ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే 22వ తేదీ నాడు ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) యొక్క మూడో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం పోర్ట్ మోరెస్ బీ ని తాను సందర్శించిన సందర్భం లో. పసిఫిక్ ఐలండ్ దేశాల ఇండియన్ టెక్నికల్ ఎండ్ ఇకానామిక్ కోఆపరేశన్ (ఐటిఇసి) కోర్సు ల పూర్వ విద్యార్థుల తో మాట్లాడారు. ఈ పూర్వ విద్యార్థుల లో ప్రభుత్వ సీనియర్ అధికారులు, అగ్రగామి వృత్తి నిపుణులు మరియు సాముదాయిక నాయకులు ఉన్నారు. వారంతా ఐటిఇసి లో భాగం గా భారతదేశం లో శిక్షణ ను అందుకొన్నారు. వారు భారతదేశం లో ఆర్జించిన నైపుణ్యాల ను ఉపయోగిస్తూ వారి వారి సమాజాల కు తోడ్పాటు ను అందిస్తున్నారు.
పూర్వ విద్యార్థుల వ్యక్తిగత సాఫల్యాలకు మరియు వారి కార్యసాధనల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. దేశాలు వాటి యొక్క అభివృద్ధి లక్ష్యాల ను అందుకోవడం లో ప్రత్యేకించి సుపరిపాలన, జలవాయు పరివర్తన, సామాన్యులు ఉపయోగించే డిజిటల్ గూడ్స్ మరియు నిరంతర అభివృద్ధి వంటి రంగాల లో భారతదేశాని కి చెందిన సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ప్రముఖ పాత్ర ను పోషించడాన్ని గురించి ఆయన ప్రముఖం గా ప్రకటించారు. ఆ కోవ కు చెందిన సామర్థ్య నిర్మాణ ప్రయాసల కు భారతదేశం అండదండల ను అందిస్తూనే ఉంటుంది అని ఆయన అన్నారు. 2015 వ సంవత్సరం లో గడచిన ఎఫ్ఐపిఐసి సమిట్ అనంతరం, భారతదేశం ఈ ప్రాంతం లోని అన్ని దేశాల కు చెందిన సుమారు ఒక వేయి మంది అధికారుల కు శిక్షణ ను ఇచ్చింది. వ్యవసాయం మరియు తత్సంబంధి రంగాల లో పనిచేస్తున్నటువంటి ఏజెన్సీల కు సాయపడడం కోసం ఆ దేశాల లో దీర్ఘకాలిక డిప్యూటేశన్ పై నిపుణుల ను కూడా భారతదేశం పంపించింది.
Prime Minister @narendramodi interacted with alumni of the @ITECnetwork from across Pacific Island Countries (PIC). pic.twitter.com/k5sKePSJ8d
— PMO India (@PMOIndia) May 22, 2023