీన బాపూజీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చెయ్యాలని మనం సంకల్పించుకోవాలి. ఒకవేళ handloom, handicraft లాంటి ప్రాడక్ట్ లన్నింటినీ కలుపుకునే మీరు సామాన్లు కొనుక్కోండి. అసలు ఈ పండుగకు నిజమైన ఆనందం ఎప్పుడంటే ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగం అయినప్పుడే, అందుకే స్థానిక ప్రాడక్టులకు సంబంధించిన వాళ్లందరికీ మనం మద్దతివ్వాలి.

చాలా మంచి పని ఏంటంటే, పండుగల్లో మనం ఏ గిఫ్ట్ లు ఇచ్చినా సరే, వాటిలో ఇలాంటి ప్రాడక్ట్ లను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పథకానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే స్వాతంత్ర్య అమృత కాలంలోకి అడుగుపెట్టేటప్పటికల్లా మనం స్వయం సమృద్ధ భారతాన్ని సాధించాలని కలలుగంటున్నాం కాబట్టి. ఓ విధంగా చూస్తే మనకి ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన వాళ్లకు ఇదే నిజమైన శ్రద్ధాంజలి అవుతుంది. అందుకోసం నేను మీకు ఏం చెప్పదలచుకున్నానంటే, ఈసారి ఖాదీ, handloom లేదంటే handicraft లాంటి ప్రాడక్టుల్ని కొనడంలో మీరు అన్ని రికార్డుల్నీ అధిగమించాలి. మనం చూస్తున్నాం పండుగల్లో packingకి అలాగే packaging కోసం polythene bagsని విరివిగా ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛతకోసం తపిస్తున్న ఈ సందర్భంలో polythene వల్ల నష్టం కలిగించే చెత్త మన పండుగ వాతావరణాన్ని పాడు చేస్తుంది. అందుకోసం మనం స్థానికంగా తయారైన non-plastic బ్యాగుల్ని మాత్రమే ఉపయోగించాలి. మన దగ్గర జూట్ వి, నారవి, అరటి నారతో చేసినవి ఇలాంటి సంప్రదాయికమైన వస్తువులతో చేసిన బ్యాగుల ఉపయోగం చాలా బాగా పెరుగుతోంది. పండుగల్లో వీటిని విరివిగా వాడి వీటి తయారీని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. అలాగే స్వచ్ఛత అంటే మన ఆరోగ్యంతోపాటుగా పర్యావహరణ హితాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రియమైన దేశవాసులారా, మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే – పరహిత్ సరిస్ ధర్మ నహీ భాయీ అని చెబుతున్నాయి. అంటే ఇతరులకు మేలు చెయ్యడం కంటే మించిన ధర్మం, ఇతరులకు సేవ చేయడం కంటే మించిన ధర్మం, సాయం చెయ్యడాన్ని మించిన ధర్మం మరొకటి లేదని. గడచిన రోజుల్లో దేశంలో సమాజ సేవకు సంబంధించి ఓ ఉదాహరణను మనం చూడగలిగాం. మీరుకూడా చూసే ఉంటారు. జనం ముందుకొచ్చి టీబీతో బాధపడుతున్న రోగుల్ని దత్తత తీసుకుంటున్నారు. వాళ్లకి పౌష్టిక ఆహారం అందించే బాధ్యతను స్వీకరిస్తున్నారు. నిజానికి ఇదికూడా టీబీ విముక్త భారత దేశం అనే పథకంలో ఒక భాగమే. దీంట్లో జనం భాగస్వాములవుతున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సరైన పోషణ లభిస్తేనే సరైన సమయంలో వేసుకున్న మందులు టీబీని తగ్గించగలుగుతాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, భక్తితో కూడిన ఈ జన భాగస్వామ్యం వల్ల 2025వ సంవత్సరానికల్లా భారత దేశం టీబీనుంచి పూర్తిగా విముక్తి పొందుతుంది.

మిత్రలారా, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ అలాగే డామన్ ద్వీపంలో కూడా నాకు అలాంటి ఒక ఉదాహరణ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. అక్కడున్న ఆదీవాసీ ప్రాంతాల్లో నివశించే జినూ రావతీయ్ గారు నాకేమని లేఖ రాశారంటే అక్కడ గ్రామాలను దత్తత చేసుకునే కార్యక్రమం నడుస్తోందట, దానిద్వారా Medical college students 50 గ్రామాలను దత్తత చేసుకున్నారట. వాటిలో జిన్ గారి గ్రామం కూడా ఉందట. ఆ మెడికల్ విద్యార్థులు రోగాల బారిన పడకుండా ఆయా గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారట. జబ్బు చేసిన వాళ్లకు సాయం కూడా చేస్తున్నారట. అలాగే ప్రభుత్వ పథకాల గురించి కూడా వివరిస్తున్నారట. పరోపకారమనే ఈ భావన గ్రామాల్లో నివశిస్తున్నవారి జీవితాల్లో తప్పక సంతోషాన్ని నింపుతుంది. నేను దీనికి medical college విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రలారా, మనసులో మాటలో మనం కొత్త కొత్త విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సందర్భాల్లో మనకి ఈ సందర్భంగా పాత విషయాల గురించి చాలా లోతుగా ఆలోచించే అవకాశం కూడా కలుగుతోంది. కిందటి నెల మనసులో మాటలో నేను తృణ ధాన్యాల గురించి అలాగే 2023ని'International Millet Year' గా మనం జరుపుకోవాలని చెప్పాను. ఈ విషయం మీద జనం చాలా ఆసక్తి చూపించారు. నాకు దాని గురించి ఎన్నో లేఖలొచ్చాయి. వాటిలో జనం ఏం చెబుతున్నారంటే, వాళ్లు ఏ విధంగా మిల్లెట్స్ ని దైనందిన ఆహారంలో భాగంగా స్వీకరిస్తున్నారో చెబుతున్నారు. కొందరైతే మిల్లెట్స్ తో తయారు చేసే సంప్రదాయబద్ధమైన ఆహార పదార్ధాల గురించి కూడా చెప్పారు. ఇది ఒక చాలా పెద్ద మార్పుకు సంకేతం. జనానికి ఉన్న ఈ ఉత్సాహాన్ని చూసి నాకేమనిపిస్తోందంటే మనందరం కలిసి దీనిమీద ఓ ఈ బుక్ ని తయారు చేస్తే బాగుంటుంది. దాంట్లో మనం మిల్లెట్లతో తయారు చేసుకునే dishes గురించి అలాగే మనందరి అనుభవాల గురించి వివరించడం బాగుంటుంది. దానివల్ల International Millet Year ప్రారంభం కావడానికి ముందే మన దగ్గర millets కి సంబంధించిన ఒక public encyclopaediaకూడా తయారవుతుంది. మనం దాన్ని MyGov portalలో కూడా పబ్లిష్ చెయ్యొచ్చు.

మిత్రులారా, మనసులో మాటలో ఈసారి ఈ విషయాలు చాలు, కానీ సెలవు తీసుకోవడానికి ముందు నేను మీకు మన National Games గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. సెప్టెంబర్ 29వ తేదీనుంచి గుజరాత్ లో National Games కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఇది మనకి మహత్తరమైన అవకాశం. ఎందుకంటే మనం చాలా ఏళ్ల తర్వాత National Gamesని ఏర్పాటు చేసుకుంటున్నాం. కోవిడ్ మహమ్మారి వల్ల కిందటి సారి ఈ ఆటల పోటీలను రద్దు చెయ్యాల్సొచ్చింది. ఈ ఆటల పోటీల్లో పాల్గొనబోతున్న ఆటగాళ్లందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేందుకు నేనివ్వాళ్ల వాళ్లందరి మధ్యే ఉంటాను. మీరందరూ కూడా National Games ని తప్పకుండా follow అవ్వండి. అలాగే మన ఆటగాళ్లకి ఆత్మ స్థైర్యాన్ని పెంచండి. ఇంక నేను ఇవ్వాళ్టికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చేనెల మనసులో మాటలో కొత్త విషయాలతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదాలు. నమస్కారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi