మన్ కి బాత్, డిసెంబర్ 2023

Published By : Admin | December 31, 2023 | 11:30 IST
In 108 episodes of Mann Ki Baat, we have seen many examples of public participation and derived inspiration from them: PM Modi
Today every corner of India is brimming with self-confidence, imbued with the spirit of a developed India; the spirit of self-reliance: PM Modi
This year, our country has attained many special achievements, including the passage of Nari Shakti Vandan Adhiniyam, India becoming the 5th largest economy, and success at the G20 Summit: PM
Record business on Diwali proved that every Indian is giving importance to the mantra of ‘Vocal For Local’: PM Modi
India becoming an Innovation Hub is a symbol of the fact that we are not going to stop: PM Modi
Today there is a lot of discussion about physical health and well-being, but another important aspect related to it is that of mental health: PM Modi
Nowadays we see how much talk there is about Lifestyle related Diseases, it is a matter of great concern for all of us, especially the youth: PM Modi

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని కలిసేందుకు ఒక శుభ అవకాశం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం. మీ తో, మీ కుటుంబ సభ్యుల తో ఈ కార్యక్రమం లో భేటీ అయినప్పుడు చాలా ఆహ్లాదకరం గాను, సంతృప్తికరం గాను ఉంటుంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుస్తుంటే నా అనుభూతి ఇలాగే ఉంటుంది. ఈ రోజు న మనం కలసి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణం లో ఇది 108 వ భాగం. 108 సంఖ్య కు గల ప్రాముఖ్యం, పవిత్రత లు అనేవి ఇక్కడ గాఢమైనటువంటి అధ్యయన అంశం. జపమాల లో 108 పూస లు, 108 సారుల జపం, 108 దివ్య క్షేత్రాలు, ఆలయాల లో 108 మెట్లు, 108 గంట లు.. ఈ 108 సంఖ్య అపారమైన విశ్వాసం తో ముడిపడి ఉంది. అందుకే ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం 108 వ భాగం నాకు మరింత ప్రత్యేకం గా మారింది. ఈ 108 భాగాల లో ప్రజల భాగస్వామ్యాని కి సంబంధించినటువంటి ఉదాహరణల ను మనం అనేకం గా చూశాం. వారి నుండి ప్రేరణ ను పొందాం. ఇప్పుడు ఈ మైలురాయి ని చేరుకొన్న తరువాత కొత్త శక్తి తో, కొత్త ఉత్సాహం తో, వేగం గా ముందుకు వెళ్లాలని మనం నిర్ణయించుకోవాలి. సంతోషకరమైన యాదృచ్ఛిక విషయం ఏమిటంటే రేపటి సూర్యోదయం 2024 వ సంవత్సరం లో మొదటి సూర్యోదయం కావడం. రేపటి రోజు న మనం 2024 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాం. 2024 వ నూతన సంవత్సర సందర్భం లో మీ అందరి కి ఇవే శుభాకాంక్ష లు.

 

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.

 

మిత్రులారా, నేటికీ చాలా మంది చంద్రయాన్-3 సాఫల్యానికి సంబంధించిన సందేశాల ను నాకు పంపుతూ ఉన్నారు. నాలాగే మీరు కూడా మన శాస్త్రవేత్త ల విషయం లో, ముఖ్యంగా మహిళా శాస్త్రవేత్త ల విషయం లో గర్వపడుతున్నారు అని నేను నమ్ముతున్నాను.

 

మిత్రులారా, ‘నాటు-నాటు’ పాట కు ఆస్కర్‌ పురస్కారం లభించినప్పుడు యావత్తు దేశం సంతోషం తో ఉప్పొంగిపోయింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దక్కిన సమ్మానాన్ని గురించి విన్నప్పుడు సంతోషించనిది ఎవరు? వీటి ద్వారా భారతదేశం యొక్క సృజనాత్మకత ను ప్రపంచం గమనించింది. పర్యావరణం తో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని అర్థం చేసుకుంది. ఈ సంవత్సరం లో క్రీడల లో కూడా మన క్రీడాకారిణులు, క్రీడాకారులు అద్భుతం గా రాణించారు. మన క్రీడాకారులు ఆసియా క్రీడల లో 107 పతకాల ను, ఆసియా పేరా గేమ్స్‌ లో 111 పతకాల ను గెలిచారు. క్రికెట్ ప్రపంచ కప్‌ లో భారతదేశం క్రీడాకారులు వారి ఆటతీరు తో అందరి హృదయాల ను గెలుచుకొన్నారు. అండర్-19 టి-20 ప్రపంచ కప్‌ లో మన మహిళా క్రికెట్ జట్టు యొక్క గెలుపు చాలా ప్రేరణ ను అందించేదే. అనేక క్రీడల లో భారతీయులు సాధించినటువంటి విజయాలు దేశాని కి పేరు ప్రతిష్టల ను పెంచివేశాయి. ఇప్పుడు 2024 లో పేరిస్ ఒలింపిక్స్ ను నిర్వహించడం జరుగుతుంది. దీని కోసం యావత్తు దేశం మన ఆటగాళ్ల లో ను ప్రోత్సహిస్తోంది.

 

మిత్రులారా, మనమంతా కలసికట్టుగా ప్రయత్నాల ను చేసినప్పుడల్లా అది మన దేశ అభివృద్ధి ప్రయాణం పైన చాలా సానుకూల ప్రభావాన్ని ప్రసరించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘మేరీ మాటీ మేరా దేశ్’ ల వంటి విజయవంతమైన ప్రచారాలు మన అనుభవం లోకి వచ్చాయి. ఇందులో కోట్ల కొద్దీ ప్రజల భాగస్వామ్యాని కి మనమంతా సాక్షులం. డెబ్భయ్ వేల అమృత సరోవరాల నిర్మాణం కూడా మన సామూహిక కార్యసాధన యే.

 

మిత్రులారా, ఆవిష్కరణల కు ప్రాముఖ్యాన్ని ఇవ్వనటువంటి దేశం యొక్క అభివృద్ధి ఆగిపోతుంది అని నేను నమ్ముతాను. భారతదేశం ఇనొవేశన్ హబ్‌ గా మారడం మన ప్రగతి ప్రయాణం ఆగేది కాదు అనే విషయాని కి సంకేతం. గ్లోబల్ ఇనొవేశన్ ఇండెక్స్‌ లో 2015వ సంవత్సరం లో మనం 81 వ స్థానం లో ఉన్నాం. ప్రస్తుతం ఈ సూచిక లో మనది 40వ స్థానంగా ఉంది.

 

ఈ సంవత్సరం భారతదేశం లో దాఖలు చేసిన పేటెంట్ ల సంఖ్య ఎక్కువ గా ఉంది. వీటిలో దాదాపు అరవై శాతం దేశీయ నిధుల కు సంబంధించినవే. ఈసారి క్యూఎస్ ఏశియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ లో అత్యధిక సంఖ్య లో భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు ను దక్కించుకున్నాయి. మీరు ఈ కార్యసాధన ల జాబితా ను రూపొందించడం మొదలుపెట్టారా అంటే అది ఎప్పటికీ పూర్తి కాదు. భారతదేశం సామర్థ్య ప్రభావాని కి ఇది ఒక సంగ్రహావలోకనం మాత్రమే. మన దేశం సాధించిన ఈ సాఫల్యాల నుండి, దేశ ప్రజల ఈ సాఫల్యాల నుండి మనం ప్రేరణ ను పొందాలి. వారి విషయం లో గర్వపడాలి. కొత్త సంకల్పాల ను చెప్పుకోవాలి. 2024వ సంవత్సరానికి గాను మరో సారి మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

 

నా కుటుంబ సభ్యులారా, భారతదేశం విషయం లో ప్రతి చోటా ఉన్న ఆశ ను గురించి, ఉత్సాహాన్ని గురించి మనం చర్చించాం. ఈ ఆశ, ఈ నమ్మకం చాలా బాగున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందితే యువతీయువకుల కు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. కానీ యువత దృఢం గా ఉన్నప్పుడే దాని వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.

 

ఈ రోజుల్లో జీవన విధానాల కు సంబంధించిన వ్యాధుల ను గురించి ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇది మనందరికీ- ముఖ్యంగా యువతకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం ఫిట్ ఇండియా కు సంబంధించిన అంశాల ను పంపవలసింది గా మీ అందరినీ కోరాను. మీ స్పందన నాలో ఉత్సాహాన్ని నింపింది. పెద్ద సంఖ్య లో స్టార్ట్- అప్‌స్ కూడా నమో యాప్‌ (NaMo App) పై తమ సూచనల ను నాకు పంపించాయి. స్టార్ట్- అప్‌స్ వాటి యొక్క అనేక ప్రత్యేక ప్రయాసల ను గురించి చర్చించాయి.

 

మిత్రులారా, భారతదేశం చేసిన ప్రయత్నాల కారణం గా 2023 వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీ అన్న) సంవత్సరం’ గా జరుపుకొన్నాం. ఇది ఈ రంగం లో పని చేస్తున్న స్టార్ట్- అప్‌ స్ కు చాలా అవకాశాల ను అందించింది. వీటి లో లఖ్ నవూ లో ప్రారంభం అయినటువంటి ‘కీరోజ్ ఫూడ్స్’, ప్రయాగ్‌రాజ్‌ కు చెందిన ‘గ్రాండ్-మా మిలిట్స్’, ‘న్యూట్రస్యూటికల్ రిచ్ ఆర్గానిక్ ఇండియా’ ల వంటి అనేక స్టార్ట్- అప్‌స్ ఉన్నాయి. ఆల్పినో హెల్త్ ఫూడ్స్, అర్బోరియల్ , కీరోజ్ ఫూడ్స్ తో ముడిపడ్డ యువతీ యువకులు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల కు సంబంధించినటువంటి క్రొత్త ఆవిష్కరణల ను చేస్తున్నారు. బెంగళూరు లోని అన్‌బాక్స్ హెల్థ్ తో జతపడ్డ యువతీ యువకులు వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఎంచుకోవడం లో ప్రజల కు ఎలా యపడుతున్నదీ తెలిపారు. శారీరిక స్వస్థత పై ఆసక్తి పెరుగుతూ ఉండడం తో ఆ రంగాని కి సంబంధించిన కోచ్‌ ల డిమాండు కూడా పెరుగుతున్నది. ‘జోగో టెక్నాలజీస్’ వంటి స్టార్ట్- అప్‌ స్ ఈ డిమాండు ను తీర్చడం లో సహాయ పడుతున్నాయి.

 

మిత్రులారా, ఈ రోజు శారీరిక ఆరోగ్యాన్ని గురించిన, శ్రేయం ను గురించిన చర్చలు అనేకం జరుగుతున్నాయి. అయితే దానితో సంబంధం ఉన్న మరో ముఖ్యమైన అంశం మానసిక ఆరోగ్యం. మానసిక స్వస్థత అనేది శ్రేయాన్ని మెరుగుపరచడానికి ముంబయి కి చెందిన ‘ఇన్ఫీ-హీల్’, ‘యువర్‌దోస్త్’ ల వంటి స్టార్ట్- అప్‌ స్ పనిచేస్తున్నాయని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. అంతే కాదు. నేడు కృత్రిమ మేధ (ఎఐ) వంటి సాంకేతికత ను కూడా దీని కోసం ఉపయోగిస్తున్నారు. మిత్రులారా, స్టార్ట్- అప్‌ స్ జాబితా చాలా పెద్దది. అందువల్ల నేను ఇక్కడ కొన్ని స్టార్ట్- అప్‌ స్ పేరుల ను మాత్రమే చెప్పగలను. ఫిట్ ఇండియా కల ను సాకారం చేసే దిశగా వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సంబంధి స్టార్ట్- అప్‌ స్ ను గురించి నాకు వ్రాస్తూ ఉండండి అంటూ మీ అందరి ని నేను కోరుతున్నాను. శారీరిక స్వస్థత ను గురించి, మానసిక ఆరోగ్యాన్ని గురించి మాట్లాడే ప్రసిద్ధ వ్యక్తుల అనుభవాల ను కూడా మీకు తెలియజేయాలనుకొంటున్నాను.

 

ఈ క్రింది మొదటి సందేశాన్ని సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి నుండి వినండి. దృఢత్వం- ముఖ్యం గా మానసిక దృఢత్వం- అంటే మానసిక ఆరోగ్యాన్ని గురించి వారు వారి యొక్క అభిప్రాయాల ను వెల్లడిస్తారు..

 

***ఆడియో***

‘‘మానసిక ఆరోగ్యాన్ని గురించి ఈ మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కార్యక్రమం లో మాట్లాడటం నా అదృష్టం. మానసిక అనారోగ్యాలుమన నాడీ వ్యవస్థ ను మనం చూసుకొనే విధానం నేరు గా సంబంధం కలిగి ఉంటాయి. నాడీ వ్యవస్థ ను మనం ఎంత అప్రమత్తం గాచంచల రహితం గాఅలజడులనేవి లేకుండా ఉంచుతాం అనే విషయంపై మనలో మనం ఎంత ఆహ్లాదకరం గా ఉంటాం అనే అంశం ఆధార పడుతుంది. మనం శాంతిప్రేమఆనందంప్రసన్నతవేదననిస్పృహపారవశ్యం అని పిలిచే వాటికి రసాయననాడీ సంబంధి మూలాలు ఉంటాయి. తప్పనిసరి గా బయటి నుండి రసాయనాల ను జోడించడం ద్వారా శరీరం లోని రసాయన అసమతుల్యత ను పరిష్కరించడానికి ఫార్మకాలజీ ప్రయత్నిస్తుంది. మానసిక అనారోగ్యాల ను ఈ విధం గా నియంత్రించ గలుగుతున్నాం. అయితే తీవ్రమైన పరిస్థితి లో ఉన్నప్పుడు బయటి నుండి రసాయనాల ను మందుల రూపం లో తీసుకోవడం అవసరం అని మనం గ్రహించాలి. అంతర్గత మానసిక ఆరోగ్య స్థితి కోసం పనిచేయడం లేదా మనలో ఒక సమతుల్య రసాయన స్థితి కోసం పనిచేయడంశాంతిఆనందంసంతోషాల కోసం రసాయనాల ను ప్రతి వ్యక్తి జీవితం లోకి తీసుకు రావాలి. సమాజ సాంస్కృతిక జీవితం లోకిప్రపంచవ్యాప్తం గా ఉన్న దేశాల లోకిమొత్తం మానవాళి కి తీసుకు రావాలి. మన మానసిక ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన చిత్తశుద్ధి అనేది సున్నితమైన ప్రత్యేకత. మనం దానిని రక్షించాలి. దానిని పెంపొందించుకోవాలి. దీని కోసం యోగ వ్యవస్థ లో అనేక స్థాయి ల అభ్యాసాలు ఉన్నాయి. ఇవి సాధారణ అభ్యాసాలు గా పూర్తి గా అంతర్గతీకరించ గలిగేవి. వీటితో ప్రజలు వారిలో వారు రసాయనిక సమతాస్థితి ని పొందవచ్చు. వారి యొక్క నాడీ వ్యవస్థ కు కొంత ప్రశాంతత ను తీసుకు రావచ్చును. అంతర్గత శ్రేయస్సు ను కల్పించే సాంకేతికతల ను మనం యోగిక్ సైన్సెస్ అని పిలుస్తాం. అది జరిగేలా చూద్దాం.’’

 

సద్గురు జీ ఆయన యొక్క అభిప్రాయాల ను ఇంత సులభ గ్రాహ్య శైలి లో, అద్భుతమైన విధానం లో అందించడం లో ప్రసిద్ధి చెందారు.

 

రండి… ఇప్పుడు మనం ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి హర్ మన్‌ప్రీత్ కౌర్ గారి యొక్క మాటల ను విందాం.

 

***ఆడియో***

  • నమస్కారం. మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం మాధ్యం ద్వారా నా దేశ ప్రజల కు ఒక విషయాన్ని చెప్పాలి అనుకొంటున్నాను. గౌరవనీయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమం నా ఫిట్‌నెస్ మంత్రాన్ని మీ అందరి తో పంచుకొనేటట్టు నన్ను ప్రోత్సహించింది. మీ అందరికి నా మొదటి సూచన ఏమిటంటే‘చెడు ఆహారం తీసుకుంటూ ఉత్తమ శిక్షణ ను పొందజాలరు’ అనేదేఅంటే మీరు ఎప్పుడు తింటారు ? ఏమి తింటారు? అనే విషయాల లో చాలా జాగ్రత గా ఉండాలి. ఇటీవల మాన్య ప్రధాన మంత్రి మోదీ గారు ప్రతి ఒక్కరి ని చిరుధాన్యాలు తినవలసిందంటూ ప్రోత్సహించారు. ఇవి సులభం గా జీర్ణమవుతాయి. రోగనిరోధక శక్తి ని పెంచుతాయి. స్థిరమైన కృషి చేయడం లో సాయపడుతాయి. క్రమబద్ధమైన వ్యాయామం తో పాటు గా ఏడు గంట ల సేపు పూర్తి నిద్ర అనేవి శరీరాని కి చాలా ముఖ్యం. ఫిట్‌ గా ఉండటానికి ఇవి తోడ్పడుతాయి. దీనికోసం చాలా క్రమశిక్షణస్థిరత్వం లు అవసరం. మీరు దీని నుండి ఫలితాల ను పొందితే ప్రతి రోజూ వ్యాయామం చేయడం మొదలుపెడతారు. మీ అందరి తో మాట్లాడటానికినా ఫిట్‌నెస్ మంత్రాన్ని వెల్లడించడానికి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు గౌరవనీయ ప్రధాన మంత్రి గారికి చాలా ధన్యవాదాలు.’’

 

హర్ మన్‌ ప్రీత్ గారు వంటి ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి ఆడిన మాట లు మీ అందరికీ తప్పక స్ఫూర్తి ని ఇవ్వగలవు.

రండి... గ్రాండ్‌ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారి మాటల ను వినండి. ఆయన ఆడే ‘చదరంగం’ ఆట కు మానసిక దృఢత్వం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు.

 

***ఆడియో***

 

‘‘నమస్తే. నేను విశ్వనాథన్ ఆనంద్‌ ని. నేను చదరంగం ఆడడాన్ని మీరు చూశారు. నా ఫిట్‌నెస్ కారణం ఏమిటి అని చాలా తరచు గా నన్ను అడుగుతూ ఉంటారు. చదరంగం ఆడేందుకు చాలా శ్రద్ధ మరియు సహనం అవసరం. కాబట్టి నేను ఇప్పుడు చెప్పే వాటిని చేస్తాను. అవి నన్ను ఫిట్‌ గానుచురుగ్గాను ఉంచుతాయి. నేను వారాని కి రెండు సార్లు యోగ చేస్తాను. వారాని కి రెండు సార్లు కార్డియో వ్యాయామాలు చేస్తానుఫ్లెక్సిబిలిటీస్ట్రెచింగ్వెయిట్ ట్రైనింగ్‌లపై వారానికి రెండు సార్లు దృష్టి పెడతాను. వారాని కి ఒక రోజు సెలవు తీసుకుంటాను. చదరంగాని కి ఇవి అన్నీ చాలా ముఖ్యమైనవి. మీరు 6గంటలు లేదా 7 గంటల పాటు తీవ్రమైన మానసిక శ్రమ ను కొనసాగించే శక్తి ని కలిగి ఉండాలి. మీరు హాయి గాసౌకర్యవంతం గా కూర్చో గలగాలి. మీరు చదరంగం లాంటి ఆట లో ఏదైనా సమస్య పైన దృష్టి ని సారించాలనుకొన్నప్పుడు ప్రశాంతం గా ఉండడానికి మీ శ్వాస నియంత్రణ సామర్థ్యం అనేది సహాయపడుతుంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతలు అందరి కి నా ఫిట్‌నెస్ చిట్కా ఏమిటంటే ప్రశాంతం గా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలి. నా విషయం లో మంచి ఫిట్‌నెస్ చిట్కా- ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైన ఫిట్‌నెస్ చిట్కా- సుఖవంతమైన రాత్రి నిద్ర. రాత్రి కి కేవలం నాలుగైదు గంటలు మాత్రమే నిద్ర పోవడం అనేది సరి కాదు. కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు ఉత్తమం అని నేను అనుకొంటున్నాను. కాబట్టి మనం రాత్రి పూట మంచి నిద్ర ను పొందడానికి వీలు అయినంతగా ప్రయత్నించాలి. అలా నిద్ర పోతేనే మరుసటి రోజు లో పగటిపూట ను మీరు ప్రశాంతం గా గడప గలుగుతారు. అలా నిద్ర పోయారంటే మీరు అనాలోచిత నిర్ణయాల ను తీసుకోరు. మీ భావోద్వేగాల ను అదుపులో పెట్టుకో గలుగుతారు. నా దృష్టి లో నిద్ర అత్యంత ముఖ్యమైన ఫిట్‌నెస్ చిట్కా.’’

 

 

రండి... ఇప్పుడు మనం అక్షయ్ కుమార్ గారి మాటల ను విందాం.

 

***ఆడియో***

 

‘‘నమస్కారం. నేను అక్షయ్ కుమార్‌ ని. ముందుగా మన ఆదరణీయ ప్రధాన మంత్రి గారి కి నేను చాలా కృతజ్ఞతల ను తెలియజేస్తున్నాను. ఆయన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మీకు నా మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) ను చెప్పే చిన్న అవకాశం లభించింది. ఫిట్‌ నెస్‌ పై ఎంత ఆసక్తి నాలో ఉందో అంతకంటే ఎక్కువ గా సహజం గా ఫిట్‌ గా ఉండేందుకు ఆసక్తి ని కనబరుస్తానని మీకు తెలుసిందే. ఫ్యాన్సీ జిమ్ కంటే ఎక్కువ గా నాకు నచ్చేది బయట స్విమ్మింగ్ చేయడంబాడ్ మింటన్ ఆడడంమెట్లు ఎక్కడంముగ్దర్ తో కసరత్తు లు చేయడంమంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. స్వచ్ఛమైన నేతి ని సరి అయిన పరిమాణం లో తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది అని కూడా నేను నమ్ముతాను. కానీ చాలా మంది అబ్బాయి లుచాలా మంది అమ్మాయి లు లావు అవుతాం అని భయపడి నెయ్యి తినకుండా ఉండడం నేను చూస్తున్నాను. మన ఫిట్‌నెస్‌ కు ఏది మంచిదోఏది చెడ్డదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సినీ నటుల శరీరాన్ని చూసి కాకుండా వైద్యుల సలహా మేరకు జీవనశైలి ని మార్చుకోవాలి. నటీనటులు తరచు గా తెరపై కనిపించేలా ఉండరు. అనేక రకాల ఫిల్టర్ లనుస్పెశల్ ఎఫెక్ట్ లను ఉపయోగించడం జరుగుతుంది. వాటిని చూసిన తరువాత మన శరీరాన్ని మార్చుకోవడానికి అడ్డదారుల ను ఉపయోగించడం ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో చాలా మంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ కు గాని లేదా యైట్ ప్యాక్ కు గాని ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. మిత్రులారా, అటువంటి అడ్డదారుల తో శరీరం బయటి నుండి చూడడానికి ఉబ్బుతుంది. కానీ లోపల డొల్ల గా ఉంటుంది. సత్వర మార్గం మీ జీవిత కాలాన్ని చిన్నది గా మారుస్తుంది అని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీకు అడ్డదారులు వద్దు. దీర్ఘకాలం ఉండే ఫిట్‌నెస్ కావాలి. మిత్రులారా, ఫిట్‌నెస్ ఒక రకమైన తపస్సు. ఇన్ స్టాంట్ కాఫీ నోరెండు నిమిషాల లో తయారు అయ్యే నూడుల్సో కాదు. రసాయనాల ను ఉపయోగించబోమనిసత్వర మార్గాల వ్యాయామం చేయబోమనియోగ, మంచి ఆహారంసమయానికి నిద్ర పోవడంకొంత ధ్యానం చేయడంలతో పాటు ముఖ్యం గా మీరు కనిపించే తీరు ను సంతోషం గా అంగీకరించడం వంటివి చేస్తామని ఈ కొత్త సంవత్సరం లో వాగ్దానం చేసుకోండి. ఇప్పటి నుండి ఫిల్టర్ జీవితాన్ని గడపకండి. ఫిట్టర్ జీవితాన్ని గడపండి. సురక్షితం గా ఉండండి. జయ్ మహాకాల్.’’

 

ఈ రంగం లో అనేక ఇతర స్టార్ట్- అప్‌ స్ ఉన్నాయి. కాబట్టి ఈ రంగం లో అద్భుతమైన పని చేస్తున్న యువ స్టార్ట్- అప్‌ వ్యవస్థాపకుడి తో చర్చించాలని అనుకున్నాను.

 

***ఆడియో***

‘‘నమస్కారం. నా పేరు రుషభ్ మల్హోత్రా. నేను బెంగళూరు లో ఉంటాను. మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఫిట్‌నెస్ ను గురించి చర్చ జరుగుతోంది అని తెలిసి చాలా సంతోషం గా ఉంది. నేనే ఫిట్‌నెస్ ప్రపంచాని కి చెందిన వాడి ని. బెంగళూరు లో మాకు తగ్ డా రహో’ పేరు తో స్టార్ట్-అప్‌ ఉంది. భారతదేశం సాంప్రదాయిక వ్యాయామాని కి ప్రాధాన్యాన్ని కల్పించేందుకు మా స్టార్ట్-అప్‌ ను ప్రారంభించాం. భారతదేశం సాంప్రదాయిక వ్యాయామం అయినటువంటి ‘గదా వ్యాయామం’ లో చాలా అద్భుతమైన వ్యాయామం ఉంది. మా దృష్టి మొత్తం గదముగ్దర్ ల వ్యాయామం పైన మాత్రమే ఉంది. గద తో శిక్షణ ఎలా చేస్తారో తెలుసుకొని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. గద వ్యాయామం వేల సంవత్సరాల నాటిది అనిభారతదేశం లో వేల సంవత్సరాలు గా ఇది ఆచరణ లో ఉందని నేను మీకు చెప్పాలని అనుకొంటున్నాను. మీరు దీనిని వివిధ స్థాయిల లో ఉన్న వ్యాయామశాలల్లో తప్పక చూసి ఉంటారు. మా స్టార్ట్-అప్‌ ద్వారా దానిని ఆధునిక రూపం లో తిరిగి తీసుకు వచ్చాం. దేశవ్యాప్తం గా మాకు చాలా ఆప్యాయతచక్కటి స్పందన లు లభించాయి. ఇది మాత్రమే కాకుండా భారతదేశం లో అనేక పురాతన వ్యాయామాలుఆరోగ్యానికిఫిట్‌నెస్‌కు సంబంధించిన పద్ధతులు ఉన్నాయని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా నేను చెప్పాలని అనుకొంటున్నాను. వీటి ని మనం స్వీకరించిప్రపంచాని కి నేర్పించాలి. నేను ఫిట్‌నెస్ ప్రపంచాని కి చెందిన వాడి ని. కాబట్టి నేను మీకు వ్యక్తిగత చిట్కా ను ఇవ్వాలని అనుకొంటున్నాను. గద వ్యాయామం తో మీరు మీ బలాన్నిభంగిమ నుశ్వాస ను కూడా మెరుగు పరచుకోవచ్చును. కాబట్టి గద వ్యాయామాన్ని అనుసరించండి. దానిని ముందుకు తీసుకుపొండి. జయ్ హింద్. ’’

మిత్రులారా, ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం . అయితే అందరి ది ఒకే మంత్రం- ‘ఆరోగ్యం గా ఉండండి, ఫిట్‌ గా ఉండండి’ అనేదే. క్రొత్త సంవత్సరం 2024 ను ప్రారంభించడానికి మీ ఫిట్‌నెస్ కంటే పెద్ద సంకల్పం మరొకటి ఏమిటి ఉంటుంది ?

 

నా కుటుంబ సభ్యులారా, కొన్ని రోజుల క్రితం కాశీ లో ఒక ప్రయోగం జరిగింది. దాని ని గురించి నేను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల కు చెప్పాలని అనుకొంటున్నాను. కాశీ- తమిళ సంగమం లో పాల్గొనేందుకు తమిళ నాడు నుండి వేలకొద్దీ ప్రజలు కాశీ కి చేరుకొన్నారు అని మీకు తెలుసు. అక్కడ నేను వారి తో సంభాషించేందుకు కృత్రిమ మేధ కు చెందిన ఎ ఐ టూల్ ‘భాషిణి’ని మొదటిసారి గా ఉపయోగించాను. నేను వేదిక మీద ఉండి హిందీ లో ప్రసంగించాను. కానీ ఎ ఐ సాధనం భాషిణి కారణం గా అక్కడ ఉన్న తమిళ నాడు ప్రజలు నా ప్రసంగాన్ని తమిళ భాష లో విన్నారు. కాశీ-తమిళ సంగమానికి వచ్చిన ప్రజలు ఈ ప్రయోగం పట్ల చాలా ఉత్సాహం గా కనిపించారు. ఒక భాష లో మాట్లాడి, అదే ప్రసంగాన్ని ప్రజలు వారి మాతృ భాష లో ఏక కాలం లో వినే రోజు ఎంతో దూరం లో లేదు. సినిమా ల విషయం లో కూడా అదే జరుగుతుంది. సినిమా హాల్ లో కృత్రిమ మేధ సహాయం తో ఏక కాలం లో అనువాదాన్ని ప్రజలు వినగలుగుతారు. ఈ సాంకేతికత ను మన పాఠశాల లు, ఆసుపత్రులు, న్యాయస్థానాల లో విస్తృతం గా ఉపయోగించడం ప్రారంభించినప్పుడు ఎంత పెద్ద మార్పు జరుగుతుందో మీరు ఊహించవచ్చు. ఏక కాల అనువాదాల కు సంబంధించిన కృత్రిమ మేధ సాధనాల ను మరింత గా అన్వేషించాలని, వాటిని వంద శాతం సామర్థ్యం తో తీర్చిదిద్దాలి అని నేటి యువతరాన్ని నేను కోరుతున్నాను.

 

మిత్రులారా, మారుతున్న కాలం లో మనం మన భాషల ను కాపాడుకోవడంతో పాటు గా వాటి ని ప్రచారం కూడా చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఝార్ ఖండ్‌ లోని ఒక ఆదివాసీ గ్రామాన్ని గురించి చెప్పాలి అని అనుకొంటున్నాను. ఈ గ్రామం అక్కడి పిల్లల కు వారి మాతృభాష లో విద్య ను అందించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొన్నది. గఢ్ వా జిల్లా మంగళో గ్రామం లో బాలల కు విద్య ను కుడుఖ్ భాష లో అందిస్తున్నారు. ఈ పాఠశాల పేరు ‘కార్తిక్ ఉరాఁవ్ ఆదివాసీ కుడుఖ్ స్కూల్’. ఈ పాఠశాల లో 300 మంది ఆదివాసీ పిల్లలు చదువుతున్నారు. ఉరాఁవ్ ఆదివాసీల మాతృభాష కుడుఖ్. ఈ భాష కు లిపి కూడా ఉంది. దీని ని ‘తోలంగ్ సికీ’ అని పిలుస్తారు. ఈ భాష క్రమం గా అంతరించిపోతోంది. దాని ని కాపాడడానికి ఈ సమాజం వారి పిల్లల కు విద్య ను సొంత భాష లో అందించాలి అని నిర్ణయించుకొది. ఆదివాసీ బాలల కు ఇంగ్లీషు భాష కష్టమని, అందుకే ఆ ఊరి పిల్లల కు మాతృభాష లో పాఠాల ను చెప్పడం మొదలుపెట్టామని ఈ పాఠశాల ను ప్రారంభించిన శ్రీ అరవింద్ ఉరాఁవ్ అంటారు. ఆయన ప్రయాస లు మెరుగైన ఫలితాల ను ఇవ్వడం మొదలైనప్పుడు గ్రామస్థులు కూడా ఆయన తో చేరారు. వారి సొంత భాష లో చదువుకోవడం వల్ల పిల్లల అభ్యసన వేగం కూడా పెరిగింది. మన దేశం లో చాలా మంది పిల్లలు భాషా సమస్య తో చదువు ను మధ్యలోనే వదలివేసే వారు. నూతన జాతీయ విద్య విధానం అటువంటి సమస్యల ను తొలగించడం లో కూడా సహాయపడుతుంది. ఏ పిల్లల చదువు కు, ప్రగతి కి భాష ఆటంకం కాకూడదు అనేది మన ప్రయత్నం.

 

మిత్రులారా, దేశం లోని అద్భుతమైన స్త్రీమూర్తుల ద్వారా మన భారతదేశం ప్రతి కాలం లో గర్వం తో నిండిపోయింది. సావిత్రీ బాయి ఫులే జీ, రాణి వేలు నాచియార్ జీ దేశాని కి చెందిన ఇద్దరు మహిళామణులు. వారి వ్యక్తిత్వం దీప స్తంభం లాంటిది. ఇది ప్రతి యుగం లో మహిళా శక్తి ని ముందుకు తీసుకు పోయే మార్గాన్ని చూపుతూనే ఉంటుంది. నేటి నుండి కొన్ని రోజుల తరువాత- అంటే జనవరి మూడో తేదీ న మనం ఈ ఇద్దరి జయంతి వేడుకల ను జరుపుకొంటాం. సావిత్రీబాయి ఫులే జీ అనే పేరు మన మనసు లోకి రాగానే మనకు గుర్తుకు వచ్చేది విద్య, సామాజిక సంస్కరణల రంగం లో ఆమె చేసిన కృషి. మహిళ లు, అణగారిన వర్గాల విద్య కోసం ఆమె ఎప్పుడూ తన గొంతు ను బలం గా వినిపించారు. ఆమె తన కాలం కంటే చాలా ముందున్నారు. తప్పుడు పద్ధతుల ను వ్యతిరేకించడం లో ఎప్పుడూ గొంతు విప్పే వారు. విద్య ద్వారా సమాజ సశక్తీకరణ పై ఆమె కు చాలా విశ్వాసం ఉండింది. బాలికల కోసం అనేక పాఠశాలల ను మహాత్మ ఫులే జీ తో కలసి ఆమె ప్రారంభించారు. ఆమె కవిత లు ప్రజల లో చైతన్యాన్ని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని నింపేవి. అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ప్రకృతి తో సమరస భావన కలిగి జీవనాన్ని సాగించాలని ఆమె ఎల్లప్పుడూ ప్రజల ను కోరే వారు. ఆమె ఎంత దయ గలవారో మాటల్లో చెప్పలేం. మహారాష్ట్ర లో కరువు ఏర్పడినప్పుడు పేదల కు సహాయం చేయడానికి సావిత్రీబాయి, మహాత్మ ఫులే లు వారి ఇంటి తలుపుల ను తెరచి ఉంచారు. సామాజిక న్యాయం విషయం లో అటువంటి ఉదాహరణ చాలా అరుదు గా కనిపిస్తుంది. అక్కడ ప్లేగు భయం ఏర్పడినప్పుడు ఆమె ప్రజలకు సేవ చేయడం లో తలమునుకలు అయ్యారు. ఆ కాలం లో ఆమె స్వయం గా ఈ వ్యాధి బారి న పడ్డారు. మానవత కు అంకితం అయిన ఆమె జీవనం ఇప్పటికీ మనందరికీ స్ఫూర్తిదాయకం.

 

మిత్రులారా, పరాయి పాలన కు వ్యతిరేకం గా పోరాడిన దేశం లోని ఎందరో మహనీయ వ్యక్తుల లో రాణి వేలు నాచియార్ గారు ఒకరు. తమిళ నాడు లోని నా సోదర సోదరీమణులు ఇప్పటికీ ఆమెను ‘వీర మంగయి’ అంటే వీరనారి అనే పేరు తో గుర్తు పెట్టుకొన్నారు. బ్రిటిష్ వారి కి వ్యతిరేకం గా రాణి వేలు నాచియార్ గారు చాటిన ధైర్యం, సాహసాలు, ఆమె పరాక్రమం చాలా స్ఫూర్తిదాయకం. అక్కడ రాజు గా ఉన్న ఆమె భర్త శివగంగై రాజ్యం మీద బ్రిటిష్ వారు చేసిన దాడి లో మరణించారు. రాణి వేలు నాచియార్ గారు, ఆమె కుమార్తె శత్రువుల నుండి ఎలాగోలా తప్పించుకున్నారు. ఆమె మరుదు బ్రదర్స్ అంటే తన కమాండర్ లతో కలసి సేన ను ఏర్పాటు చేయడం లో, సైన్యాన్ని సిద్ధం చేయడం లో చాలా సంవత్సరాలు నిమగ్నమై ఉన్నారు. పూర్తి సన్నద్ధత తో బ్రిటీష్ వారిపై యుద్ధాన్ని మొదలుపెట్టారు. చాలా ధైర్యం తో, సాహసం తో, దృఢ సంకల్పం తో పోరాటం జరిపారు. సైన్యం లో పూర్తి గా మహిళల తో తొలిసారి గా సమూహాన్ని ఏర్పాటు చేసిన వారి లో రాణి వేలు నాచియార్ గారి పేరు ఉంటుంది. ఈ ఇద్దరు వీర మహిళల కు నా శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను.

 

నా కుటుంబ సభ్యులారా, గుజరాత్‌ లో డాయరా సంప్రదాయం ఉంది. రాత్రంతా వేల కొద్దీ ప్రజలు డాయరా లో చేరి వినోదం తో పాటు విజ్ఞానాన్ని కూడా పొందుతున్నారు. ఈ డాయరా లో జానపద సంగీతం, జానపద సాహిత్యం, హాస్యం ల యొక్క త్రివేణీ సంగమం అందరి మది లో ఆనందాన్ని నింపుతున్నది. సోదరుడు జగదీశ్ త్రివేదీ గారు ఈ డాయరా కు చెందిన ప్రముఖ కళాకారులు. హాస్యనటుడి గా సోదరుడు జగదీశ్ త్రివేదీ గారు ముప్ఫయ్ సంవత్సరాల కు పైగా తన ప్రభావాన్ని కొనసాగించారు. ఇటీవల నాకు ఆయన నుండి ఒక లేఖ వచ్చింది. దాంతో పాటు ఆయన తన గ్రంథమొకటి పంపారు. ఆ గ్రంథం పేరు ‘సోశల్ ఆడిట్ ఆఫ్ సోశల్ సర్వీస్’. ఆ గ్రంథం చాలా విశిష్టమైంది. అందులో అకౌంటింగ్ బుక్ ఉంది. అది ఒక రకమైన బాలెన్స్ శీట్. సోదరుడు జగదీశ్ త్రివేదీ గారు గత ఆరు సంవత్సరాల లో వివిధ కార్యక్రమాల నుండి పొందిన ఆదాయం, ఖర్చు లకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రంథం లో ఇచ్చారు. ఈ బాలెన్స్ శీట్ ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన తన మొత్తం ఆదాయాన్ని, ప్రతి ఒక్క రూపాయి ని సమాజం కోసం ఖర్చు పెట్టారు. పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం, వికలాంగుల కు సంబంధించిన సంస్థ లు మొదలైన వాటి కోసం సమాజ సేవ లో పూర్తి ఆరు సంవత్సరాల ఆదాయాన్ని ఖర్చు పెట్టారు. గ్రంథం లో ఒక చోట రాసినట్లు గా 2022వ సంవత్సరం లో ఆయన తన కార్యక్రమాల ద్వారా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు సంపాదించారు. పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం కోసం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఖర్చు చేశారు. తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. నిజాని కి దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది. తన కు 2017వ సంవత్సరం లో 50 ఏళ్లు నిండినప్పుడు తన కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటి కి తీసుకుపోకుండా సమాజాని కి ఖర్చు చేస్తాను అని సోదరుడు జగదీశ్ త్రివేది గారు ఒక సందర్భం లో ప్రకటించారు. వివిధ సామాజిక కార్యక్రమాల కోసం 2017 నుండి ఆయన సుమారు ఎనిమిది కోట్ల డెబ్భయ్ అయిదు లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఒక హాస్యనటుడు తన మాటల తో అందరినీ నవ్వించేలా చేస్తాడు. అయితే లోలోపల ఎంత సున్నితత్వం ఉంటుందో సోదరుడు జగదీశ్ త్రివేదీ గారి జీవనం లో చూడవచ్చు. ఆయనకు మూడు పీహెచ్‌డీ డిగ్రీ లు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 75 గ్రంథాలను వ్రాశారు. వాటిలో చాలా గ్రంథాల కు పురస్కారాలు కూడా వచ్చాయి. సామాజిక సేవ కు కూడా ఎన్నో పురస్కారాలు స్వీకరించారు. సోదరుడు జగదీశ్ త్రివేదీ గారి కి ఆయన యొక్క సామాజిక సేవ కు గాను నేను శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.

 

నా కుటుంబ సభ్యులారా, అయోధ్య లో రామ మందిరం విషయం లో దేశవ్యాప్తం గా ఆసక్తి, ఉత్సాహం ఉన్నాయి. ప్రజలు వారి భావాల ను విధ విధాలు గా వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులు గా శ్రీరాముడు, అయోధ్య కు సంబంధించి అనేక కొత్త పాట లు, కొత్త భజన లు స్వరపరచడం మీరు తప్పక చూసి ఉంటారు. చాలా మంది కొత్త కవిత లు కూడా రాస్తున్నారు. ఇందులో చాలా మంది అనుభవజ్ఞులైన కళాకారులు ఉన్నారు. క్రొత్త, వర్ధమాన యువ కళాకారులు కూడా మనసు కు హత్తుకొనే భజనల ను స్వర పరిచారు. నేను నా సామాజిక మాధ్యం లో కొన్ని పాటల ను, భజనల ను కూడా వెల్లడించాను. ఈ చారిత్రక ఘట్టం లో కళారంగం తనదైన ప్రత్యేక శైలి లో భాగస్వామి అవుతోంది అని తెలుస్తున్నది. అటువంటి మొత్తం రచనల ను మనమందరం ఉమ్మడి హ్యాష్‌ట్యాగ్‌ తో పంచుకోవాలని నేను భావిస్తున్నాను. #shriRamBhajan అనే హ్యాష్‌ట్యాగ్‌ తో సామాజిక మాధ్యం లో మీ రచనల ను పంచుకోవలసిందిగా మీకు నేను వి జ్ఞ‌ ప్తి చేస్తున్నాను. భావోద్వేగాల తో, భక్తి తో కూడిన ఈ సమాహారం సర్వం రామ మయం అయ్యేలా ఒక ప్రవాహం గా మారుతుంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఇంతే! 2024 వ సంవత్సరం ముగింపునకు ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. భారతదేశం సాధించినటువంటి విజయాలు భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి సాధించినటువంటి విజయాలు అని చెప్పాలి. పంచ్ ప్రణ్ సూత్రాల ను దృష్టి లో పెట్టుకొని భారతదేశం యొక్క అభివృద్ధి కి నిరంతరం కృషి చేయాలి. మనం ఏ పని ని చేసినా, ఏ నిర్ణయాన్ని తీసుకున్నా, దాని వల్ల దేశాని కి లభించే ప్రయోజనమే మన మొదటి ప్రమాణం కావాలి. దేశాని కే మొదటి ప్రాధాన్యం. నేశన్ ఫస్ట్ - ఇంతకంటే గొప్ప మంత్రం లేదు. ఈ మంత్రాన్ని అనుసరించి, భారతీయులం అయినటువంటి మనం మన దేశాన్ని అభివృద్ధి తో, స్వావలంబన తో తీర్చి దిద్దుదాం. మీరందరూ 2024వ సంవత్సరం లో విజయాల నూతన శిఖరాల ను చేరుకోవాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరంతా ఆరోగ్యం గా ఉండాలని, ఫిట్‌ గా ఉండాలని, పూర్తి సంతోషం గా ఉండాలని కోరుకొంటున్నాను. ఇదే నా ప్రార్థన. దేశ ప్రజల నవీన విజయాల ను గురించి 2024వ సంవత్సరం లో మరో సారి చర్చించుదాం. చాలా చాలా ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage