Quote1.7 లక్షల మంది కి పైగా లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టికార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు
Quote‘‘గ్రామాల లో గల సంపత్తి ని, భూమి ని,గృహయాజమాన్య రికార్డుల ను అనిశ్చిత బారి నుంచి,అవిశ్వాసంబారి నుంచి విముక్తం చేయడం అనేది కీలకం’’
Quote‘‘స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు అయినప్పటికీ, గ్రామాల అంతర్గత శక్తి బందీ గానే ఉంది. పల్లెల అధికారాన్ని, భూమి శక్తి ని,గ్రామాలలో ప్రజల ఇళ్ళ అంతర్గత శక్తి ని పూర్తి స్థాయి లో ఉపయోగించుకో లేకపోతున్నాం’’
Quote‘‘స్వామిత్వ పథకం అభివృద్ధి కి ఒక కొత్త మంత్రం గా ఉంది; అంతేకాదు ఆధునిక సాంకేతిక విజ్ఞానం అండ తో గ్రామాల లో నమ్మకాన్నిమెరుగు పరచడం జరుగుతోంది’’
Quote‘‘ఇప్పుడు ప్రభుత్వమే పేదల వద్దకు వెళ్తూ, వారికి సాధికారిత ను కల్పిస్తోంది’’
Quote‘‘భారతదేశాన్ని కొత్త శిఖరాల కు తీసుకుపోయే సామర్థ్యం డ్రోన్లకు ఉంది’’

మధ్య ప్రదేశ్ లోని ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఇదే కార్యక్రమం లో 1,71,000 మంది లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టి కార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, లబ్ధిదారులు, గ్రామాల అధికారులు, జిల్లాల అధికారుల తో పాటు రాష్ట్రం అధికారులు కూడా పాలుపంచుకొన్నారు.

హాండియా, హర్ దా కు చెందిన శ్రీ పవన్ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సంపత్తి కార్డు ను అందుకొన్న తరువాత ఎటువంటి అనుభవం కలిగిందని అడిగారు. శ్రీ పవన్ ఆ కార్డు తో తాను రెండు లక్షల తొంభై వేల రూపాయల రుణాన్ని అందుకొని ఒక దుకాణాన్ని అద్దె కు ఇచ్చానని, రుణాన్ని తిరిగి చెల్లించడం ఈ సరికే మొదలుపెట్టానని సమాధానాన్ని ఇచ్చారు. డిజిటల్ లావాదేవీల ను పెంచవలసింది గా శ్రీ పవన్ కు ప్రధాన మంత్రి సూచించారు. గ్రామం లో డ్రోన్ ద్వారా సర్వేక్షణ జరగడం పై పల్లె ఏమనుకొంటోంది? అని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో చర్చించారు. కార్డు ను పొందే ప్రక్రియ సాఫీ గా సాగిందని, తన జీవనం ఒక సకారాత్మకమైన పరివర్తన కు లోనైందని శ్రీ పవన్ చెప్పారు. పౌరుల ‘జీవనం లో సౌలభ్యాన్ని’ ఇనుమడింప జేయాలనేది ప్రభుత్వం ప్రాథమ్యం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

|

పిఎమ్ స్వామిత్వ పథకం ద్వారా సంపత్తి కార్డు ను అందుకొన్నందుకు శ్రీ ప్రేమ్ సింహ్ ను ప్రధాన మంత్రి అభినందించారు. డ్రోన్ ల ద్వారా మేపింగ్ కు పట్టిన కాలాన్ని గురించి ప్రధాన మంత్రి ఆరా తీశారు. సంపత్తి కార్డు ను తీసుకున్న తరువాత ఏమి చేయబోతున్నారు? అంటూ శ్రీ ప్రేమ్ సింహ్ ను ప్రధాన మంత్రి అడిగారు. శ్రీ ప్రేమ్ సమాధానమిస్తూ, తన ఇంటి ని పక్కా ఇల్లు గా మార్చుకోదలుస్తున్నానన్నారు. ఈ పథకం గురించి మీకు ఎలా తెలిసింది? అని ప్రధాన మంత్రి ఆయన ను ప్రశ్నించారు. పేద ల, వంచిత వర్గాల సంపత్తి హక్కుల కు సురక్షత లభిస్తుండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ పథకం లో భాగం గా సంపత్తి కార్డు ను అందుకొన్న తరువాత ఏమి చేయదలచారు? అంటూ బుధ్ నీ-సీహోర్ కు చెందిన శ్రీమతి వినీతా బాయి ని ప్రధాన మంత్రి వాకబు చేశారు. బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఒక దుకాణం తెరవాలనుకొంటున్నానని ఆమె జవాబిచ్చారు. తన సంపత్తి విషయం లో తనకు ఇప్పుడు సురక్షత భావన కలిగిందని ఆమె తెలిపారు. ఈ పథకం వల్ల న్యాయస్థానాల లో కేసుల భారం తగ్గుతుందని, గ్రామాలు, దేశం పురోగమిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీమతి వినీత బాయి కుటుంబానికి ప్రధాన మంత్రి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

|

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పిఎమ్ స్వామిత్వ పథకం ప్రారంభం కావడం తో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సులభతరం అయిందన్నారు. ఈ పథకాన్ని శరవేగం గా అమలు పరచినందుకు మధ్య ప్రదేశ్ ను ఆయన ప్రశంసించారు. ఈ రోజు న రాష్ట్రం లో 3,000 గ్రామాల లో ఒక లక్షా డెబ్భయ్ వేల కుటుంబాలు కార్డుల ను స్వీకరించాయి. ఈ కార్డు వారి కి సమృద్ధి ని తెచ్చిపెట్టే ఒక వాహనం లాగా మారుతుంది అని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క ఆత్మ పల్లెల లోనే ఉంటుంది అనే మాటలు తరచు వినపడుతూ ఉంటాయి; అయితే, స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాల కాలం గడచిపోయినప్పటికీ, పల్లెల సత్తా సంకెళ్ళ లోనే మిగిలిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. గ్రామాల కు ఉన్న అధికారాన్ని, భూమి యొక్క శక్తి ని, గ్రామాల లో ప్రజల గృహాల అంతర్గత శక్తి ని వారి అభివృద్ధి కోసం పూర్తి స్థాయి లో వినియోగించడం సాధ్యపడలేదని ఆయన అన్నారు. దీనికి భిన్నం గా, గ్రామీణ ప్రజల శక్తి, ప్రజల కాలం, ప్రజల డబ్బు ఆ పల్లె లోని భూముల, గృహాల అక్రమ ఆక్రమణ లు, పోట్లాట లు, వివాదాల లో వృథా గా పోయింది అని ఆయన అన్నారు. ఈ సమస్య ను గురించి మహాత్మ గాంధీ సైతం ఏ విధం గా ఆందోళన చెందారో ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ‘సమరస్ గ్రామ పంచాయతీ యోజన’ ను అమలు పరచిన సంగతి ని శ్రీ నరేంద్ర మోదీ జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.

కరోనా కాలం లో పల్లెలు నడచుకొన్న తీరు ను ప్రధాన మంత్రి అభినందించారు. భారతదేశం లో పల్లెలు ఏ విధం గా ఒకే లక్ష్యాన్ని సాధించడానికి కలసికట్టు గా కృషి చేసి గొప్ప నిఘా ద్వారా మహమ్మారి ని పరిష్కరించిన వైనాన్ని గురించి ఆయన వివరించారు. భారతదేశం లోని గ్రామాలు విడి గా జీవించేందుకు ఏర్పాటుల ను చేయడం, బయటి నుంచి వచ్చే వ్యక్తుల కు వారి ఆహారానికి సంబంధించిన, వారు జీవనం సాగించేందుకు సంబంధించిన ఏర్పాటుల ను చేయడం, ఇంకా టీకామందు ను తీసుకోవడం వంటి ముందు జాగ్రత చర్యల తో చాలా ముందు భాగం లో నిలచాయి అని కూడా ఆయన అన్నారు. కఠినమైన కాలాల్లో మహమ్మారి ని అరికట్టడం లో పల్లె లు ఒక ప్రముఖ పాత్ర ను పోషించాయని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం లోని గ్రామాల ను, గ్రామీణ సంపత్తి ని, భూమి ని, గృహాల కు సంబంధించిన రికార్డు లను అనిశ్చితత్వం బారి నుంచి, అవిశ్వాసం బారి నుంచి విముక్తి చేయడం ఎంతైనా ముఖ్యం అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పిఎం స్వామిత్వ యోజన గ్రామాల లోని మన సోదరీమణుల కు మరియు సోదరుల కు ఒక పెద్ద బలం కానుంది అని కూడా ఆయన పేర్కొన్నారు.

స్వామిత్వ పథకం సంపత్తి దస్తావేజు పత్రాల ను అందించేటటువంటి ఒక పథకం మాత్రమే కాదని, అది అభివృద్ధి సాధన కు ఒక నూతన మంత్రం కూడా అని, అలాగే ఆధునిక సాంకేతిక విజ్ఞానం సాయం తో దేశం లోని గ్రామాల లో నమ్మకాన్ని మెరుగుపరచే పథకం కూడా అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘గ్రామాల లో మరియు నివాస సముదాయాల లో సర్వేక్షణ కోసం ఉడన్ ఖటోలా (డ్రోన్) ఎగురుతూ వస్తోంది, ఇది భారతదేశం లోని పల్లెల కు ఒక కొత్త రెక్కల ను తొడుగుతోంది’’ అని ఆయన అన్నారు.

|

గత ఆరేడేళ్ళు గా ప్రభుత్వం చేసిన కృషి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, అది పేదల ను ఎవరి పైనా ఆధారపడకుండా చూడటానికి ఉద్దేశించిందే అని అన్నారు. ప్రస్తుతం రైతుల కు చిన్న చిన్న వ్యవసాయ అవసరాల కోసం డబ్బును ‘పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’ లో భాగం గా వారి బ్యాంకు ఖాతాల కు నేరు గా పంపించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. పేద ప్రజానీకం ప్రతి పని కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన రోజులు ఇక చెల్లిపోయాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వమే పేదల ముంగిటికి వస్తోందని, వారికి సాధికారిత ను కల్పిస్తోందని ఆయన అన్నారు. ప్రజల కు హామీ లేకుండానే రుణాలు ఇచ్చేందుకు నిధుల ను అందిస్తున్న ముద్ర యోజన ను ఆయన ఒక ఉదాహరణ లాగా ప్రస్తావించారు. గడచిన 6 సంవత్సరాల లో 15 లక్షల కోట్ల రూపాయల విలువైన సుమారు 29 కోట్ల రుణాల ను ప్రజల కోసం ఆమోదించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశం లో 70 లక్షల స్వయం సహాయ సమూహాలు పని చేస్తున్నాయని, మరి మహిళల ను జన్ ధన్ ఖాతా ల మాధ్యమం ద్వారా బ్యాంకింగు వ్యవస్థ తో జోడించడం జరుగుతోందని ఆయన చెప్పారు. స్వయం సహాయ సమూహాల కు హామీ లేకుండా మంజూరు చేసే రుణాల పరిమితి ని 10 లక్షల నుంచి 20 లక్షల కు పెంచాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. స్వనిధి పథకం లో 25 లక్షల మంది కి పైగా వీధి వ్యాపారస్తులు రుణాల ను అందుకొన్నారని ఆయన తెలిపారు.

డ్రోన్ టెక్నాలజీ నుంచి రైతులు, రోగులు, సుదూర ప్రాంతాలు గరిష్ఠ ప్రయోజనాల ను పొందేటట్లుగా అనేక విధాన నిర్ణయాల ను ఈ మధ్య కాలం లో తీసుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో డ్రోన్ ల ఉత్పత్తి ని ప్రోత్సహించడం కోసం ఒక పిఎల్ఐ స్కీము ను కూడా ప్రకటించడమైంది. తత్ఫలితం గా భారతదేశం లో పెద్ద సంఖ్య లో అధునాతనమైన డ్రోన్ లను తయారు చేయడానికి వీలవుతుంది; దీనితో ఈ ముఖ్యమైన రంగం లో భారతదేశం స్వావలంబన ను సాధిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో తక్కువ ఖర్చు తో కూడిన డ్రోన్ లను తయారు చేయడం కోసం ముందుకు రావలసిందిగా శాస్త్రవేత్తల కు, ఇంజినీర్ లకు, సాఫ్ట్ వేర్ రూపకర్తల కు, స్టార్ట్-అప్ ఆంత్ర ప్రన్యోర్ లకు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ‘‘భారతదేశాన్ని సరికొత్త శిఖరాల కు తీసుకుపోయే సామర్ధ్యం డ్రోన్ లకు ఉంది’’ అని కూడా ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Chhatrapati Shivaji Maharaj on his Jayanti
February 19, 2025

The Prime Minister, Shri Narendra Modi has paid homage to Chhatrapati Shivaji Maharaj on his Jayanti.

Shri Modi wrote on X;

“I pay homage to Chhatrapati Shivaji Maharaj on his Jayanti.

His valour and visionary leadership laid the foundation for Swarajya, inspiring generations to uphold the values of courage and justice. He inspires us in building a strong, self-reliant and prosperous India.”

“छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीनिमित्त मी त्यांना अभिवादन करतो.

त्यांच्या पराक्रमाने आणि दूरदर्शी नेतृत्वाने स्वराज्याची पायाभरणी केली, ज्यामुळे अनेक पिढ्यांना धैर्य आणि न्यायाची मूल्ये जपण्याची प्रेरणा मिळाली. ते आपल्याला एक बलशाली, आत्मनिर्भर आणि समृद्ध भारत घडवण्यासाठी प्रेरणा देत आहेत.”