‘Mann Ki Baat’ has become a wonderful medium for expression of public participation: PM Modi
A few days ago, ‘Ustad Bismillah Khan Yuva Puraskar’ was conferred. These awards were given away to emerging, talented artists in the field of music and performing arts: PM Modi
In our fast-moving country, the power of Digital India is visible in every corner: PM Modi
Tele-consultants using e-Sanjeevani app has crossed the figure of 10 crores: PM Modi
Many countries of the world are drawn towards India’s UPI. Just a few days ago, UPI-PayNow Link has been launched between India and Singapore: PM Modi
'Tribeni Kumbho Mohotshav' was organized in Bansberia of Hooghly district in West Bengal: PM Modi in Mann Ki Baat
Swachh Bharat Abhiyan has changed the meaning of public participation in our country: PM Modi
'Waste to Wealth' is also an important dimension of the Swachh Bharat Abhiyan: PM Modi

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. 'మన్ కీ బాత్' 98వ ఎపిసోడ్‌లో మీ అందరితో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. వందో భాగం దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని వ్యక్తపరిచేందుకు అద్భుతమైన వేదికగా'మన్ కీ బాత్'నుమీరందరూమార్చుకున్నారు.  ప్రతి నెలాలక్షల్లో వచ్చే సందేశాల్లో చాలా మంది మనసులో మాట- మన్ కీ బాత్- నాకు చేరుతుంది. మీ మనస్సు శక్తి మీకు తెలుసు. అదేవిధంగాసమాజ శక్తితో దేశం శక్తి ఎలా పెరుగుతుందో మనం'మన్ కీ బాత్' కార్యక్రమంలోని వివిధ భాగాలలో చూశాం. అర్థం చేసుకున్నాం. ఇది నేను అనుభవించాను. స్వీకరించాను. 'మన్ కీ బాత్'లో భారతీయసంప్రదాయ క్రీడలను ప్రోత్సహించే విషయం మాట్లాడిన రోజు నాకు గుర్తుంది. ఆ సమయంలో- వెంటనే-భారతీయ క్రీడలతో అనుసంధానమయ్యేందుకు, వాటిని ఆస్వాదించేందుకు, నేర్చుకునేందుకు దేశంలో ఒక చైతన్యం పెల్లుబికింది. 'మన్ కీ బాత్'లో భారతీయ బొమ్మల గురించి మాట్లాడినప్పుడుదేశ ప్రజలు దాన్ని కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు భారతీయ బొమ్మల విషయంలో విదేశాల్లో కూడా పెరుగుతున్న డిమాండ్ వాటిపై పెరుగుతోన్న వ్యామోహాన్ని తెలియజేస్తుంది.  మనం'మన్ కీ బాత్'లో భారతీయ కథా శైలి గురించి మాట్లాడినప్పుడువాటి కీర్తి కూడా చాలా దూరం వెళ్ళింది. భారతీయ కథా కథనాల వైపు ప్రజలు మరింతగా ఆకర్షితులవుతున్నారు.

మిత్రులారా!సర్దార్ పటేల్ జయంతి – అంటే 'ఐక్యతా దినోత్సవం' సందర్భంగా మనం'మన్ కీ బాత్'లో మూడు పోటీల గురించి మాట్లాడుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. దేశభక్తి గీతాలు, లాలి పాటలు, ముగ్గులకు సంబంధించిన పోటీలవి. దేశవ్యాప్తంగా 700లకు పైగా జిల్లాల నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు- అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని 20కి పైగా భాషల్లో తమ ఎంట్రీలను పంపారు.ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ఛాంపియన్, కళా సాధకులు. మన దేశంలోని వైవిధ్యం, సంస్కృతి పట్ల ప్రేమను మీరందరూ నిరూపించారు.

        మిత్రులారా!ఈ సందర్భంగా నాకు లతా మంగేష్కర్ గారు- లతా దీదీ గుర్తుకు రావడం చాలా సహజం. ఎందుకంటే ఈ పోటీ ప్రారంభమైన రోజులతా దీదీ ట్వీట్ చేసి, ఖచ్చితంగా ఈ పోటీల్లో పాల్గొనాలని దేశ ప్రజలను కోరారు.

మిత్రులారా!లాలిపాటల రచన పోటీలో ప్రథమ బహుమతిని కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన బి.ఎం. మంజునాథ్‌ పొందారు. కన్నడలో రాసిన ‘మలగు కంద’ అనే లాలిపాటకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. తన తల్లి,నానమ్మ పాడిన లాలి పాటల నుండి ఆయన దీన్ని రాసేందుకు ప్రేరణ పొందారు. ఇది విని మీరు కూడా ఆనందిస్తారు.

(కన్నడసౌండ్ క్లిప్ – 35 సెకన్లు- తెలుగు అనువాదం)

"నిదురపో.. నిదురపో.. నా చిట్టి పాపా!

నా తెలివైన ప్రియతమా… నిదురపో

రోజు గడిచిపోయింది

చీకటై పోయింది

నిద్రాదేవి వస్తుంది-

నక్షత్రాల తోట నుండి,

కలలను కోసుకొస్తుంది

నిదురపో.. నిదురపో..

జోజో...జో..జో..

జోజో...జో..జో.."

 

అస్సాంలోని కామరూప్ జిల్లాకు చెందిన దినేష్ గోవాలా ఈ పోటీలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన రాసిన లాలిపాటలో స్థానిక మట్టి, లోహ పాత్రలను తయారు చేసే కళాకారుల ప్రసిద్ధ చేతిపనుల ముద్ర ఉంది.

 

(అస్సామీస్ సౌండ్ క్లిప్ – 35 సెకన్లు- తెలుగు అనువాదం)

 

సంచి తెచ్చాడుకుమార్ దాదా

సంచిలో ఏముంది?

కుమ్మరి సంచి తెరిచి చూస్తే

సంచిలో ఉంది అందమైన గిన్నె!

మా బొమ్మ కుమ్మరిని అడిగింది

ఈ చిన్న గిన్నె ఎలా ఉందని!

 

గీతాలు, లాలిపాటల్లా ముగ్గుల పోటీ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో పాల్గొన్నవారు ఒకరికి మించి మరొకరు అందమైన ముగ్గులను పంపారు. ఇందులో పంజాబ్‌కు చెందిన కమల్ కుమార్ గారు విజేతగా నిలిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమర వీరుడు భగత్ సింగ్ ల చాలా అందమైన రంగోలీని కమల్ కుమార్ గారు తయారు చేశారు.మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన సచిన్ నరేంద్ర అవ్సారి గారు జలియన్ వాలా బాగ్- దాని ఊచకోత, షహీద్ ఉధమ్ సింగ్ ధైర్యాన్ని తన రంగోలీలో ప్రదర్శించారు. గోవా నివాసి గురుదత్ వాంటెకర్ గారు- గాంధీజీ రంగోలీని తయారుచేశారు. పుదుచ్చేరికి చెందిన మాలతీసెల్వం గారు కూడా ఎందరో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులపై దృష్టి సారించారు.

దేశభక్తి గీతాల పోటీ విజేత టి. విజయ దుర్గ గారు ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు. ఆమె తెలుగులో తన ఎంట్రీని పంపారు. ఆమె తన ప్రాంతంలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి గారి నుండి ఎంతో ప్రేరణ  పొందారు. విజయ దుర్గ గారి ఎంట్రీలోని ఈ భాగాన్ని కూడా మీరు వినండి.

(Telugu Sound Clip (27 seconds) HINDI అనువాదానికి తెలుగు రూపం)(ఇది బహుశా అవసరం ఉండదు)

రేనాడు ప్రాంత వీరా!

ఓ వీర నరసింహా!

భారత స్వాతంత్ర్య పోరాటానికి అంకురానివి!

అంకుశానివి!

ఆంగ్లేయుల అన్యాయమైన

నిరంకుశ దమన కాండను చూసి

మీ రక్తం మండింది

మంటలు లేచాయి!

రేనాడు ప్రాంత వీరా!

ఓ వీర నరసింహా!

తెలుగు తర్వాత ఇప్పుడు మైథిలిలో ఓ క్లిప్ వినిపిస్తాను. దీన్ని దీపక్ వత్స్ గారు పంపారు. ఆయన కూడా ఈ పోటీలో బహుమతి కూడా గెలుచుకున్నారు.

(మైథిలి సౌండ్ క్లిప్ – 30 సెకన్లు- తెలుగు అనువాదం)

సోదరా!

ప్రపంచానికే గర్వకారణం భారతదేశం

మన దేశం మహోన్నతం

మూడు వైపులా సముద్రం

ఉత్తరాన బలంగా కైలాసం

గంగాయమునకృష్ణకావేరి,

జ్ఞానంసంపత్తి రూపాలు

సోదరా!

మన దేశం గొప్పది

త్రివర్ణ పతాకంలో జీవం ఉంది

 

మిత్రులారా! ఇదిమీకు నచ్చిందని ఆశిస్తున్నాను. పోటీలో వచ్చిన ఎంట్రీల జాబితా చాలా పెద్దది. మీరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ కుటుంబంతో కలిసి వాటిని చూడండి- వినండి. మీరు చాలా స్ఫూర్తిని పొందుతారు.

నా ప్రియమైన దేశప్రజలారా!బనారస్ గురించి అయినా, షెహనాయ్ గురించి అయినా, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జీ గురించి అయినా, నా దృష్టి అటువైపు వెళ్ళడం సహజం. కొద్ది రోజుల క్రితం 'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలు’ ఇచ్చారు. సంగీతం, ప్రదర్శన కళల రంగంలో వర్ధమాన, ప్రతిభావంతులైన కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ కళాకారులు కళ, సంగీత ప్రపంచానికి ఆదరణ పెంచడంతో పాటు, వారు దాని అభ్యున్నతికి కూడా కృషి చేస్తున్నారు. కాలక్రమేణా జనాదరణ తగ్గుతున్న వాయిద్యాలకు కొత్త వైభవాన్ని ఇచ్చిన కళాకారులు కూడా వీరిలో ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఈ ట్యూన్ ని శ్రద్ధగా వినండి...

(సౌండ్ క్లిప్ (21 సెకన్లు) వాయిద్యం- 'సుర్ సింగార్', కళాకారుడు -జాయ్‌దీప్ ముఖర్జీ)

ఇది ఏ వాయిద్యమో మీకు తెలుసా? మీకు తెలియకపోవచ్చుకూడా! ఈ వాయిద్య మంత్రం పేరు 'సుర్ సింగార్'. ఈ ట్యూన్‌ను జాయ్‌దీప్ ముఖర్జీ గారు స్వరపరిచారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారంతో సన్మానితులైన యువకుల్లో జాయ్‌దీప్ గారు కూడా ఉన్నారు. 50వ,60వ దశాబ్దాల నుండి ఈ వాయిద్యం ట్యూన్లను వినడం చాలా అరుదుగా మారింది. అయితే 'సుర్ సింగార్'ను మళ్లీ పాపులర్ చేయడానికి జాయ్‌దీప్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

అదేవిధంగాకర్నాటక వాద్య సంగీత విభాగంలోని మాండలిన్‌లో ఈ అవార్డును పొందిన సోదరి ఉప్పలపు నాగమణి గారి కృషి కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఇందులోసంగ్రామ్ సింగ్ సుహాస్ భండారే గారు వార్కారీ కీర్తనకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ జాబితాలో సంగీత కళాకారులు మాత్రమే కాదు – వి. దుర్గా దేవి గారు 'కరకట్టం' అనే ప్రాచీన నృత్య రూపానికి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన మరో విజేత రాజ్ కుమార్ నాయక్ గారు తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజుల పాటు పేరిణి ఒడిస్సీని నిర్వహించారు.పేరిణి రాజ్‌కుమార్‌ అనే పేరుతో ప్రజలకు సుపరిచితులయ్యారు. కాకతీయ రాజుల కాలంలో శివునికి అంకితమిచ్చిన పేరిణి నాట్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రాజవంశ మూలాలు నేటి తెలంగాణకు సంబంధించినవి. మరో పురస్కార విజేత సాయిఖౌమ్ సురచంద్రాసింగ్ గారు. మైతేయీ పుంగ్ వాద్యాన్ని తయారు చేయడంలో సుప్రసిద్ధులు. ఈ పరికరం మణిపూర్‌కు చెందింది.పూరన్ సింగ్ ఒక దివ్యాంగ కళాకారుడు. రాజూలా-మలుషాహి, న్యౌలీ, హుడ్కా బోల్,జాగర్ వంటి వివిధ సంగీత రూపాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. వాటికి సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్‌లను కూడా సిద్ధం చేశారు. పూరన్ సింగ్ గారు ఉత్తరాఖండ్ జానపద సంగీతంలో తన ప్రతిభను కనబరిచి అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు.సమయ పరిమితి కారణంగాఅవార్డు గ్రహీతలందరి గురించి నేను ఇక్కడ మాట్లాడలేకపోవచ్చు. కానీ మీరు ఖచ్చితంగా వారి గురించి చదువుతారని నాకు విశ్వాసం ఉంది. ప్రదర్శన కళలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ కళాకారులందరూ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! వేగంగా పురోగమిస్తున్న మన దేశంలోడిజిటల్ ఇండియా శక్తి ప్రతి మూలలోనూ కనిపిస్తుంది. డిజిటల్ ఇండియా శక్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లడంలో వివిధ యాప్‌లు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి ఒక యాప్ ఇ-సంజీవని. ఈ యాప్ నుండి టెలి-కన్సల్టేషన్ చేయవచ్చు. అంటే దూరంగా కూర్చొనివీడియో కాన్ఫరెన్స్ ద్వారామీరు మీ అనారోగ్యం గురించి వైద్యుడిని సంప్రదించవచ్చు. ఇప్పటి వరకుఈ యాప్‌ను ఉపయోగిస్తున్న టెలి-కన్సల్టెంట్ల సంఖ్య 10 కోట్లుదాటింది. మీరు ఊహించవచ్చు- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 కోట్ల సంప్రదింపులంటే ఎంత పెద్ద గెలుపో! రోగికి- వైద్యుడికి మధ్య అద్భుతమైన సంబంధం - ఇది ఒక పెద్ద విజయం. ఈ విజయానికి గాను వైద్యులను, ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నరోగులందరినీ నేను అభినందిస్తున్నాను. భారతదేశంలోని ప్రజలు సాంకేతికతను తమ జీవితంలో ఎలా భాగం చేసుకున్నారో చెప్పేందుకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ.

కరోనా సమయంలోఇ-సంజీవని యాప్ ద్వారా టెలి-కన్సల్టేషన్ ప్రజలకు  గొప్ప వరమని నిరూపితమైంది. దీని గురించి 'మన్ కీ బాత్'లో డాక్టర్ తో, రోగితోమాట్లాడి, చర్చించి, విషయాన్ని మీకు తెలియజేయాలని నేను కూడా ఆలోచించాను. టెలి-కన్సల్టేషన్ ప్రజలకు ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుసుకునేందుకు మనంప్రయత్నిద్దాం. సిక్కింకు చెందిన డాక్టర్ మదన్ మణి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డా. మదన్ మణి సిక్కింకు చెందినవారైనా  ధన్‌బాద్‌లో ఎంబీబీఎస్ చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎండీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వందలాది మందికి టెలి-కన్సల్టేషన్ ఇచ్చారు.

 

ప్రధానమంత్రి: నమస్కారం...నమస్కారం మదన్ మణి గారూ..

 

డాక్టర్ మదన్ మణి: నమస్కారం సార్.

 

ప్రధాని: నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను.

 

డాక్టర్ మదన్ మణి: సార్... సార్

 

ప్రధాని: మీరు బనారస్‌లో చదువుకున్నారు కదా.

 

డాక్టర్ మదన్ మణి:అవును సార్..నేను బనారస్‌లో చదువుకున్నాను సార్.

 

ప్రధాని: మీ వైద్య విద్యాభ్యాసం  అక్కడే జరిగింది.

డాక్టర్ మదన్ మణి: అవును సార్.. అవును.

ప్రధానమంత్రి: కాబట్టి మీరు బనారస్‌లో ఉన్నప్పటి బనారస్ ను, ఇప్పుడు మారిన బనారస్ తో పోల్చి చూసేందుకు ఎప్పుడైనా వెళ్లారా?

 

డాక్టర్ మదన్ మణి: ప్రధానమంత్రి సార్.. సిక్కింకు తిరిగి వచ్చినప్పటి నుండి నేను వెళ్లలేకపోయాను. కానీ చాలా మార్పు వచ్చిందని నేను విన్నాను.

ప్రధానమంత్రి: మీరు బనారస్ వదిలిపెట్టి  ఎన్ని సంవత్సరాలైంది?

డా. మదన్ మణి: నేను 2006లో బనారస్ వదిలి వెళ్ళాను సార్.

ప్రధాని: ఓహ్... ఐతే మీరు తప్పకుండా వెళ్లాలి.

డాక్టర్ మదన్ మణి: అవును సార్... అవును.

 

ప్రధాన మంత్రి: సరే, మీరు సుదూర పర్వతాలలో నివసిస్తూ సిక్కిం ప్రజలకు టెలి-సంప్రదింపుల గొప్ప సేవలను అందిస్తున్నందుకు నేను మీకు ఫోన్ చేశాను.

 

డాక్టర్ మదన్ మణి: సార్..

ప్రధానమంత్రి: నేను మీ అనుభవాన్ని 'మన్ కీ బాత్' శ్రోతలకు  పంచుకోవాలనుకుంటున్నాను.

 

డాక్టర్ మదన్ మణి: సార్.

 

ప్రధానమంత్రి: కొంచెం నాకు చెప్పండి.. మీ అనుభవం ఎలా ఉంది?

 

డాక్టర్ మదన్ మణి: అనుభవం.. చాలా గొప్ప అనుభవం ప్రధానమంత్రి గారూ.  సిక్కింలోని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి కూడా ప్రజలు వాహనం ఎక్కి కనీసం ఒకటి నుండి రెండు వందల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్లాలి. అక్కడ డాక్టర్ ఉండవచ్చు.. ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక సమస్య. టెలి కన్సల్టేషన్ ద్వారా ప్రజలు నేరుగా మాతో- సుదూర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల సి. హెచ్. ఓ. లు వారిని మాతో కనెక్ట్ చేస్తారు. వారు వారి పాత వ్యాధుల రిపోర్ట్స్,  ప్రస్తుత పరిస్థితి- ఇలా ప్రతిదీ మాకు చెప్తారు.

ప్రధానమంత్రి: అంటే డాక్యుమెంట్స్ ని పంపిస్తారన్నమాట.

 

డాక్టర్ మదన్ మణి: అవును సార్.. అవును. వారు డాక్యుమెంట్స్ పంపుతారు. పంపలేకపోతే చదివి మాకు చెబుతారు.

 

ప్రధాని: అక్కడి వెల్‌నెస్‌ సెంటర్‌ డాక్టర్‌ చెప్తారా.

 

డాక్టర్ మదన్ మణి: అవును సార్. వెల్నెస్ సెంటర్‌లో ఉండే సి. హెచ్. ఓ. -కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాకు చెప్తారు.

 

ప్రధాని: పేషెంట్స్ వారి సమస్యలను మీకు నేరుగా చెప్తారు కదా.

డాక్టర్ మదన్ మణి: అవును... పేషెంట్ తన సమస్యల గురించి కూడా చెప్తాడు. ఆ తర్వాత పాత రికార్డులు చూసిన తర్వాత ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే- ఉదాహరణకుకాళ్ల వాపు ఉందో లేదో చూడటానికి అతని ఛాతీని ఆస్కల్టేట్ చేయాలి. సి.హెచ్.ఓ గారు అప్పటివరకు చూడకపోతే  వాపు ఉందో లేదో చూడమని, కళ్లను చూడమని, రక్తహీనత ఉందో లేదో చూడమని చెప్తాం. దగ్గు ఉంటే ఛాతీని ఆస్కల్టేట్ చేయమని చెప్తాం. అక్కడ ధ్వనులు వినిపిస్తాయో లేదో చూడమంటాం.

 

ప్రధానమంత్రి: మీరు వాయిస్ కాల్ ద్వారా మాట్లాడతారా లేదా వీడియో కాల్‌ని కూడా ఉపయోగిస్తున్నారా?

 

డాక్టర్ మదన్ మణి: అవును సార్.. మేం వీడియో కాల్ ఉపయోగిస్తాం.

ప్రధానమంత్రి: కాబట్టి మీరు కూడా రోగిని చూస్తారు.

 

డాక్టర్ మదన్ మణి: రోగిని కూడా చూడగలం సార్.

 

ప్రధానమంత్రి: రోగికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది?

 

డాక్టర్ మదన్ మణి: రోగి డాక్టర్‌ని దగ్గరగా చూడగలడు కాబట్టి రోగికి అది నచ్చుతుంది. సిక్కింలో చాలా మంది రోగులు మధుమేహం, రక్తపోటుతో ఉన్నవారుంటారు. మందు పరిమాణం తగ్గించాలా, పెంచాలా అనే విషయంలో వారు సందిగ్ధంలో ఉంటారు.  మధుమేహం, రక్తపోటుకు మందు మార్చడానికి డాక్టర్ ని సంప్రదించేందుకు ఎంతోదూరం వెళ్లాల్సి వస్తుంది. కానీ టెలి కన్సల్టేషన్ ద్వారా అక్కడే వైద్యుడి సలహా సంప్రదింపులు లభిస్తాయి. ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల్లో ఉచిత మందుల పథకం ద్వారా ఔషధం కూడా అందుబాటులో ఉంటుంది. అందుకని అక్కడి నుండే మందు తీసుకుంటారు.

ప్రధానమంత్రి: సరే మదన్ మణి గారూ.. మీకు తెలుసు... డాక్టర్ వచ్చేంతవరకు, డాక్టర్ తనను చూసేంతవరకు పేషెంట్ సంతృప్తి చెందడు. రోగిని చూడవలసి ఉంటుందని డాక్టర్ కూడా భావిస్తాడు. ఇప్పుడు అక్కడ అన్ని సంప్రదింపులు ఆన్ లైన్లో జరుగుతాయికాబట్టి వైద్యుడికి ఏమనిపిస్తుంది, రోగికి ఏమనిపిస్తుంది?

 

డాక్టర్ మదన్ మణి: అవును సార్. రోగికి డాక్టర్‌ని చూడాలని అనిపిస్తే రోగిని చూడాలని మాకు కూడా అనిపిస్తుంది. మేం  చూడాలనుకున్నవి ఏవైనా సి. హెచ్. ఓ. గారికి చెప్పడం ద్వారావీడియోలో చూస్తాం. మరి కొన్ని సార్లు వీడియోలోనే పేషెంట్ మాకు దగ్గరగా వచ్చి చూపిస్తారు. ఉదాహరణకు ఎవరికైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మాకు వీడియో ద్వారానే చూపిస్తారు. కాబట్టి వారు సంతృప్తిగా ఉంటారు.

ప్రధాన మంత్రి: వారికి చికిత్స చేసిన తర్వాతవారు సంతృప్తి చెందుతారా? వారు ఎలాంటి అనుభూతి పొందుతారు? పేషెంట్స్ కు బాగవుతుందా?

 

డాక్టర్ మదన్ మణి: అవును సార్.. చాలా సంతోషం కలుగుతుంది. మాకు కూడా ఆనందంగా ఉంటుంది సార్. నేను ప్రస్తుతం ఆరోగ్యశాఖలో ఉన్నాను. ఏకకాలంలో టెలి-కన్సల్టేషన్ చేస్తూఫైల్‌తో పాటు రోగిని చూడటం నాకు చాలా మంచి, ఆహ్లాదకరమైన అనుభవం.

ప్రధానమంత్రి: సగటునమీకు టెలి కన్సల్టేషన్ కేసులు ఎన్ని వస్తాయి?

డాక్టర్ మదన్ మణి: నేను ఇప్పటివరకు 536 మంది రోగులను చూశాను.

 

ప్రధానమంత్రి: ఓ... అంటే మీరు చాలా పట్టు సాధించారు.

 

డాక్టర్ మదన్ మణి: అవును సార్. పేషెంట్లను చూడడం బాగుంటుంది.

ప్రధానమంత్రి: సరే.. మీకు శుభాకాంక్షలు. ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారామీరు సిక్కింలోని మారుమూల అడవుల్లో, పర్వతాల్లో నివసించే ప్రజలకు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. మన దేశంలోని సుదూర ప్రాంతాల్లో కూడా సాంకేతికతను ఇంత చక్కగా వినియోగించుకోవడం సంతోషించదగ్గ విషయం. మీకు చాలా చాలా అభినందనలు.

 

డా. మదన్ మణి: ధన్యవాదాలు సార్!

మిత్రులారా! ఇ-సంజీవని యాప్ ఎలా సహకరిస్తుందో డాక్టర్ మదన్ మణి గారి మాటలను బట్టి అర్థమవుతుంది. డాక్టర్ మదన్ గారి తర్వాతఇప్పుడు మనం మరో మదన్ గారితో కలుద్దాం. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా నివాసి మదన్ మోహన్ లాల్ గారు. చందౌలీ కూడా బనారస్ పక్కనే ఉండడం కూడా కాకతాళీయమే. ఇ-సంజీవని గురించి రోగిగా ఆయన అనుభవం ఏమిటో మదన్ మోహన్ గారి నుండి తెలుసుకుందాం.

 

ప్రధానమంత్రి  గారు: మదన్ మోహన్ గారూ.. నమస్కారం..

 

మదన్ మోహన్ గారు: నమస్కారం.. నమస్కారం సార్.

 

ప్రధానమంత్రి  గారు:  నమస్కారం!మీరు డయాబెటిక్ పేషెంట్ అని నాకు చెప్పారు.

 

మదన్ మోహన్ గారు: అవును సార్ .

ప్రధానమంత్రి  గారు: మీరు సాంకేతికతను ఉపయోగించి టెలి-కన్సల్టేషన్ ద్వారా మీ అనారోగ్యానికి సంబంధించి సహాయం తీసుకుంటున్నారు.

మదన్ మోహన్ జీ: అవును సార్.

 

ప్రధాన మంత్రి: ఒక రోగిగామీ అనుభవాలను వినాలనుకుంటున్నాను. తద్వారా మన గ్రామాల్లో నివసించే ప్రజలు నేటి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చోదేశప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు చెప్పండి..

మదన్ మోహన్ జీ: చాలా ఇబ్బందిగా ఉండేది సార్.. ఆసుపత్రులు చాలా దూరంగా ఉన్నాయి. డయాబెటిస్ వచ్చినప్పుడుచికిత్స చేయించుకోవడానికి ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సివచ్చేది. అక్కడ  చూపించుకోవాల్సివచ్చేది. మీరు ఏర్పాటు చేసిన కొత్త పద్ధతిలో మమ్మల్ని బయటి డాక్టర్లతో మాట్లాడిస్తారు. మందులు కూడా ఇస్తారు. దీని వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది. అందరూ దీని వల్ల ప్రయోజనం పొందుతారు.

ప్రధానమంత్రి: మిమ్మల్నిప్రతిసారీ ఒకే డాక్టర్ చూస్తారా లేదా డాక్టర్లు మారుతూ ఉంటారా?

మదన్ మోహన్ గారు: వారికి తెలియకపోతే మరో డాక్టర్ కి చూపిస్తారు. వాళ్ళే  మాట్లాడి, మరొక వైద్యుడితో మాట్లాడేలా చేస్తారు.

ప్రధాన మంత్రి: అయితే వైద్యులు మీకు అందించే మార్గదర్శకత్వం నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతారన్నమాట.

 

మదన్ మోహన్ జీ: మాకు లాభం కలుగుతుంది సార్. దాని వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంది. గ్రామ ప్రజలు కూడా దీని నుండి ప్రయోజనం పొందుతారు. అక్కడ అందరూ అడుగుతారు-మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, టెస్ట్ చేయండి,చెక్ చేయండి, మందు చెప్పండి- అని. మరి ఇంతకుముందు ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. పొడవాటి లైన్లు, పాథాలజీలో కూడా లైన్లు ఉండేవి. రోజు మొత్తం సమయం వృథా అవుతూ ఉండేది.

ప్రధానమంత్రి: అంటే మీ సమయం కూడా ఆదా అవుతుంది.

 

మదన్ మోహన్ జీ: అప్పుడు డబ్బు కూడా ఖర్చయ్యేది. ఇక్కడ అన్ని సేవలను ఉచితంగా చేస్తున్నారు.

 

ప్రధాని: సరే... ముందు డాక్టర్‌ని చూడగానే ఒక నమ్మకం ఏర్పడుతుంది. “డాక్టర్ నా నాడిని పరీక్షించాడు.. నా కళ్ళు, నా నాలుక కూడా చెక్ చేశాడు” అనే అనుభూతి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు టెలి కన్సల్టేషన్ చేసినా మీకు అంతే సంతృప్తి వస్తుందా?

మదన్ మోహన్ జీ: అవును సార్. సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మన నాడి పట్టుకుంటున్నట్టు, సముచితమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మాకుచక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఇంత మంచి ఏర్పాటు మీరు చేసినందుకుచాలా సంతోషంగా ఉంటున్నాం. కష్టపడి వెళ్ళవలసి వచ్చేది. వాహనం ఛార్జీలు ఇవ్వాల్సి వచ్చేది. అక్కడ లైన్లో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్ని సౌకర్యాలు పొందుతున్నాం.

ప్రధానమంత్రి: సరే.. మదన్ మోహన్ గారూ.. నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వయస్సులో కూడామీరు సాంకేతికతను నేర్చుకున్నారు. సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు.  ఇతరులకు కూడా చెప్పండి. దానిద్వారా ప్రజల సమయం ఆదా అవుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. వారికి మార్గదర్శకత్వం లభించడంతో మందులు కూడా సరియన విధంగా ఉపయోగించుకోవచ్చు.

మదన్ మోహన్ జీ: అవును సార్ మరి

ప్రధానమంత్రి: సరే.. మదన్ మోహన్ గారూ... మీకు చాలా చాలా  శుభాకాంక్షలు.

మదన్ మోహన్ జీ: సార్.. మీరు బనారస్ ను కాశీ విశ్వనాథ్ స్టేషన్‌ గా మార్చారు. దాన్ని అభివృద్ధి చేశారు. మీకు మా అభినందనలు.

 

ప్రధానమంత్రి: మీకు ధన్యవాదాలు. మనం ఏం చేశాం.. బనారస్ ప్రజలు బనారస్ ను అభివృద్ధి చేశారు. లేకుంటే గంగామాతకి సేవ చేయమని గంగామాత పిలిచింది. అంతేతప్ప మరేమీ కాదు. సరే .. మీకు చాలా చాలా శుభాకాంక్షలు. నమస్కారం!

 

మదన్ మోహన్ జీ: నమస్కారం సార్!

 

ప్రధానమంత్రి: నమస్కారం!

మిత్రులారా!దేశంలోని సామాన్యులకు, మధ్యతరగతి వారికి, కొండ ప్రాంతాలలో నివసించే వారికి ప్రాణాలను రక్షించే యాప్‌గాఇ-సంజీవని మారుతోంది. భారతదేశ డిజిటల్ విప్లవ శక్తి ఇది. మనం ప్రతి రంగంలో దాని ప్రభావాన్ని చూస్తున్నాం. భారతదేశ యూపీఐ శక్తి కూడామీకు తెలుసు. ప్రపంచంలోని అనేక దేశాలు దీని వైపు ఆకర్షితులవుతున్నాయి.

కొన్ని రోజుల కిందటభారతదేశం, సింగపూర్ మధ్య యూపీఐ- పే నౌ లింకు ప్రారంభమైంది. ఇప్పుడుసింగపూర్, భారతదేశంలోని ప్రజలు తమ మధ్య తమ దేశాలలో చేసే విధంగానే తమ మొబైల్ ఫోన్ల నుండి డబ్బును బదిలీ చేస్తున్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతదేశం ఇ-సంజీవని యాప్ అయినా యూపీఐ అయినాజీవన సౌలభ్యాన్ని పెంచడంలో చాలా సహాయకారిగా నిరూపితమయ్యాయి. 

నా ప్రియమైన దేశప్రజలారా!ఒక దేశంలో అంతరించిపోతున్న ఒక జాతి పక్షిని గానీజంతువును గానీ రక్షించినప్పుడుఅది ప్రపంచమంతటా చర్చనీయాంశమౌతుంది. మనదేశంలో కనుమరుగైపోయిప్రజల మనసుల్లోంచి, హృదయాల్లోంచి దూరమైన గొప్ప సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రజా భాగస్వామ్య శక్తితో వాటిని పునరుద్ధరించేందుకు జరుగుతున్న  ప్రయత్నాలను చర్చించేందుకు 'మన్ కీ బాత్'కి మించిన వేదిక ఏముంటుంది?

ఇప్పుడు నేను మీకు ఏమి చెప్పబోతున్నానో తెలుసుకుంటేమీరు నిజంగా సంతోషిస్తారు. మీ వారసత్వ సంపద గురించి గర్వపడతారు. అమెరికాలో నివసిస్తున్న కంచన్ బెనర్జీ గారువారసత్వ పరిరక్షణకు సంబంధించిన అటువంటి ప్రచారం ద్వారా నా దృష్టిని ఆకర్షించారు. నేను ఆయనను అభినందిస్తున్నాను. మిత్రులారా!ఈ నెలలో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా బాన్స్‌బేరియాలో 'త్రిబేని కుంభో మోహోత్సవ్' నిర్వహించారు.ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు ఇందులో పాల్గొన్నారు.  ఇంత విశిష్టత ఎందుకో తెలుసా? ముఖ్యంగాఈ ఆచారాన్ని 700 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించారు. ఈ సంప్రదాయం వేల సంవత్సరాల నాటిది అయినప్పటికీ, దురదృష్టవశాత్తు బెంగాల్‌లోని త్రిబేనిలో జరిగే ఈ పండుగను700 సంవత్సరాల క్రితం నిలిపివేశారు. స్వాతంత్య్రానంతరం ప్రారంభించాల్సింది. కానీ అది కూడా కుదరలేదు. రెండేళ్ల కిందట ఈ పండుగస్థానిక ప్రజల ద్వారా,'త్రిబేని కుంభో పారిచాలోనాశామితి' ద్వారా మళ్లీ ప్రారంభమైంది. దీనితో అనుబంధం ఉన్న వ్యక్తులందరినీ నేను అభినందిస్తున్నాను. మీరు సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడమే కాదు- భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కాపాడుతున్నారు.

మిత్రులారా!పశ్చిమ బెంగాల్‌లోని త్రిబేని శతాబ్దాలుగా పవిత్ర ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. వివిధ మంగళకావ్యాల్లోనూవైష్ణవ సాహిత్యంలోనూశాక్త సాహిత్యంలోనూ ఇతర బెంగాలీ సాహిత్య రచనల్లోనూ దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు సంస్కృతం, విద్య , భారతీయ సంస్కృతికి కేంద్రంగా ఉండేదని వివిధ చారిత్రక పత్రాల ద్వారా తెలుస్తోంది. మాఘ సంక్రాంతిలో కుంభస్నానానికి పవిత్ర స్థలంగాదీన్నిచాలా మంది సాధువులు భావిస్తారు.త్రిబేనిలోఅనేక గంగా ఘాట్‌లను, శివాలయాలను, టెర్రకోట వాస్తు కళతో అలంకృతమైన పురాతన భవనాలను చూడవచ్చు. త్రిబేని వారసత్వ పునఃస్థాపనకు, కుంభ సంప్రదాయ వైభవ పునరుద్ధరణకు గత ఏడాది ఇక్కడ కుంభమేళా నిర్వహించారు. ఏడు శతాబ్దాల తరువాతమూడు రోజుల కుంభ మహాస్నానాలు, జాతర ఈ ప్రాంతంలో కొత్త శక్తిని నింపాయి. మూడు రోజుల పాటు ప్రతిరోజూ జరిగే గంగా హారతి, రుద్రాభిషేకం, యజ్ఞంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వివిధ ఆశ్రమాలు, మఠాలు, అఖాడాలు కూడా ఈసారి ఉత్సవంలోపాల్గొన్నాయి.బెంగాలీ సంప్రదాయాలకు సంబంధించినకీర్తన, బౌల్, గోడియో నృత్యాలు, శ్రీ-ఖోల్ జానపద వాద్య సంగీతం, పోటర్ గీతాలు, ఛౌ నాట్యాల వంటి వివిధ కళా ప్రక్రియలు సాయంత్రం కార్యక్రమాల్లో ఆకర్షణగా నిలిచాయి.దేశంలోని బంగారు గతంతో మన యువతను అనుసంధానం చేయడానికి ఇది చాలా అభినందనీయమైన ప్రయత్నం. భారతదేశంలో ఇలాంటి అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి. వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాటి గురించిన చర్చ ఖచ్చితంగా ఈ దిశగా ప్రజలను ప్రేరేపించగలదని నేను ఆశిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! మన దేశంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ప్రజల భాగస్వామ్యం అనే అర్థమే మారిపోయింది. దేశంలో ఎక్కడైనా పరిశుభ్రతకు సంబంధించిన అంశం ఏదైనా ఉంటేప్రజలు దాని గురించి ఖచ్చితంగా నాకు తెలియజేస్తారు. ఇలాగేహర్యానా యువత స్వచ్ఛత ప్రచారంపై నా దృష్టిని ఆకర్షించింది. హర్యానాలో దుల్హేడి  అనే ఒక గ్రామం ఉంది. పరిశుభ్రత విషయంలో భివానీ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఇక్కడి యువకులు  నిర్ణయించారు. ‘యువ స్వచ్ఛత ఏవం జన్ సేవా సమితి’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.  ఈ కమిటీతో సంబంధం ఉన్న యువకులు తెల్లవారుజామున 4 గంటలకు భివానీకి చేరుకుంటారు. వీరంతా కలిసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో క్లీన్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. వీళ్ళంతా ఇప్పటివరకు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి టన్నుల కొద్దీ చెత్తను తొలగించారు.

మిత్రులారా! స్వచ్ఛ భారత్ అభియాన్‌లో వేస్ట్ టు వెల్త్ కూడా ఒక ముఖ్యమైన అంశం. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో కమలా మోహరానా అనే సోదరి స్వయం సహాయక సంఘాన్ని నిర్వహిస్తోంది. ఈ సమూహంలోని మహిళలు పాల సంచులు, ఇతర ప్లాస్టిక్ ప్యాకింగ్‌లతో బుట్టలు, మొబైల్ స్టాండ్‌ల వంటి అనేక వస్తువులను తయారు చేస్తారు. పరిశుభ్రతతో పాటు వారికి మంచి ఆదాయ వనరుగా కూడా ఇది మారుతోంది. మనం దృఢ సంకల్పంతో ఉంటే స్వచ్ఛ భారత్‌కు పెద్దపీట వేయగలం. కనీసం ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో బట్టతో చేసిన బ్యాగులు ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. మీ ఈ తీర్మానం మీకు ఎంత సంతృప్తిని ఇస్తుందో, ఇతర వ్యక్తులకు ఎంత స్ఫూర్తినిస్తుందో మీరు తప్పకుండా  చూస్తారు.

నా ప్రియమైన దేశప్రజలారా!ఈ రోజు మీరు, నేను కలిసి అనేక ప్రేరణాత్మకమైన అంశాలపై మరోసారి మాట్లాడుకున్నాం. మీరు కుటుంబంతో కూర్చొని విన్నారు.  ఇప్పుడు రోజంతా ఈ ధ్యానంలోనే ఉంటారు. దేశం కృషి గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత శక్తి వస్తుంది. ఈ శక్తి ప్రవాహంతో కదులుతూ కదులుతూఈ రోజు మనం 'మన్ కీ బాత్' 98వ భాగం  దశకు చేరుకున్నాము. హోలీ పండుగ ఇప్పటి నుండి కొన్ని రోజులే ఉంది. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. వోకల్ ఫర్ లోకల్ అనే తీర్మానంతో మన పండుగలు జరుపుకోవాలి. మీ అనుభవాలను కూడా నాతో పంచుకోవడం మర్చిపోవద్దు. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. వచ్చేసారి కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi